కార్గిల్ వీరుల త్యాగాలకు ఆర్మీ నివాళి- అనంతపురం చేరిన పాన్‌ ఇండియా బైక్‌ యాత్ర - Kargil Vijay Diwas 25th anniversary - KARGIL VIJAY DIWAS 25TH ANNIVERSARY

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 17, 2024, 12:51 PM IST

Updated : Jun 17, 2024, 1:28 PM IST

Pan India Bike Yatra reaches Anantapur in Andhra Pradesh : కార్గిల్‌ విజయ దివస్‌ మహోత్సవంలో భాగంగా భారత సైన్యం, ఆర్టిలరీ విభాగం నిర్వహించిన పాన్‌ ఇండియా బైక్‌ యాత్ర అనంతపురానికి చేరుకుంది. కార్గిల్‌ అమరవీరులను స్మరించుకుంటూ వారి త్యాగాలకు నివాళిగా ధనుష్కోటి నుంచి బెంగళూరు మీదుగా వచ్చిన సైనికులకు సంజీవ రెడ్డి స్టేడియంలో జిల్లా కలెక్టర్‌ వినోద్‌ కుమార్‌ ఘన స్వాగతం పలికారు. యాత్రలో పాల్గొన్న మాజీ సైనికులను కలెక్టర్‌ అభినందించారు. 25 ఏళ్ల క్రితం మన జవాన్లు కార్గిల్‌ యుద్ధంలో ప్రాణాలు త్యజించి విజయం సాధించారని గుర్తు చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కార్గిల్ యుద్ధ వీరుల శౌర్యం, త్యాగాలకు నివాళిగా, భారత సైన్యం పాన్-ఇండియా మోటార్‌సైకిల్ యాత్రను ప్రారంభించిందన్నారు. ఈ సాహసయాత్రలో మన వీర సైనికుల గురించి తెలియజేస్తూ అవగాహన పెంచుతారని, భారతీయ సైన్యంలో చేరడానికి యువతను ప్రోత్సహిస్తారన్నారన్నారు. ఈ యాత్ర కేవలం నివాళి మాత్రమే కాదు, భారత సైన్యం శాశ్వత స్ఫూర్తికి చిహ్నమన్నారు.

Last Updated : Jun 17, 2024, 1:28 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.