ETV Bharat / technology

ఈ సెట్టింగ్​ మార్చుకుంటే - మీ ఫోన్​ పోయినా స్విచ్​ ఆఫ్​ చేయలేరు!

Smartphone Safety Tips : ఫోన్​ కొనడం ఎంత సాధారణమో.. పోగొట్టుకోవడం కూడా అంతే కామన్ అయిపోయింది! అయితే.. వేరే వాళ్ల చేతిలో మీ ఫోన్ పడిందంటే.. వాళ్లు ఫస్ట్ చేసే పని స్విచ్ఛాఫ్ చేయడం. ఇలా ఫోన్ స్విచ్ఛాఫ్ చేయకుండా ఉండాలంటే.. మీ ఫోన్​ సెట్టింగ్స్​లో చిన్న మార్పు చేస్తే చాలు. ఇక, ఎంత ప్రయత్నించినా ఆఫ్ చేయలేరు!!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 16, 2024, 4:42 PM IST

Smartphone Safety Tips
Smartphone Safety Tips

Smartphone Safety Tips : ఫోన్ పోగొట్టుకోవడం సాధారణ విషయంగా మారిపోయింది. కొందరు నిర్లక్ష్యంగా ఫోన్ కోల్పోతే.. మరికొందరి నుంచి దొంగలు చాకచక్యంగా కొట్టేస్తారు. ఫోన్ మన చేతి నుంచి​ పోయిందంటే.. ఇక దానిమీద చాలా వరకు ఆశలు వదిలేసుకోవడమే. ఫోన్ తిరిగి దక్కించుకోవడానికి కొన్ని మార్గాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. వంద శాతం సక్సెస్ రేటు లేదు. అయితే.. ఆ మార్గాలతోపాటు మీ ఫోన్​ సెట్టింగ్స్​లో చిన్న మార్పు చేయడం ద్వారా ఈజీగా మీ మొబైల్​ను కనిపెట్టొచ్చని చెబుతున్నారు నిపుణులు!

ఫోన్​ను పొరపాటున చేజార్చుకున్నా.. దొంగలు కొట్టేసినా.. వారు చేసే మొదటి పని దాన్ని స్విచ్​ ఆఫ్​​ చేయడం. ఆ తర్వాత ఫోన్‌లో ఉన్న సిమ్‌ను కార్డును తీసేసి కొత్త సిమ్​ వేసి వాడుకుంటూ ఉంటారు. లేదంటే.. తక్కువ ధరల్లో ఎవరో ఒకరికి అమ్మేసుకుంటారు. అయితే.. ఫోన్ పోయిన తర్వాత దొరకబట్టడానికి కొన్ని మార్గాలు వచ్చాయి. Central Equipment Identity Register (CEIR) వంటివి అమల్లోకి వచ్చాయి. అయితే, ఫోన్ దొంగిలించిన వారు.. అసలు ఆ ఫోన్ స్విచ్ఛాఫ్ చేయకుండా చేయడం ద్వారా.. మరింత త్వరగా దాన్ని కనిపెట్టే ఛాన్స్ ఉంటుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం.. ఫోన్‌లో కొన్ని సెట్టింగ్స్‌ చేస్తే సరిపోతుందని అంటున్నారు.

ఈ సెట్టింగ్ మార్చడం ద్వారా.. ఫోన్​ ఆన్​ చేయడానికి మీ పాస్​వర్డ్​ ఎలాగైతే ఎంటర్​ చేయాలో.. ఫోన్​ స్విచ్​ ఆఫ్​ చేయడానికి కూడా ఆ పాస్​వర్డ్​ ఎంటర్​ చేయాల్సి ఉంటుంది. మీ పాస్​ వర్డ్​ ఏంటో వారికి తెలిసే అవకాశం ఉండదు కాబట్టి.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేయలేరు. మరి ఇందుకోసం సెట్టింగ్స్​లో ఎలాంటి ఛేంజెస్​ చేయాలో ఇప్పుడు చూద్దాం.

ఐఫోన్ యూజర్లకు అలర్ట్​ - iOSలోకి తొలిసారి వైరస్ ఎంట్రీ! మీ బ్యాంక్ అకౌంట్ జర భద్రం!

  • ముందుగా మీ స్మార్ట్‌ ఫోన్‌లోని సెట్టింగ్స్‌ ఆప్షన్​పై క్లిక్​ చేయండి.
  • స్క్రీన్​ను కిందకు స్క్రోల్​ చేస్తే పాస్‌వర్డ్‌ అండ్‌ సెక్యూరిటీ(Password & Security) ఆప్షన్​ కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఆప్షన్​పై క్లిక్‌ చేయండి.
  • ఆ తర్వాత అందులో సిస్టమ్‌ సెక్యూరిటీ(System Security) అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేయాలి.
  • తర్వాత డివైజ్​ సెక్యూరిటీ(Device Security) సెక్షన్​లో​ రిక్వైర్​ పాస్‌వర్డ్‌ టూ పవర్‌ ఆఫ్‌(Require Password to Power Off) అనే ఆప్షన్‌ కనిపిస్తుంది.
  • దానిని క్లిక్​ చేసి పవర్​ ఆఫ్​ బటన్​ ఎనేబుల్​ చేయాలి.
  • ఆ తర్వాత బ్యాక్​ వచ్చి.. ఫైండ్‌ మై డివైజ్‌(Find My Device) ఆప్షన్​ను కూడా ఎనేబుల్​ చేసుకోవాలి.
  • ఇంతటితో సెట్టింగ్స్ కంప్లీట్ అయిపోయినట్టే.
  • ఇక నుంచి పాస్‌వర్డ్‌ లేనిది మీ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ కాదు.

జీమెయిల్ యూజర్లకు గుడ్ న్యూస్ -​ email reply కోసం చాట్​-స్టైల్ ఇంటర్ఫేస్​

చూశారుగా.. ఫోన్​లో ఈ సెట్టింగ్స్​ మార్చడం వల్ల మీ ఫోన్​ స్విచ్​ ఆఫ్​ కాకుండా చేయవచ్చు. ఇప్పుడు మీ ఫోన్​కు కాల్స్ చేసి.. ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. ఒకవేళ వారు కాల్ లిఫ్ట్ చేయకపోయినా.. మీ ఫోన్​ ఏ సెల్​ టవర్ పరిధిలో ఉందో ఈజీగా గుర్తించొచ్చు. CEIR వంటి మార్గాల ద్వారా త్వరగా ఫోన్ రికవరీ చేసుకోవచ్చు. సో.. ఇక లేట్ చేయకుండా ఈ సెట్టింగ్ మార్చుకోండి.

NOTE : సెట్టింగ్స్​ స్టెప్​ బై స్టెప్​ అనేవి.. ఫోన్​ మోడల్​ను బట్టి మారొచ్చు. ఆప్షన్స్​ మాత్రం అవే ఉంటాయి. చూసుకొని మార్చుకోండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.