ETV Bharat / technology

మీ గూగుల్‌ స్టోరేజీ తరచూ నిండిపోతోందా? డోంట్‌ వర్రీ - సింపుల్‌గా క్లీన్ చేసుకోండిలా! - Google storage full

Google storage full : మీ గూగుల్‌ స్టోరేజీ త్వరగా నిండిపోతోందా? డోంట్ వర్రీ. కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు, చాలా స్పేస్‌ను ఫ్రీఅప్‌ చేసుకోవచ్చు.

Google storage full
Google storage full (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 17, 2024, 11:43 AM IST

Google storage full : మనం అనునిత్యం గూగుల్​ సేవలు వినియోగించుకుంటాం. గూగుల్‌ అనేక ఉచిత సర్వీస్​లతో పాటుగా పెయిడ్ సర్వీస్​లు కూడా అందిస్తుంది. అయితే, గూగుల్‌ సేవలు వినియోగించుకునే వారికి 15 జీబీ కాంప్లిమెంటరీ డేటాను గూగుల్‌ అందిస్తుంటుంది. గూగుల్‌ డ్రైవ్‌, గూగుల్‌ ఫొటోస్‌, జీమెయిల్‌ వంటి గూగుల్‌ సర్వీసులన్నింటికీ ఈ స్టోరేజీనే ఆధారమని చెప్పవచ్చు. అయితే ఇది తరచూ ఫుల్ అయిపోతూ ఉంటుంది. ఒకవేళ మీకు అదనపు స్టోరేజీ కావాలంటే గూగుల్‌ వన్‌ (Google one) సబ్‌స్క్రిప్షన్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం నెలకు లేదా ఏడాదికి సబ్‌స్క్రిప్షన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దీని వల్ల మనపై అనవసర ఆర్థిక భారం పడుతుంది. అందుకే మీరు ఎలాంటి డబ్బులు చెల్లించకుండా గూగుల్ స్టోరేజీని ఎలా ఫ్రీ అప్‌ చేసుకోవచ్చో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

ఏది ఎంత ?
గూగుల్‌ స్టోరేజీని క్లీనప్‌ చేయడానికి గూగుల్‌ డ్రైవ్‌, జీమెయిల్‌, గూగుల్‌ ఫొటోస్‌తో పాటుగా వివిధ సర్వీసుల్లో ఉన్న అవసరంలేని డేటాను తొలగించాలి. ఇందుకోసం కొన్ని ఫైల్స్‌ డిలీట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ పని త్వరగా, సులువుగా పూర్తవ్వాలంటే మొబైల్‌ కంటే డెస్క్‌టాప్‌/ ల్యాప్‌టాప్‌ వినియోగించడం బెటర్. ఇందుకోసం ముందుగా గూగుల్‌ వన్‌ స్టోరేజీ మేనేజర్‌కి వెళ్లాలి. అక్కడ ఏ యాప్ వినియోగానికి ఎంత స్టోరేజీ అవుతోందో కనిపిస్తుంది. దీని ద్వారా ఏయే సర్వీసుల్లో పెద్ద పెద్ద ఫైల్స్‌ ఉన్నాయో తెలుసుకోవచ్చు. అప్పుడు ఆయా సర్వీసులపై క్లిక్‌ చేస్తే డిలీట్‌ చేయదగ్గ పెద్ద సైజు ఫైల్స్‌ కనిపిస్తాయి. అలాంటి ఫైల్స్​ను సులువుగా డిలీట్‌ చేయొచ్చు.

అన్‌రీడ్‌ మెయిల్స్‌పై లుక్కేయండి
మనం రోజూ అనేక వెబ్‌సైట్లను సందర్శిస్తుంటాం. దీంతో ఆయా వెబ్​సైట్లు ప్రమోషనల్‌ మెయిల్స్‌ పంపిస్తూ ఉంటాయి. అందువల్ల మన జీమెయిల్‌ ఇన్‌బాక్స్‌ నిండిపోతూ ఉంటుంది. ఇలాంటి మెయిల్స్‌ను తొలగించడం ద్వారా స్పేస్‌ను క్రియేట్‌ చేయొచ్చు. అందుకోసం జీమెయిల్‌లో చెక్‌బాక్స్‌ పక్కనే ఉన్న డ్రాప్‌డౌన్‌ మెనూ మీద క్లిక్‌ చేయండి. అక్కడ అన్‌రీడ్‌ సెలెక్ట్‌ చేసుకోండి. ఆ తర్వాత చెక్‌బాక్స్‌పై క్లిక్‌ చేసి డిలీట్‌ బటన్‌ క్లిక్‌ చేస్తే, అన్‌రీడ్‌ మెయిల్స్‌ను డిలీట్‌ చేయొచ్చు.

పాత మెయిల్స్‌ తొలగించండి
స్టోరేజీని క్లీన్‌ చేయడంలో భాగంగా పాత ఇ-మెయిల్‌ను తొలగించడం ఉత్తమమైన మార్గం. ముందుగా మీకు ఏయే మెయిల్స్‌ అవసరం లేదో వాటిని సెర్చ్‌ బార్‌లో సెలెక్ట్ చేసుకుని చెక్‌బాక్స్‌ను క్లిక్‌ చేసి డిలీట్‌ చేయండి. లేదంటే ఫలానా సంవత్సరానికి ముందు ఉన్న ఇ-మెయిల్స్‌ ఏవీ వద్దునుకుంటే before:<2022> అని సెర్చ్‌ చేయాలి. ఆ సంవత్సరం ముందున్న ఇ-మెయిల్స్‌ కనిపిస్తాయి. వాటిన్నింటినీ చెక్‌ బాక్స్‌ క్లిక్ చేసి ట్రాష్‌ బాక్స్‌ క్లిక్‌ చేస్తే ఆ తేదీకి ముందు మెయిల్స్‌ అన్నీ డిలీట్‌ అవుతాయి.

లార్జ్‌ ఈ-మెయిల్స్‌
మనకొచ్చేవి లేదంటే మనం పంపించే వాటిలో కొన్ని పెద్ద సైజు ఇ-మెయిల్స్‌ ఉంటాయి. అలాంటి వాటిని తొలగించడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ స్పేస్‌ను క్రియేట్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం సెర్చ్‌బార్లో has:attachment larger: 5M అని సెర్చ్‌ చేయడం వల్ల 5 ఎంబీ కంటే ఎక్కువ సైజ్‌ ఉన్న మెయిల్స్‌ను ఇన్​బాక్స్ నుంచి తొలగించొచ్చు.

గూగుల్‌ ఫొటోస్‌
గూగుల్ స్టోరేజ్‌లో ఎక్కువ భాగం ఆక్రమించే వాటిలో గూగుల్‌ ఫొటోస్‌ ఒకటి. ఇందులో ముందుగా అవసరం లేని వీడియోలను తొలగించడం వల్ల ఎక్కువ ఫ్రీ స్పేస్‌ను పొందొచ్చు. అలాగే డూప్లికేట్‌ ఇమేజ్‌లను డిలీట్‌ చేసి కూడా స్టోరేజీని ఫ్రీ అప్‌ చేసుకోవచ్చు.

గూగుల్‌ డ్రైవ్‌
మనకు నిత్య జీవితంలో అవసరం అయిన పీడీఎఫ్‌లను, డాక్యుమెంట్లను గూగుల్‌ డ్రైవ్‌లో భద్రపరుస్తుంటాం. ఈ-మెయిల్‌ తరహాలో size:larger:5M అని సెర్చ్‌ చేస్తే 5 ఎంబీ కంటే ఎక్కువ సైజున్న ఫైల్స్‌ను తొలగించుకోవచ్చు. పీడీఎఫ్‌ రూపంలో ఉన్న పుస్తకాలు, ముఖ్యమైన ఇతర డాక్యుమెంట్లు ఉంటే, వాటిని మీ పీసీలోకి డౌన్‌లోడ్‌ చేసుకుని భద్రపరుచుకుని, గూగుల్‌ డ్రైవ్‌ నుంచి తొలగించుకోవడం ద్వారా ఎక్కువ స్టోరేజీని పొందొచ్చు.

జిప్‌ చేయండి
అనవసరమైన ఫైళ్లన్నీ తొలగించినా ఇంకా స్టోరేజీ సరిపోకపోతే, లార్జ్‌ ఫైల్స్‌ను మీ డెస్క్‌టాప్‌లోకి డౌన్‌లోడ్‌ చేసుకోండి. ఆపై గూగుల్‌ స్టోరేజీలో డిలీట్‌ చేయండి. ఒకే తరహా ఫైల్స్‌ (వీడియోలు, పీడీఎఫ్‌లు) ZIP, RARను ఉపయోగించి కంప్రెస్‌ చేసి అప్‌లోడ్‌ చేయడం ద్వారా స్టోరేజీని కొంత వరకు తగ్గించుకోవచ్చు.

కుటుంబ సభ్యుల స్టోరేజీ
కొందరు తమ డివైజ్‌లకే కాదు, కుటుంబ సభ్యుల ఫోన్లకూ ఒకటే గూగుల్‌ అకౌంట్‌ను వాడుతూ ఉంటారు. దీనివల్ల రెండు ఫోన్లలోని డేటా బ్యాకప్‌ అవ్వడం మూలానా స్టోరేజీ నిండిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ మీ స్టోరేజీ నిండిపోవడానికి అలాంటి కారణం ఏదైనా ఉంటే, ఆ అకౌంట్‌కు వేరే గూగుల్‌ అకౌంట్‌ను క్రియేట్ చేయడం మేలు.

గూగుల్ స్టోరేజ్​ ఫుల్ అయ్యిందా? సింపుల్​గా క్లీన్ చేసుకోండిలా!

Google Storage Cleanup : ఫ్రీగా గూగుల్ స్టోరేజ్​ వాడుకోవాలా?.. మీ జీ-మెయిల్​, గూగుల్​ డ్రైవ్​లను ఇలా క్లీన్ చేసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.