ఓటు వేసేందుకు వచ్చి మృతి చెందిన వృద్ధురాలు - Old lady Died After Voting - OLD LADY DIED AFTER VOTING
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-05-2024/640-480-21460536-thumbnail-16x9-88-year-old-woman-dies-after-voting-in-anakapalli.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 13, 2024, 7:57 PM IST
88 Year Old Woman Dies After Voting in Anakapalli : అనకాపల్లి జిల్లా గాంధీ గ్రామంలో ఓటు వేసేందుకు వచ్చిన 88 ఏళ్ల వృద్ధురాలు జయవరపు నాగాయమ్మ మృతి చెందారు. గాంధీ గ్రామం సిటిజన్ కాలనీలో ఉన్న అంకుపాలెం (హెచ్) మండల పరిషత్ పాఠశాలలో 181 పోలింగ్ బూత్‌లో ఆమె ఓటేశారు. ఓటేసిన పోలింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చి సొమ్ము సిల్లి పడిపోయింది. వెంటనే స్థానికులు వైద్యుడ్ని పిలిపించి చికిత్స అందించారు. అప్పటికే ఆవిడ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోలింగ్ వేళ వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
రాష్ట్రంలో పలు చోట్ల పోలింగ్ బూత్‌లలో దాడులు జరిగాయి. పలు పల్నాడులో వైఎస్సార్సీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. మహిళలు అని కూడా చూడకుండా రక్తం వచ్చేలా కొట్టారు. అదేెంటని ప్రశ్నించిన వారిపై దాడులు చేశారు. పోలింగ్ బూత్‌లలో అరాచకంగా చొరబడి అధికారులను సైతం దుర్బాషలాడారు. ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలను వైఎస్సార్సీపీ నేతలు దాష్టీకాలతో చెడగొట్టారు.