The Best Camera Phone 2024 : ప్రొఫెషనల్ కెమెరాలతో పోల్చితే, మొబైల్ ఫోన్లు అంత క్వాలిటీగా ఉండవు. కానీ ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ ఫోన్లలో హై క్వాలిటీ కెమెరాలు వస్తున్నాయి. ఇవి 10X జూమ్, హై రేంజ్, మల్టీ, వెర్సటైల్ లెన్స్, ఫోటో మోడ్స్, ఏఐ ఫీచర్స్‌తో వస్తున్నాయి. వీటితో సెల్ఫీ, పోట్రైట్ షాట్స్ నచ్చినట్లు తీసుకోవచ్చు. కనుక మొబైల్ ఫొటోగ్రఫీ చేసేవారికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి.
యాపిల్, గూగుల్, శాంసంగ్ ఫోన్లలోని కెమెరాలు చాలా హైక్వాలిటీ ఫొటోలు తీయడానికి అనుకూలంగా ఉంటాయి. కానీ వీటి ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక వీటిని కొనడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అందుకే ఈ ఆర్టికల్‌లో హైఎండ్ ఫోన్ల నుంచి అఫర్డబుల్ ధరల్లో లభిస్తున్న టాప్-7 బెస్ట్ కెమెరా ఫోన్ల గురించి తెలుసుకుందాం.
1. Samsung Galaxy S24 Ultra : ఫొటోగ్రఫీ లవర్స్‌కు 'శాంసంగ్ గెలాక్సీ ఎస్25 ఆల్ట్రా' బెస్ట్ ఛాయిస్ అవుతుంది. పగలైనా, రాత్రైనా, వాస్తవానికి ఎలాంటి సమయంలో అయినా దీనితో మంచి క్వాలిటీ ఫొటోలు తీసుకోవచ్చు. పైగా ఇవి చాలా నేచురల్‌గా ఉంటాయి. ఇందులోని 200 ఎంపీ కెమెరా డైనమిక్ రేంజ్ కలిగి ఉంటుంది. దీనితో తీసిన ఫొటోల్లో బ్యాక్‌గ్రౌంట్ బ్లర్ అవుతుంది. కనుక మెయిన్ సబ్జెక్ట్ క్రిస్టల్ క్లియర్‌గా ఉంటుంది. కలర్స్ కూడా చాలా నేచురల్‌గా ఉంటాయి. నోయిస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది.
గెలాక్సీ ఎస్24 ఆల్ట్రాలోని కెమెరాలు 10X జూమ్, మల్టీ షూటింగ్ మోడ్స్, ఆప్షన్స్ కలిగి ఉంటుంది. ముఖ్యంగా దీనిలో ఫుడ్ మోడ్ అనే ప్రత్యేకమైన ఫీచర్ ఉంది. దీనితో తీసిన ఆహార పదార్థాల ఫొటోలు చాలా అద్భుతంగా వస్తాయి. దీనితో హై క్వాలిటీ వీడియోలు కూడా తీసుకోవచ్చు. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లకు కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది.
- స్క్రీన్ సైజ్ : 6.8 అంగుళాలు
- రిజల్యూషన్ : QHD+
- సీపీయూ : స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3
- ర్యామ్ : 12 జీబీ
- స్టోరేజ్ : 256 జీబీ/ 512 జీబీ/ 1 టీబీ
- బ్యాటరీ : 5000 mAh
- రియర్ కెమెరా : 200 ఎంపీ + 12 ఎంపీ + 10 ఎంపీ + 50 ఎంపీ (టెలీఫొటో విత్ 5 ఎక్స్ ఆప్టికల్ జూమ్)
- ఫ్రంట్ కెమెరా : 12 ఎంపీ
Samsung Galaxy S24 Ultra full version expected renderings. pic.twitter.com/LaGh0jv9Gi
— ICE UNIVERSE (@UniverseIce) August 26, 2023
2. IPhone 15 Pro Max : ఐఫోన్ అంటే క్వాలిటీకి పెట్టింది పేరు. కనుక దీన్ని కళ్లు మూసుకుని కొనుక్కోవచ్చు. ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌లో పెరిస్కోప్ టెక్నాలజీ వాడారు. కనుక లెన్స్‌లను, మిర్రర్లను ఫోల్డ్ చేసుకోవచ్చు. అంతేకాదు దీనిలో కెమెరా 5X ఆప్టికల్ జూమ్ కలిగి ఉంటుంది. పైగా ఇది 6-యాక్సిస్ స్టెబిలైజర్‌తో వస్తుంది. కనుక కదులుతున్న ఆబ్జెక్ట్‌ను కూడా చాలా క్లియర్‌గా షూట్ చేయవచ్చు. వీడియోలు కూడా షేక్ కాకుండా తీసుకోవచ్చు. యాపిల్ ఫోన్లోని ప్రోరెస్ ఫార్మాట్లో షూట్ చేసి, హైయెస్ట్ రిజల్యూషన్, ఫ్రేమ్ రేట్‌తో వీడియోలు తీయవచ్చు.
- స్క్రీన్ సైజ్ : 6.7 అంగుళాలు
- రిజల్యూషన్ : 2796 x 1290 పిక్సెల్స్
- సీపీయూ : ఏ17 ప్రో
- ర్యామ్ : 8 జీబీ
- స్టోరేజ్ : 256 జీబీ/ 512 జీబీ/ 1 టీబీ
- బ్యాటరీ : 4422 mAh
- రియర్ కెమెరా : 48 ఎంపీ + 12 ఎంపీ + 12 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 12 ఎంపీ
3. Google Pixel 8 Pro : ఫొటోగ్రఫీ లవర్స్‌కు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులోని కెమెరా లెన్స్ డిఫరెంట్ అపార్చర్స్ కేపబిలిటీస్తో వస్తుంది. కనుక లో-లైట్‌లోనూ మంచి ఫొటోలు తీసుకోవచ్చు.
మ్యాక్రో ఫొటోగ్రఫీకి ఈ గూగుల్ పిక్సెల్ 8 ప్రో చాలా బాగుంటుంది. అంతేకాదు దీనిలో తీసిన ఫొటోలను ఎడిట్ చేసుకోవడానికి గూగుల్ ఫొటోస్ అనే యాప్ కూడా అందుబాటులో ఉంటుంది.
- స్క్రీన్ సైజ్ : 6.7 అంగుళాలు
- రిజల్యూషన్ : 1344 x 2992 పిక్సెల్స్
- సీపీయూ : గూగుల్ టెన్సర్ జీ3
- ర్యామ్ : 12 జీబీ
- స్టోరేజ్ : 128 జీబీ/ 256 జీబీ/ 512 జీబీ/ 1 టీబీ
- బ్యాటరీ : 5,050 mAh
- రియర్ కెమెరా : 50 ఎంపీ + 48 ఎంపీ + 48 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 10.5 ఎంపీ
4. Google Pixel 8a : కాస్త తక్కువ బడ్జెట్లో మంచి కెమెరా ఫోన్ కొనాలని అనుకునేవారికి గూగుల్ పిక్సెల్ 8ఏ మంచి ఛాయిస్ అవుతుంది. దీనితో మంచి వెలుతురు ఉన్నప్పుడు కలర్‌ఫుల్ ఫొటోలు తీసుకోవచ్చు. మ్యాజిక్ ఎడిటర్ సాయంతో ఈ ఫొటోల్లోని బ్యాక్‌గ్రౌండ్‌ను రిమూవ్ చేసుకోవచ్చు. వీడియోలు తీసినప్పుడు బ్యాక్‌గ్రౌండ్ నోయిస్ కూడా ఐసోలేట్ చేసుకోవచ్చు.
- స్క్రీన్ సైజ్ : 6.1 అంగుళాలు
- రిజల్యూషన్ : 1080 x 2400 పిక్సెల్స్
- సీపీయూ : గూగుల్ టెన్సర్ జీ3
- ర్యామ్ : 8 జీబీ
- స్టోరేజ్ : 128 జీబీ
- బ్యాటరీ : 4492 mAh
- రియర్ కెమెరా : 64 ఎంపీ + 13 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 13 ఎంపీ
5. IPhone 15 : ఈ ఐఫోన్లో 2 లెన్స్‌లు ఉంటాయి. కానీ ఇది చాలా పవర్ఫుల్ కెమెరా ఫోన్ అని చెప్పుకోవచ్చు. దీనిలో చాలా కూల్, ఫొటోగ్రఫీ ఫీచర్స్ ఉన్నాయి. దీనితో 4K 60fps వీడియోస్ తీసుకోవచ్చు. అంటే సినిమాటిక్ మోడ్‌లో ఏకంగా హై-క్వాలిటీ సినిమానే తీసేయవచ్చు. అంతే కాదు అతి తక్కువ వెలుతురులోనూ దీనితో హై క్వాలిటీ సెల్ఫీ ఫొటోలు తీసుకోవచ్చు. అంతేకాదు దీనిలో టెలిఫొటో, మ్యాక్రో క్యాపబిలిటీస్ కూడా ఉన్నాయి.
- స్క్రీన్ సైజ్ : 6.1 అంగుళాలు
- రిజల్యూషన్ : 2556 x 1176 పిక్సెల్స్
- సీపీయూ : ఏ16 బయోనిక్
- ర్యామ్ : 12 జీబీ
- స్టోరేజ్ : 128 జీబీ/ 256 జీబీ/ 512 జీబీ
- బ్యాటరీ : 3349 mAh
- రియర్ కెమెరా : 48 ఎంపీ + 12 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 12 ఎంపీ
iPhone 15 vs iPhone 15 Pro
— Apple Hub (@theapplehub) October 9, 2023
Which one would you pick? pic.twitter.com/Hqu1MWFvTS
6. Google Pixel 8 : గూగుల్ పిక్సెల్ 8 అనేది ఒక ఎక్స్లెంట్ ఫోన్. ఛాలెంజింగ్ కండిషన్‌లోనూ దీనితో చాలా క్వాలిటీ ఫొటోలు తీసుకోవచ్చు. ఆటోఫోకస్, మల్టీ వీడియో క్యాప్చర్ మోడ్స్, ఏఐ క్యాపబిలిటీస్ దీనిలో ఉన్నాయి. అంతేకాదు దీనిలో మ్యాజిక్ ఎడిటర్ ఉంది. కనుక అఫర్డబుల్ ప్రైజ్‌లో లభిస్తున్న బెస్ట్ ఫోన్‌గా దీనిని పరిగణించవచ్చు. దీనితో కలర్ అక్యూరసీ, ఎక్స్పోజర్, అపార్చర్, ఎడ్జ్ డిటెక్షన్ ఎలిమెంట్స్‌తో ఫొటోలు తీసుకోవచ్చు.
- స్క్రీన్ సైజ్ : 6.2 అంగుళాలు
- రిజల్యూషన్ : 1080 x 2400 పిక్సెల్స్
- సీపీయూ : గూగుల్ టెన్సర్ జీ3
- ర్యామ్ : 8 జీబీ
- స్టోరేజ్ : 128 జీబీ/ 256 జీబీ
- బ్యాటరీ : 4575 mAh
- రియర్ కెమెరా : 50 ఎంపీ + 12 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 10.5 ఎంపీ
7. OnePlus 12 : ఐఫోన్, గూగుల్ పిక్సెల్, శాంసంగ్ ఫోన్లకు పోటీగా మార్కెట్లు ఉన్న బెస్ట్ కెమెరా ఫోన్ 'వన్‌ప్లస్ 12'. ఇందులో ఆస్ట్రోనాట్స్ ఉపయోగించే ఆప్టిక్స్ ఉపయోగించారు. దీనితో జా-డ్రాపింగ్ టెలిఫొటో షాట్స్, ఎక్స్ట్రీమ్ క్లోజ్-అప్ మ్యాక్రో ఫొటోలు తీసుకోవచ్చు. అంతే దీనితో ల్యాండ్‌స్కేప్, పోట్రైట్ ఫొటోలు అద్భుతంగా, నేచురల్‌గా తీయవచ్చు.
- స్క్రీన్ సైజ్ : 6.82 అంగుళాలు
- రిజల్యూషన్ : 1440 x 3168 పిక్సెల్స్
- సీపీయూ : క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3
- ర్యామ్ : 12 జీబీ/ 16 జీబీ
- స్టోరేజ్ : 256 జీబీ/ 512 జీబీ
- బ్యాటరీ : 5400 mAh
- రియర్ కెమెరా : 50 ఎంపీ + 48 ఎంపీ + 64 ఎంపీ
- ఫ్రంట్ కెమెరా : 32 ఎంపీ
గూగుల్ క్రోమ్‌లో 5 నయా ఫీచర్స్ - ఇకపై సెర్చింగ్ వెరీ సింపుల్! - Latest Google Chrome Features