thumbnail

పామాయిల్​ తోటలో 12 అడుగుల కింగ్​ కోబ్రా - రైతన్నల ఆందోళన

By ETV Bharat Andhra Pradesh Team

Published : 2 hours ago

Updated : 2 hours ago

12 Feet  King Cobra in Palm Oil Crops in Manyam District : పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలంలోని జంపర్​కోట పంచాయతీ పరిధిలోని వెంకటనాయుని వలస గ్రామ సమీపంలో శుక్రవారం కింగ్ కోబ్రా కలకలం రేపింది. దీనిని చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. జంపర్​కోట గ్రామానికి చెందిన ఫైల్ సత్తిబాబు అనే రైతు పామాయిల్ తోటలో 12 అడుగుల కింగ్ కోబ్రా సంచరిస్తుంది. అదే రహదారిలో వెళ్తున్న కొందరు రైతులు దాన్ని గుర్తించారు. గ్రామస్థుల సాయంతో సత్తిబాబు దాన్ని హత మార్చారు. నెలరోజులు కిందట ఇదే ప్రాంతంలో మరో కింగ్ కోబ్రాను గ్రామస్థులు హతమార్చినట్లు చెప్పారు. తరచూ ఈ ప్రాంతంలో కింగ్​ కోబ్రాలు కనిపిస్తున్నాయని గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

కోబ్రా సుమారు 12 నుంచి 15 అడుగుల పొడవు ఉంటుంది. ఇది కంటపడితే వణుకు పుడుతుంది. అలాంటిది తమ పొలాల్లో తరచూ సంచరిస్తుండటంతో వెంకటనాయుని పాలెం గ్రామస్థులు భయబ్రాంతులకు గురవుతున్నారు. అటవీ అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

Last Updated : 2 hours ago

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.