YouTube Big Update: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యూట్యూబ్ తన వినియోగదారులకు గుడ్ న్యూస్ తెచ్చింది. కంటెంట్ క్రియేటర్స్ ఇకపై మూడు నిమిషాల పాటు అత్యధిక నిడివి గల షార్ట్స్‌ను అప్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. అక్టోబర్ 15 నుంచి ఈ సేవలు అందుబాటులో ఉంటాయిని వెల్లడించింది. గతంలో యూట్యూబ్ షార్ట్స్ వీడియోల గరిష్ఠ వ్యవధి 60 సెకన్లకు మాత్రమే ఉండేది. అయితే ప్రస్తుతం కంటెంట్‌ను క్రియేట్ చేసేందుకు తన యూజర్స్‌కు యూట్యూబ్ మరిన్ని మార్గాలను అందిస్తుంది.
"ఈ మార్పు అనేది యాస్పెక్ట్ రేషియోలో స్క్వేర్ లేదా లాంగ్ లెన్త్ వీడియోలకు మాత్రమే వర్తిస్తుంది. దీంతోపాటు అక్టోబర్ 15లోపు మీరు అప్‌లోడ్ చేసిన ఏ వీడియోలపై కూడా ఇది ఎటువంటి ప్రభావం చూపదు. రాబోయే నెలల్లో లాంగ్ షార్ట్స్ కోసం కావాల్సిన అంశాలను మెరుగుపరిచేందుకు మేము కృషి చేస్తాము." అని కంపెనీ ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది.
కంటెంట్ క్రియేటర్స్ తమ వీడియోలను దీర్ఘకాలంగా ఉంచేందుకు వారు 16:9 వంటి వైడెర్ ఏస్పెక్ట్ రేషియోలో వీడియోస్ అప్‌లోడ్ చేయొచ్చు. అక్టోబర్ 15 కటాఫ్‌కు ముందు అప్‌లోడ్ చేసిన 60 సెకన్ల నుంచి 3 నిమిషాల మధ్య ఉన్న వెర్టికల్ వీడియోస్ కలిగి ఉన్న క్రియేటర్స్‌కు ఇవి రెగ్యులర్ లాంగ్ ఫామ్ కంటెంట్‌గా కన్పిస్తాయి.
అధిక నిడివి గల షార్ట్స్‌లో కాపీరైట్ ఉన్న ఆడియో అండ్ విజువల్స్ వినియోగంపై యూట్యూబ్ తన పాలసీలను కూడా వివరించింది. కాపీరైట్ ఉన్న మెటీరియల్‌ని కలిగి ఉన్న 60 సెకన్లకు మించిన ఏదైనా షార్ట్ ఆటోమేటిక్‌గా బ్లాక్ అయిపోతుంది. అయితే ఇది కంటెంట్ క్రియేటర్ ఛానెల్‌పై ఎలాంటి ప్రభావం చూపకుండా దీన్ని అన్ప్లేయబుల్ చేసేస్తారు.
వీటితో పాటు షార్ట్‌లను సులభంగా, మరింత ఆకర్షణీయంగా రూపొందించేందుకు యూట్యూబ్ అనేక కొత్త ఫీచర్‌లను విడుదల చేస్తోంది. క్రియేటర్‌లు ఇప్పుడు టెంప్లేట్‌లను ఉపయోగించి తమకు ఇష్టమైన షార్ట్స్‌ను రీక్రియేట్ చేయొచ్చు. ఏదైనా షార్ట్‌లో 'రీమిక్స్' పై ట్యాప్ చేసి ట్రెండింగ్‌లో చేరేందుకు 'యూస్ దిస్ టెంప్లేట్' ని సెలెక్ట్ చేసుకోవచ్చు.
రాబోయే మరి కొన్ని నెలల్లో కంటెంట్ క్రియేటర్స్ యూట్యూబ్ లైబ్రరీ నుంచి కంటెంట్‌ను నేరుగా వారి షార్ట్స్ కెమెరాలోకి తీసుకునే వెసులుబాటు లభించనుంది. యూట్యూబ్ ప్లాట్‌ఫారమ్‌లోని మల్టిపుల్ క్లిప్స్‌ను ఉపయోగించి క్రియేటర్స్ తమకు ఇష్టమైన వీడియోస్, మ్యూజిక్ వీడియోస్ వంటి మరిన్ని క్లిప్స్‌ను రీమిక్స్ చేసేందుకు ఈ ఫీచర్ అనుమతిస్తుంది.
ఈ ఏడాది తర్వాత యూట్యూబ్ షార్ట్స్ Google DeepMind Veoని ఇంటిగ్రేట్ చేస్తుంది. ఇది కంటెంట్ క్రియేటర్స్ అధునాతన వీడియో బ్యాక్గ్రౌండ్స్, స్టాండలోన్ క్లిప్స్‌ను రూపొందించేందుకు అనుమతినిస్తుంది. వారి షార్ట్స్‌ను మరింత ఊహాత్మకంగా రూపొందించేందుకు ఇది ఉపయోగపడుతుంది.
తెలుగులోనూ ఏఐ గూగుల్ జెమిని లైవ్- గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్లో ప్రకటన - Google for India
బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకు సూపర్ ఆఫర్- వారికి 24GB డేటా ఫ్రీ..! - BSNL Anniversary Offers