ETV Bharat / technology

బడ్జెట్ ధరలో శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్- రిలీజ్ ఎప్పుడంటే?

త్వరలో శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ FE లాంచ్- హైప్​కు తగ్గట్టుగానే ఉంటుందా..?

Samsung Galaxy Z Flip6
Samsung Galaxy Z Flip6 (Samsung)
author img

By ETV Bharat Tech Team

Published : 18 hours ago

Updated : 17 hours ago

Samsung Galaxy Z Flip FE: మార్కెట్లో ప్రస్తుతం ఫోల్డబుల్ మొబైల్స్​కు మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ వీటిపై ఫోకస్ చేసింది. తన ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ను విస్తరించడంలో భాగంగా వచ్చే ఏడాది మరో కొత్త ఫోల్డ్ మొబైల్​ను లాంచ్ చేయనున్నట్లు సమాచారం.

శాంసంగ్ కంపెనీ వచ్చే ఏడాది ప్రారంభంలో తన గెలాక్సీ Z ఫ్లిప్ సిరీస్ స్మార్ట్‌ఫోన్​లో మరింత సరసమైన వేరియంట్‌ను లాంచ్ చేయనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీన్ని 'శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ FE' (ఫ్యాన్ ఎడిషన్) పేరుతో మార్కెట్లోకి తీసుకురానున్నారు. దీని రీలీజ్ డేట్ తెలియనప్పటికీ శాంసంగ్ నెక్ట్స్ ఫోల్డబుల్ మొబైల్స్.. గెలాక్సీ Z ఫోల్డ్ 7, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 లతో పాటుగా వచ్చే ఏడాది మధ్యలో తీసుకురావచ్చని తెలుస్తోంది.

కొన్ని వారాల క్రితం శాంసంగ్ ఎంపిక చేసిన మార్కెట్లో దాని టాప్​ ఆఫ్​ ది లైన్​ గెలాక్సీ Z ఫోల్డ్ 6 స్పెషల్ ఎడిషన్ మోడల్​ను ఆవిష్కరించింది. అయితే ఇది స్టాండర్డ్ వేరియంట్ కంటే చాలా ఎక్కువ ధరను కలిగి ఉంది. దీంతో ఇప్పుడు బడ్జెట్ ధరలో శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ సరసమైన వేరియంట్​ను తీసుకురావలని యోచిస్తోందని దక్షిణ కొరియా బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ Naver (ఆండ్రాయిడ్ అథారిటీ ద్వారా)పై ఒక పోస్ట్‌లో టిప్‌స్టర్ తెలిపింది.

అంతేకాక శాంసంగ్ మరో రెండు మొబైల్స్​ను వచ్చే ఏడాది విడుదల చేయొచ్చని పేర్కొంది. అవి ఒకటి శాంసంగ్ గెలాక్సీ S25 స్లిమ్, రెండోది గెలాక్సీ Z ఫోల్డ్ 7 సిరీస్​లో అడిషనల్ మోడల్. గెలాక్సీ S25 స్లిమ్ మొబైల్ 2025 ఏప్రిల్ నాటికి ముందు కానీ, తర్వాత గానీ రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. ఇక రెండోది ఏకకాలంలో విడుదల చేసే అవకాశాలు కన్పిస్తున్నాయని వివరించింది. అంటే శాంసంగ్ ఏడో తరం ఫోల్డబుల్స్‌తో పాటుగా ఇది రిలీజ్ కావొచ్చు. ఒకవేళ ఇది జరిగితే వచ్చే ఏడాది శాంసంగ్​ నుంచి నాలుగు ఫోల్డబుల్ స్మార్ట్​ఫోన్లు మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది.

పిచ్చెక్కించే ఫీచర్లతో వన్​ప్లస్, ఐక్యూ మొబైల్స్​- వీటిలో ఏది బెస్ట్ అంటే..?

'వివో X200 ప్రో మినీ'కి పోటీగా ఒప్పో నయా ఫోన్!- రిలీజ్ ఎప్పుడంటే?

Last Updated : 17 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.