భారీ వర్షాలకు ఉప్పల్​లో కుంగిన రోడ్డు - గుంతలో ఇరుక్కుపోయిన కారు చక్రం - pothole has formed on Uppal Road - POTHOLE HAS FORMED ON UPPAL ROAD

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jul 16, 2024, 1:19 PM IST

Pothole Has Formed On Uppal Road : హైదరాబాద్​లో ఇటీవల కురిసిన కుండపోత వర్షాల కారణంగా ఉప్పల్​లోని వరంగల్​ జాతీయ రహదారి కొంతభాగం కుంగింది. ఉప్పల్​లోని వరంగల్ జాతీయ రహదారిపై నిర్మిస్తున్న కారిడార్​ రెండు పిల్లర్ల పక్కన రోడ్డు కుంగి గుంత ఏర్పడింది. ఈ కుంగిన ప్రాంతంలోనే ఓ కారు చక్రం దిగిపోయింది. అతి కష్టం మీద వాహనాన్ని బయటకు తీశారు. పిల్లర్​ చుట్టూ వర్షం ధాటికి మట్టి భూమిలోకి కూరుకుపోవడంతో చీరికలు ఏర్పడ్డాయి. 

కాగా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేనప్పటికీ ఈ మార్గంలో వాహనాలు నిదానంగా ముందుకు సాగుతున్నాయి. గత రెండు రోజులుగా నగరంలో కురిసిన ఎడతెరిపిలేని వర్షాలకు హైదరాబాద్​లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు పాదచారులు ఇబ్బందులు పడ్డారు. డ్రైనేజీ రోడ్లపై మురుగునీరు ప్రవహించడంతో పలు కాలనీలు దుర్గంధంలో చిక్కుకున్నాయి. వరదనీరు రోడ్లపైకి ప్రవహించింది. దీంతో ప్రయాణీాకులు ఇబ్బందులకు ఎదురయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నిండుకుండలను తలపించాయి.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.