ETV Bharat / technology

వాట్సాప్ నయా ఫీచర్​ - ఇకపై గ్రూప్​లోనే 'ఈవెంట్ ప్లాన్​' చేయండిలా! - WhatsApp Event Planning - WHATSAPP EVENT PLANNING

WhatsApp Event Planning Feature : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్​. వాట్సాప్​ కొత్తగా ఈవెంట్ ప్లానింగ్​ ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. దీనిని ఉపయోగించి మీ స్నేహితులతో లేదా కొలిగ్స్​తో వర్చువల్​ ఈవెంట్స్​ ప్లాన్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

WhatsApp latest Features
WhatsApp Event Planning Feature (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 3, 2024, 3:50 PM IST

WhatsApp Event Planning Feature : ప్రముఖ మెసేజింగ్ యాప్​ వాట్సాప్​ తమ యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లు తెస్తునే ఉంది. అందులో భాగంగా తాజాగా వాట్సాప్ 'ఈవెంట్ ప్లానింగ్' ఫీచర్​ను తీసుకువచ్చింది. ప్రధానంగా వాట్సాప్ కమ్యూనిటీస్​ (WhatsApp Community)లో ఈ ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా గ్రూప్​ మెసేజ్​ల్లోనే నేరుగా ఈవెంట్​లను ప్లాన్ చేయడానికి, వాటిని నిర్వహించడానికి వీలవుతుంది.

Event Planning In WhatsApp Community : ఈ వాట్సాప్​ ఈవెంట్ ప్లానింగ్ ఫీచర్​ ఉపయోగించి స్నేహితులతో, సన్నిహితులతో, సహచర ఉద్యోగులతో వర్చువల్ మీటింగ్స్​ పెట్టుకోవచ్చు. లేదా వ్యక్తిగత సమావేశాలు నిర్వహించుకోవచ్చు.

మనం ఈ-మెయిల్​ ద్వారా ఆహ్వానాలు పంపే విధంగానే, వాట్సాప్​ ఈ సరికొత్త 'ఈవెంట్స్​ ప్లానింగ్​' ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా గ్రూప్ సభ్యుల పుట్టిన రోజు పార్టీలు, వర్క్​ మీటింగ్​లు సెటప్ చేసుకోవచ్చు. ఈవెంట్ సెటప్​ అయిన తరువాత అవి గ్రూప్​ ఇన్ఫర్మేషన్ పేజ్​కు పిన్​ అయ్యి ఉంటాయి. కనుక అందరికీ ఈవెంట్ విషయం తెలుస్తుంది. అంతేకాదు గ్రూప్​ చాట్​ థ్రెడ్ కూడా క్రియేట్ అవుతుంది. అందువల్ల ఎవరెవరికీ మెసేజ్ చేరిందో తెలుస్తుంది.

ఈవెంట్​కు వచ్చేవారు కూడా రిప్లై ఇచ్చి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇలాంటి వారికి ఈవెంట్​ సమయానికి ఆటోమేటిక్​గా నోటిఫికేషన్ వెళుతుంది. కనుక మర్చిపోయే అవకాశం బాగా తగ్గుతుంది. వాట్సాప్​ ఈ నయా ఫీచర్​ను తొలుత వాట్సాప్​ కమ్యూనిటీలో ప్రవేశపెడుతోంది. దీని తరువాత త్వరలోనే వాట్సాప్ గ్రూప్​లకు కూడా దీనిని విస్తరించే అవకాశం ఉంది.

వాట్పాస్ అనౌన్స్​మెంట్​ గ్రూపులకు రిప్లై ఇచ్చే మరో ఫీచర్​ను కూడా తీసుకువచ్చింది. దీని ద్వారా అడ్మిన్ మెసేజ్​పై కామెంట్స్​తోపాటు, ఫీడ్ బ్యాక్​ను కూడా పొందడానికి వీలవుతుంది. ఒక వేళ నోటిఫికేషన్స్ వస్తుండడం మీకు ఇబ్బందిగా అనిపిస్తే, మ్యూట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే నోటిఫికేషన్ బార్​లోనే నేరుగా రిప్లై ఇచ్చే వీలుంది.

WhatsApp In-App Dialer : వాట్సాప్ త్వరలో ఇన్​-యాప్ డైలర్​ను కూడా తీసుకువస్తోంది. అంటే ఇకపై మీరు ట్రూకాలర్​, గూగుల్ డైలర్​ లాంటివి వాడకుండా, నేరుగా వాట్సాప్ నుంచే కాల్స్ చేయవచ్చు. ఇప్పటి వరకు వాట్సాప్​ ద్వారా ఎవరికైనా కాల్ చేయాలంటే, ఆ నంబర్​ మన కాంటాక్ట్ లిస్ట్​లో ఉండి తీరాలి. కానీ ఇకపై ఆ సమస్య ఉండదు. వాట్సాప్​ ఇన్​-యాప్​ డైలర్ అందుబాటులోకి వస్తే, మీ కాంటాక్ట్​ లిస్ట్​లో లేని నంబర్​కు సైతం కాల్ చేయడానికి వీలవుతుంది.

గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? ఈ టాప్​-5 వెబ్​ బ్రౌజర్స్​పై ఓ లుక్కేయండి! - Best Web Browsers

మీ రిమోట్ పోయిందా? స్మార్ట్​ఫోన్​తోనే టీవీని ఆపరేట్ చేయండిలా! - Use Smart Phone As A TV Remote

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.