మంత్రాలయంలో అద్భుతం - 52 అడుగుల అభయ రాముడు విగ్రహం ప్రతిష్ఠ
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 23, 2024, 5:47 PM IST
52 Feet Rama Idol in Mantralayam : అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా మంత్రాలయంలో సోమవారం 52 అడుగుల అభయ రాముడు విగ్రహన్ని ప్రతిష్ఠించారు. ముందుగా అభయ రామ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. అంతకు ముందు శ్రీమఠం నుంచి రామచంద్ర స్వామి ఉత్సవ విగ్రహనికి మంగళహరతి ఇచ్చి ఊరేగించారు. వేలాది మంది భక్తజన సందోహం మధ్య మేళ తాళాలతో ప్రారంభమైన ఊరేగింపు గ్రామదేవత మంచాలమ్మ ఆలయం ముందు నుంచి ప్రారంభమైంది. ఈ ఊరేగింపులో ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.
మంత్రాలయం పీఠాధిపతి సుభుదేందు తీర్థులు క్రేన్ సాయంతో స్వామి వారికి పూజలు చేశారు. శ్రీ అభయరామ సేవా ఫౌండేషన్, రాఘవేంద్ర స్వామి మఠం ఆధ్వర్యంలో తుంగభద్ర నదీ తీరంలోని గోశాల సమీపంలో 52 అడుగుల ఏకశిలా రామ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. త్వరలో 6 ఎకరాల్లో 8 కోట్ల రూపాయలతో రామ మందిరం నిర్మించనున్నట్లు మఠాధిపతులు పేర్కొన్నారు.