108 వాహనం బోల్తా- బాధితులను కాపాడిన స్థానికులు - 108 Vehicle accident - 108 VEHICLE ACCIDENT
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 11, 2024, 1:01 PM IST
108 Vehicle Overturned in Satya Sai District : అందరికి వైద్యం చేసే వైద్యునికి సుస్తీ చేసినట్లు, రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని, రోగులను అత్యవసర సమయంలో స్థానిక ఆసుపత్రి తీసుకువెళ్లే 108 వాహనికి ప్రమాదం జరిగింది. ఈ సంఘటన సత్య సాయి జిల్లాలో చోటుచేసుకుంది. కొత్త కమ్మవారిపల్లి నుంచి రోగులను తీసుకెళ్లేందుకు కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి బయలుదేరిన వాహనం ప్రమాదానికి గురైంది. నల్లచెరువు మండలం మలుపులో అదుపుతప్పి బోల్తా పడింది.
Nallaceruvu Satya Sai District : ప్రమాదంలో 108 సిబ్బందితో పాటు ఇద్దరు రోగులు గాయపడ్డారు. ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానికులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను 108 వాహనం నుంచి కిందికి దించారు. గాయపడిన వారిని మరో 108 వాహనం సహాయంతో కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులకు స్వల్ప గాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నల్లచెరువు మండలం మలుపు వద్ద ఉన్న రాయిని 108 వాహన డ్రైవర్ చూసుకోకుండా ఎక్కించడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం