15 Things You Should Never Do On A Work Computer : కరోనా సంక్షోభం తరువాత 'వర్క్ ఫ్రమ్ హోమ్' చేయడం అనేది చాలా సాధారణంగా మారింది. కానీ ఇప్పుడు చాలా కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీస్‌కు వచ్చి, పనిచేయాలని బలవంతపెడుతున్నాయి. అయితే మీరు ఇంట్లో ఉండి పనిచేస్తున్నా, లేదా ఆఫీస్‌కు వచ్చి పని చేస్తున్నా, కంపెనీ ఇచ్చిన కంప్యూటర్లో కొన్ని పనులు మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ చేయకూడదు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
- కంపెనీలు తమ ఉద్యోగులకు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఇస్తూ ఉంటాయి. వాటిల్లో కేవలం కంపెనీ పనులు మాత్రమే చేయాలి. అలాకాకుండా ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా అకౌంట్లు చూడడం; నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ లాంటి ఓటీటీలను చూడడం లాంటివి చేయకూడదు. ఎందుకంటే, కంపెనీలు మిమ్మల్ని ట్రాక్ చేసేందుకు మానిటరింగ్ సాఫ్ట్వేర్స్ లేదా ప్రొడక్టివిటీ సాఫ్ట్వేర్స్ ఉపయోగించే అవకాశం ఉంది. ఇవి మీరు చేసే పనులను ఇట్టే పసిగట్టేస్తాయి.
- మీరు కంపెనీకి సంబంధించిన సున్నితమైన (సెన్సిటివ్) సమాచారాన్ని నిర్వహిస్తూ ఉంటే, దానిని చాలా భద్రంగా చూసుకోవాలి. ఒకవేళ మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, కంపెనీ నష్టపోయే ప్రమాదం ఉంటుంది. మీపై కూడా దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
- ఒక వేళ ఆఫీస్ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్లో మానిటరింగ్ సాఫ్ట్వేర్స్ లేకపోయినా, మీరు హద్దులు మీరకూడదు. ఎందుకంటే మీ ఉన్నతాధికారులకు, ఐటీ నిపుణులకు మీ డివైజ్‌ను చెక్ చేసే అధికారం కంపెనీ ఇస్తుంది.
- కంపెనీ ఇచ్చిన ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్స్‌లో మీ వ్యక్తిగత సమాచారాన్ని లేదా ఫైల్స్‌ను ఎప్పుడూ సేవ్ చేసి ఉంచకూడదు. ఎందుకంటే, ఒక వేళ మిమ్మల్ని సదరు కంపెనీ నుంచి తొలగిస్తే, మీ డేటా మొత్తం వాళ్లదగ్గరే ఉండిపోతుంది. పైగా దీని వల్ల న్యాయపరమైన చిక్కులు కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది.
- కంపెనీ ఇచ్చిన డివైజ్‌ల్లో ఏవి పడితే అవి సెర్చ్ చేయకూడదు. ఎందుకంటే, మీ నావిగేషన్ హిస్టరీతోపాటు, మీరు ఇంటర్నెట్లో ఏమేమి చెక్ చేశారో చాలా ఈజీగా కంపెనీ గుర్తించగలదు.
- స్లాక్ (Slack) లాంటి సాఫ్ట్‌వేర్స్‌లో వ్యక్తిగత చాటింగ్‌లు చేయకూడదు. ఎందుకంటే ఇలాంటి యాప్స్‌లో మీరు చేసే ప్రతి పనీ కంపెనీ యాజమాన్యానికి తెలిపిపోతుంది. స్లాక్ మాత్రమే కాదు, కంపెనీ డివైజ్‌ల్లో ఇతర చాటింగ్ యాప్స్ కూడా వాడకూడదు.
- కంపెనీలు ఇచ్చే ల్యాప్‌టాప్‌ల్లో, డెస్క్టాప్ల్లో మీ వ్యక్తిగత ఈ-మెయిల్‌తో లాగిన్ కాకూడదు. ఎందుకంటే, సీనియర్ ఆఫీసర్లు మీ మెయిల్స్ అన్నింటినీ చూసే అవకాశం ఉంటుంది. ఇది మీ ప్రైవసీకి తీవ్రమైన భంగం కలిగిస్తుంది.
- మీ దగ్గర ఉన్న వర్క్ ల్యాప్‌టాప్ ఆఫ్‌లో ఉన్నప్పటికీ (జీ-షూట్) గూగుల్ డ్రైవ్, డాక్స్, షీట్స్ లాంటి వాటిలో మీ పర్సనల్ ఫైల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ సేవ్ చేయకూడదు. ఎందుకంటే ఇవన్నీ మీ మెయిల్ అకౌంట్‌తో లింకై ఉంటాయని కాబట్టి, కంపెనీ వాళ్లు వాటిని చూసే ప్రమాదం ఉంటుంది.
- మీరు ఎక్కడైనా వెళ్లినప్పుడు, వర్కింగ్ కంప్యూటర్ను లాక్ చేసుకోవాలి. లేకపోతే ఇతరులు ఎవరైనా మీ డివైజ్‌ను యాక్సెస్ చేసి, సున్నితమైన సమాచారాన్ని దొంగిలించే అవకాశం ఏర్పడవచ్చు.
- పబ్లిక్ ప్రదేశాల్లో ల్యాప్టాప్స్, సెల్‌ఫోన్స్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే మీ సమాచారాన్ని ఇతరులు దొంగతనంగా చూసే అవకాశం ఉంది. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ పబ్లిక్ వైఫై వాడకూడదు. అత్యవసరమైతే వీపీఎన్ ఉపయోగించాలి.
- మీ కంపెనీ ఇచ్చిన కంప్యూటర్లో, ఇతర కంపెనీల, క్లయింట్ల వర్క్ చేయకూడదు.
- ఎవరూ చూడడం లేదు కదా అని, కంపెనీ ఇచ్చిన డివైజ్‌లో అభ్యంతరకరమైన, అనుచితమైన కంటెంట్ (పోర్న్ కంటెంట్) చూడకూడదు. ఇలా చేస్తే మీపై చాలా బ్యాడ్ ఇంప్రెషన్ ఏర్పడుతుంది.
- కంపెనీ వాళ్లు తమ భద్రత కోసం చాలా సెక్యూరిటీ కాన్ఫిగరేషన్స్ చేస్తూ ఉంటారు. వాటిని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చకూడదు.
- కంపెనీ అనుమతించని సాఫ్ట్వేర్లు, అప్లికేషన్లు ఇన్స్టాల్ చేయకూడదు.
- 'ఇవన్నీ చూసి మీరు భయపడాల్సిన పనిలేదు! మీ బ్యాంకు ఖాతాలు చూడవచ్చు. అవసరమైతే పేమెంట్స్ కూడా చేయవచ్చు' అని నిపుణులు చెబుతున్నారు.