జీడిమెట్ల పారిశ్రామికవాడలో రొయ్యల దాణా కంపెనీలో అగ్నిప్రమాదం - Fire Accident In Jeedimetla - FIRE ACCIDENT IN JEEDIMETLA

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Telangana Team

Published : Jul 9, 2024, 2:50 PM IST

Fire Accident In Jeedimetla : జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పైప్​లైన్​ రోడ్​లో గల రొయ్యల దాణా తయారీ కంపెనీలో ఈ ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న ఫైర్​ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఒక్కసారిగా జరిగిన ఈ ఆకస్మిక పరిణామం స్థానికంగా కలకలం రేపింది.  

స్థానికుల సమాచారం ప్రకారం జీడిమెట్ల పారిశ్రామికవాడలోని పైప్​లైన్​ రోడ్​లో రొయ్యల దాణా కంపెనీ ఉంది. ఉదయం ఒక్కసారిగా గోదాముల నుంచి దట్టమైన పొగలు రావడాన్ని స్థానికులు గమనించారు. దీంతో పోలీసులకు సమాచారమిచ్చారు. స్థానికుల నుంచి సమాచారమందుకున్న పోలీసులు, ఫైర్​ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మూడు అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పివేశారు. అయితే ప్రమాదానికి కారణం షార్ట్​ సర్క్యూట్​ అయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆస్తినష్టం ఎంతమేరకు జరిగిందనేది ఇంకా తెలియరావాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.