ETV Bharat / technology

విక్రయాల్లో 'వివో'- విలువలో 'శాంసంగ్'- దేశీయ మార్కెట్లో స్మార్ట్​ఫోన్ల హవా - SMARTPHONE MARKET IN INDIA

సేల్స్​లో టాప్​ వన్​గా వివో- వాల్యూ పరంగా అగ్రస్థానంలో శాంసంగ్

Smartphone Market in India
Smartphone Market in India (ETV Bharat)
author img

By ETV Bharat Tech Team

Published : Oct 31, 2024, 12:06 PM IST

Smartphone Market in India: దక్షిణ కొరియాకు చెందిన శాంసంగ్‌ సంస్థ దేశీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో తన హవా కొనసాగిస్తోంది. స్మార్ట్‌ఫోన్‌ సేల్స్​లో వాల్యూ పరంగా టాప్​లో నిలిచింది. 22.8 శాతం మార్కెట్‌ వాటాతో అగ్రస్థానంలో ఉంది. ఐఫోన్లు తయారీ సంస్థ యాపిల్‌ రెండో స్థానంలో నిలిచిందని కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్ సంస్థ నివేదిక తెలిపింది. ప్రస్తుత క్యాలెండర్‌ సంవత్సరంలో మూడో త్రైమాసికానికి సంబంధించిన గణాంకాల వివరాలను వెల్లడించింది.

వాల్యూ పరంగా టాప్​ వన్​లో శాంసంగ్: శాంసంగ్‌ తన ప్రీమియం ఫోన్లయిన ఎస్‌ సిరీస్‌ సేల్స్​లో దూసుకుపోయి విలువ పరంగా మార్కెట్‌లో అగ్రస్థానం సాధించిందని ఈ రీసెర్చ్‌ అనలిస్ట్‌ ప్రచీర్‌ సింగ్‌ పేర్కొన్నారు. మిడ్‌ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్లు, అందుబాటు ధరలో లభించే ప్రీమియం ఫోన్లలో గెలాక్సీ ఏఐ ఫీచర్లు అందించడం కూడా ప్రీమియం సెగ్మెంట్‌కు వినియోగదారులు మారడానికి ఉపయోగపడిందని సింగ్‌ అన్నారు. శాంసంగ్‌ మార్కెట్‌ వాటా గతేడాది వాల్యూ పరంగా 21.8 శాతంగా ఉండగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌ త్రైమాసికంలో 22.8 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో యాపిల్‌ వాటా 21.8 నుంచి 21.6 శాతానికి పడిపోయింది.

సేల్స్ పరంగా అగ్రస్థానంలో వివో: ఇక సేల్స్ విషయానికి వస్తే చైనాకు చెందిన కంపెనీ వివో 19.4 శాతం మార్కెట్‌ వాటాతో టాప్​ వన్​గా నిలిచింది. ఇది గతేడాదితో పోలిస్తే 26 శాతం వృద్ధిని నమోదు చేసింది. షావోమి 16.7 శాతం వాటాతో రెండో స్థానంలో నిలిచింది. అయితే వాల్యూ పరంగా అగ్రస్థానంలో నిలిచినా.. సేల్స్​ విషయానికొస్తే 15.8 శాతం వాటాతో శాంసంగ్‌ మూడో స్థానంలో ఉంది. ఒప్పో 13.4 శాతం, రియల్‌మీ 11.3 శాతం వాటాతో 4,5 స్థానాల్లో ఉన్నాయి. మిగిలిన ఇతర స్మార్ట్​ఫోన్ కంపెనీలు 23.3 శాతం వాటాను కలిగి ఉన్నాయి. వివో విక్రయాల్లో ఐకూ, షావోమి విక్రయాల్లో పోకో సేల్స్ కలిసి ఉంటాయి. ఒప్పో నంబర్లలో వన్‌ప్లస్‌ సేల్స్​ను యాడ్ చేయలేదని కౌంటర్‌ పాయింట్‌ నివేదిక తెలిపింది.

చైనాకు షాకిచ్చిన యాపిల్- భారత్​లోనే ఐఫోన్ 17 తయారీ!

షావోమీ 15 సిరీస్ స్మార్ట్​ఫోన్స్ లాంచ్- ఓయమ్మా ఇవేం ఫీచర్లు రా సామీ..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.