Tata Punch Overtakes Maruti Wagonr: టాటా పంచ్ దేశీయ కార్ల అమ్మకాల్లో దూసుకుపోతోంది. గత కొంతకాలంగా దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే మారుతీ సుజుకీ వేగనార్ రికార్డును బ్రేక్ చేసింది. ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలో తొలి ఏడు నెలల్లో ఎక్కువ విక్రయాలు నమోదు చేసిన మోడల్‌గా టాటా పంచ్ నిలిచింది. ఈ ఏడాది జనవరి నుంచి జులై వరకు నమోదైన కార్ల సేల్స్ ఆధారంగా ఆటోమార్కెట్ రీసెర్చ్ సంస్థ జాటో డైనమిక్స్ డేటా వెలువరించింది. అయితే మారుతీ సుజుకీ వేగనార్ సేల్స్ రికార్డును టాటా మోటార్స్‌కు చెందిన పంచ్ దాటడం వెనక వివిధ కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే?
డైనమిక్స్ డేటా ప్రకారం:
- టాటా పంచ్ గత ఏడు నెలల్లో 1.26 లక్షల యూనిట్లు అమ్ముడుపోగా, వేగనార్ 1.16 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.
- హ్యుందాయ్ క్రెటా 1.09 లక్షలు, మారుతీ సుజుకీ బ్రెజ్జా 1.05 లక్షలు, మారుతీకే చెందిన ఎర్టిగా 1.04 లక్షల యూనిట్లు చొప్పున విక్రయాలు నమోదయ్యాయి.
- అయితే, జులై నెల విక్రయాల్లో మాత్రం టాటా పంచ్ నాలుగో స్థానానికి పడిపోయింది. ఆ సమయంలో హ్యుందాయ్‌కి చెందిన క్రెటా అగ్రస్థానంలో నిలిచింది.
టాటా పంచ్ విజయానికి రహస్యం ఇదే:
- వేగనార్ సేల్స్ రికార్డును టాటా మోటార్స్ దాటడం వెనక వివిధ కారణాలు ఉన్నాయని పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి.
- టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీ విభాగంలో ఎస్‌యూవీ ఫీచర్లను అందుబాటు ధరలో అందిస్తుండడమే దీనికి కారణమని నిపుణులు అంటున్నారు.
- దీంతోపాటు పలు రకాల ఫ్యూయెల్ ఆప్షన్లు ఉండటం కూడా మరో కారణమని పేర్కొంటున్నారు.
- టాటా పంచ్ సేల్స్‌లో 47 శాతం ఎలక్ట్రిక్, సీఎన్‌జీ వేరియంట్లే ఉన్నాయని, అత్యధికంగా అమ్ముడవుతున్న ఇతర కార్లలో పెట్రోల్‌కు ప్రత్యామ్నాయంగా సీఎన్‌జీ లేదా డీజిల్ ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.
- కస్టమర్స్ కోరుకునే ఫ్యూయల్‌లో కారును అందించడం వెనక టాటా పంచ్ విజయం దాగి ఉందని పేర్కొంటున్నారు.
Tata Punch Features:
- ఇంజిన్: 1199 సీసీ
- పవర్: 72.41 - 86.63 బీహెచ్పీ
- ట్రాన్స్మిషన్: Manual/Automatic
- గ్లోబల్ NCAP సేఫ్టీ రేటింగ్: 5 స్టార్
- గ్రౌండ్ క్లియరెన్స్: 187 ఎమ్ఎమ్
- టార్క్: 103 ఎన్ఎమ్- 115 ఎన్ఎమ్
- డ్రైవ్ టైప్: FWD
- ధర: రూ. 6 - 10.20 లక్షలు
దిమ్మతిరిగే ఫీచర్లతో 'టీవీఎస్ జూపిటర్ 110'- ధర ఎంతంటే? - TVS Jupiter 110 Launched
ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?- మార్కెట్లో టాప్-10 కార్లు ఇవే! - Best Cars in India