Indias First Reusable Hybrid Rocket : దేశంలో తొలిసారిగా పునర్వినియోగ హైబ్రిడ్ రాకెట్ ప్రయోగం జరిగింది. చెన్నై ఈసీఆర్ లోని తిరువిడందై తీర గ్రామం నుంచి రూమీ-1 అనే చిన్న రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. స్పేస్‌జోన్ ఇండియా సంస్థ తయారుచేసిన ఈ రాకెట్ శకలాలను సేకరించి తిరిగి వినియోగించుకోనున్నారు.
#WATCH | India launches its first reusable hybrid rocket, RHUMI 1. The rocket, developed by the Tamil Nadu-based start-up Space Zone India and Martin Group was launched from Thiruvidandhai in Chennai using a mobile launcher. It carries 3 Cube Satellites and 50 PICO Satellites… pic.twitter.com/Io97TvfNhE
— ANI (@ANI) August 24, 2024
దాదాపు 80 కిలోల బరువున్న ఈ రాకెట్‌ను హైడ్రాలిక్ మొబైల్ కంటైనర్ లాంచ్‌పాడ్‌పై నుంచి ప్రయోగించారు. ఇది కిలోకన్నా తక్కువ బరువున్న మూడు క్యూబ్ ఉపగ్రహాలు, 50 పికో శాటిలైట్లను మోసుకుని ఉప కక్ష్య పథంలోకి దూసుకెళ్లింది. కంటైనర్ తరహా మొబైల్ లాంచ్‌పాడ్ నుంచి ప్రయోగించిన తర్వాత భూఉప కక్ష్యలోకి ఉపగ్రహాలు వెళ్లేలా రాకెట్ పైకెళ్లింది. అక్కడికి వెళ్లేలోపు శకలాలు తిరిగి భూమికి చేరేలా రాకెట్‌లోనే పారాచూట్లను ఉంచారు. నిర్ణీత దూరం వరకు వెళ్లాక, శకలాలు కిందకు జారి, భూమికి కొంత ఎత్తుకు చేరేసరికి, పారాచూట్లు తెరచుకొని సురక్షితంగా దిగుతాయి. సెన్సార్ల సాయంతో ఆ శకలాల్ని సేకరించి తిరిగి మరో రాకెట్ వినియోగానికి వాడతారు. నింగిలో కంపనస్థాయి, ఓజోన్ పొర పరిస్థితి, ఇతర పర్యావరణ పరిస్థితుల్ని పికో ఉపగ్రహాలు గుర్తించనున్నాయి.
తిరిగి భూమికి చేరేలా ఏర్పాట్లు
కంటైనర్ తరహా మొబైల్ లాంచ్‌పాడ్ నుంచి ప్రయోగించిన తర్వాత భూఉప కక్ష్యలోకి ఉపగ్రహాలు వెళ్లేలా రాకెట్ (Reusable Hybrid Rocket) పైకెళ్లింది. అక్కడికి వెళ్లేలోపు శకలాలు తిరిగి భూమికి చేరేలా రాకెట్‌లోనే పారాచూట్లను ఉంచారు. నిర్ణీత దూరం వరకు వెళ్లాక, శకలాలు కిందకు జారి, భూమికి కొంత ఎత్తుకు చేరేసరికి పారాచూట్లు తెరచుకొని సురక్షితంగా దిగడం దీని సాంకేతికత. సెన్సార్ల సాయంతో ఆ శకలాల్ని సేకరించి తిరిగి మరో రాకెట్ వినియోగానికి వాడతారు. తద్వారా ప్రయోగ ఖర్చు బాగా తగ్గుతుందని స్పేస్‌జోన్ ఇండియా (Space Zone India) సీఈవో ఆనంద్ మేఘలింగం గతంలో తెలిపారు.
ఇస్రో మరో ఘనత - SSLV-D3 రాకెట్ ప్రయోగం విజయవంతం - ISRO SSLV D3 Launched Successfully
LIVE : శ్రీహరికోటలో SSLV-D3 ప్రయోగం - ప్రత్యక్షప్రసారం - ISRO SSLV D3 launch Live