ఊయలలో బిడ్డ చిటికెలో మాయం - సీసీ టీవీ ఫుటేజీలో షాకింగ్ దృశ్యాలు - KIDNAP IN NELLORE
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 29, 2024, 3:40 PM IST
Boy kidnapped : తల్లి స్నానానికి వెళ్లి వచ్చేలోపు కన్నబిడ్డ కనిపించకుండా పోయిన ఘటన నెల్లూరు జిల్లా కావలిలోని వెంగళరావునగర్లో జరిగింది. బాధిత మహిళ, పోలీసులు తెలిపిన ప్రకారం.. వివరాల్లోకి వెళ్తే పల్లపు రాజేశ్వరి అనే మహిళ తన 14 నెలల కుమారుడు తేజను ఊయలలో పడుకోబెట్టి స్నానానికి వెళ్లారు. తిరిగి వచ్చి చూడగా కనిపించలేదు. బాధితురాలు కావలి రెండో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాలుడిని గుర్తు తెలియని మహిళ అపహరించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. సీసీ కెమెరాల దృశ్యాల ఆధారంగా పోలీసులు చిన్నారి ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నారి అపహరణపై తమకు ఎవరి మీద అనుమానం లేదని చిన్నారి తల్లి రాజేశ్వరి తెలిపారు. ఇంట్లో ఎవరూ లేక పోవడంతో చిన్నారిని ఒంటరిగా ఊయలలో పడుకోబెట్టి తాను స్నానానికి వెళ్లినట్లు తెలిపారు. ఈ క్రమంలో తిరిగి వచ్చే సరికి చిన్నారి అదృశ్యం అయ్యాడని అన్నారు.