WhatsApp New Feature: ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్ తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. యూజర్ల భద్రత దృష్ట్యా ఇప్పటికే చాలా ఫీచర్లను తీసుకొచ్చిన వాట్సాప్ తాజాగా మరో కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. ఇమేజ్‌ల మూలాలను గుర్తించేందుకు 'రివర్స్ ఇమేజ్ సెర్చ్' అనే సదుపాయాన్ని ప్రవేశపెట్టింది. వాట్సప్‌లోని చిత్రాలను గుర్తించేందుకు 'సెర్చ్ ఆన్ వెబ్' అనే ఆప్షన్‌ను తీసుకొచ్చింది. దీని సాయంతో వాట్సప్‌లోనే నేరుగా ఇమేజ్ గురించి సెర్చ్ చేయొచ్చు. అదెలాగంటే..?
దీన్ని ఉపయోగించడం ఎలా?:
- వాట్సప్ చాట్‌లో ఇమేజ్‌ని ఓపెన్ చేయగానే పైన కుడివైపున త్రీ డాట్స్ మెనూ కనిపిస్తుంది.
- ఈ మెనూపై క్లిక్ చేయగానే పలు ఆప్షన్లు కన్పిస్తాయి.
- అందులో ‘'సెర్చ్ ఆన్ వెబ్' అనే ఆప్షన్స్ కన్పిస్తుంది.
- దాన్ని క్లిక్ చేయగానే ఒక పాపప్ ఓపెన్ అవుతుంది.
- అందులో సెర్చ్‌పై క్లిక్ చేసి రివర్స్ ఇమేజ్ సెర్చ్‌ను స్టార్ట్ చేయొచ్చు.
- అయితే ఇలా వెబ్ సెర్చ్ కోసం గూగుల్‌కు పంపే ఇమేజెస్ గోప్యంగా ఉంటాయని, మెటాతో షేర్ అవ్వవని వాబీటా ఇన్ఫో స్పష్టం చేసింది.
ఇలా ఇమేజ్ గురించి సెర్చ్ చేయగానే దానికి సంబంధించిన మూలం, ఆ ఫొటో ఎక్కడినుంచి వచ్చింది, ఆన్లైన్లో ఈ ఫొటోను ఎవరైనా వినియోగించారా? అనే వివరాలు కన్పిస్తాయి. దీంతోపాటు ఆ ఫొటోను ఎడిట్ చేశారా? తప్పుదారి పట్టించేలా ఏమైనా మార్చారా అనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు.
అందుబాటులోకి ఎప్పుడు?: ఈ ఫీచర్ మొదట బీటా యూజర్లకు అందుబాటులోకి రానున్నట్లు వాబీటా ఇన్ఫో తన బ్లాగ్‌లో పంచుకుంది. ఇందుకు సంబంధిత ఫొటోను కూడా పోస్ట్ చేసింది. రానున్న మరికొన్ని వారాల్లో ఇది అందరికీ అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది.
ఈ ఫీచర్ లక్ష్యం ఇదే!: ఇంతకు ముందు వాట్సాప్‌లో నేరుగా ఇమేజ్ గురించి సెర్చ్ చేసే ఆప్షన్ లేదు. ఫొటో గురించి సెర్చ్ చేసేందుకు ఇతర యాప్ లేదా బ్రౌజర్‌కు వెళ్లాల్సి వచ్చేంది. అయితే ప్రస్తుతం వాట్సాప్ ప్రవేశపెట్టిన ఈ ఫీచర్‌తో ఆ ఇబ్బంది ఇక ఉండదు. ఇమేజ్ సెర్చ్ కోసం ఇకపై యాప్ లేదా బ్రౌజర్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్లాట్ఫామ్లో నేరుగా ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. వాట్సప్ ద్వారా షేర్ చేసే కంటెంట్‌కు పారదర్శకతను మెరుగుపర్చడమే ఈ ఫీచర్ ప్రధాన లక్ష్యం.
ఐఫోన్లో మంటలు- మహిళకు తీవ్ర గాయాలు- పరిహారం చెల్లించాలంటున్న యజమాని!
హానర్ నుంచి నయా స్మార్ట్‌ఫోన్- 2 మీటర్ల ఎత్తు నుంచి కిందికి పడినా నో ఫికర్!