ETV Bharat / technology

వాట్సాప్ స్టేటస్​​లో ఇకపై 1 మినిట్​ వీడియో - whatsapp video status time increase - WHATSAPP VIDEO STATUS TIME INCREASE

Whatsapp Video Status Length : వాట్సాప్​ యూజర్స్​కు గుడ్​న్యూస్​. వాట్సాప్​లో ఒక నిమిషం నిడివిగల వీడియో స్టేటస్​ను పోస్ట్​ చేసే వీలును కల్పించనుంది మెటా సంస్థ. త్వరలో ఈ అప్డేట్​ను​ అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది.

Whatsapp Video Status Length Increased
Whatsapp Video Status Length Increased
author img

By ETV Bharat Telugu Team

Published : Mar 21, 2024, 1:38 PM IST

Whatsapp Video Status Length : అప్డేట్​ల పరంగా ప్రముఖ మెసేజింగ్ ప్లాట్​ఫామ్​ వాట్సాప్​ ఎప్పుడూ ముందుంటుంది. ఇప్పటికే ఎన్నో కీలక మార్పులను తన అప్లికేషన్​లో తీసుకువచ్చిన మెటా, తాజాగా మరో సరికొత్త అప్డేట్​ను తెచ్చేందుకు సిద్ధమయింది. అదే మన వాట్సాప్​ ఖాతాలో నిమిషం నిడివిగల వీడియో స్టేటస్​ను పోస్ట్​ చేయడం.

అయితే ప్రస్తుతానికి కేవలం గరిష్ఠంగా 30 సెకన్ల వరకు ఉన్న వీడియోను మాత్రమే వాట్సాప్​లో పోస్ట్​ చేసే అవకాశం ఉంది. అంతకంటే పెద్ద వీడియోలను అప్‌లోడ్‌ చేయాలంటే మరో స్టేటస్ అప్‌డేట్‌ తప్పదు. అలా వీడియో నిడివి పెరుగుతున్న కొద్దీ స్టేటస్‌ అప్‌డేట్ల సంఖ్య పెరుగుతూ పోతుంది. ఇక వాట్సాప్​ తీసుకురానున్న ఈ నయా అప్డేట్​తో ఈ ఇబ్బంది తప్పనుంది. రానున్న రోజుల్లో ఇక 60 సెకన్ల లిమిట్​గల వీడియోలను మన వాట్సాప్​ అకౌంట్​లో స్టేటస్​గా పోస్ట్ చేసుకోవచ్చు.

ప్రస్తుతానికి వీరికి మాత్రమే
ఈ 1 మినిట్​ నిడివిగల స్టేటస్​ అప్డేట్​ను వాట్సాప్​ ఇప్పటికే ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతానికి కొంతమంది బీటా యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు WABETA వెల్లడించింది. బీటా వెర్షన్‌ 2.24.7.3 డౌన్‌లోడ్‌ చేసుకున్నవారికి ఈ ఫీచర్‌ దశలవారీగా అందుబాటులోకి వస్తోందని తెలిపింది. అంటే మిగిలిన యూజర్లందరికీ ఇది అందుబాటులోకి రానుంది.

వాట్సాప్​ పేమెంట్స్​లో కీలక మార్పు
Whatsapp UPI Payments Feature : మరోవైపు వాట్సాప్​ పేమెంట్స్‌కు సంబంధించి కూడా మెటా ఇటీవలే కొత్త అప్డేట్​ను తీసుకువచ్చింది. తన యూజర్లు కోసం పేమెంట్స్​ ఫీచర్​ను మరింత సులభతరం చేసింది. చాట్‌ లిస్ట్‌లోనే క్యూఆర్‌ కోడ్‌ స్కానర్‌ కనిపించే విధంగా మార్పులు తీసుకువచ్చింది. వాస్తవానికి వాట్సాప్​ దేశంలో తన యూపీఐ పేమెంట్స్​ సేవలను ప్రారంభించి చాలా రోజులే అయ్యింది. కానీ దీనికి ఆశించిన స్థాయిలో మాత్రం ఆదరణ లభించటంలేదు.

ప్రస్తుతం వాట్సప్‌లో చెల్లింపులు చేయాలంటే త్రీ డాట్స్‌ మెనూలో పేమెంట్స్‌లోకి వెళ్లాల్సి వస్తోంది. ఇకపై ఆ అవసరం లేకుండా మనం ఎంచుకున్న కాంటాక్ట్‌ చాట్‌లోనే పై భాగంలో క్యూఆర్‌ కోడ్‌ సింబల్‌ ఉంటుంది. దానిపై క్లిక్‌ చేసి పేమెంట్స్​ చేయవచ్చు. ఇది కూడా ప్రస్తుతం బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది.

వాట్సాప్​ 'సెర్చ్​ బై డేట్' ఫీచర్​ - ఎలా వాడాలంటే?

ఇకపై వాట్సాప్‌ పేమెంట్స్‌ మరింత ఈజీ - చాట్‌ లిస్ట్‌లోనే QR కోడ్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.