ETV Bharat / technology

శాంసంగ్ ఫస్ట్ ట్రై-ఫోల్డ్ స్మార్ట్​ఫోన్- దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?

స్మార్ట్​ఫోన్ ప్రియులకు సూపర్ అప్​డేట్- త్వరలో శాంసంగ్ ట్రై-ఫోల్డ్ మొబైల్​..!

Samsung
Samsung (Getty Images)
author img

By ETV Bharat Tech Team

Published : 2 hours ago

Samsung Tri-Fold Smartphone: టెక్ మార్కెట్లో రాణించాలంటే ఎప్పటికప్పుడు కొత్త రకం ప్రొడక్ట్స్​ను రిలీజ్ చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కస్టమర్ల అభిరుచి, ఆసక్తికి అనుగుణంగా కొత్త మోడల్ మొబైల్స్​ను తీసుకొచ్చేందుకు కంపెనీలన్నీ ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఫోల్డబుల్ మొబైల్స్​దే హవా. వీటికి ఉన్న క్రేజ్ వేరే లెవల్. దీంతో ఫోల్డబుల్ మొబైల్స్ తీసుకొచ్చేందుకు స్మార్ట్​ఫోన్ తయారీ సంస్థలు పోటీపడుతున్నాయి.

ఇప్పటికే మార్కెట్లో పలు కంపెనీల నుంచి ఫోల్డబుల్ మొబైల్స్ రిలీజ్ అవ్వగా.. తాజాగా శాంసంగ్​ కూడా తన ఫోల్డ్ మొబైల్స్​​ను పరిచయం చేసేందుకు తహతహలాడుతోంది. ఈ మేరకు శాంసంగ్ ట్రై- ఫోల్డ్ మొబైల్​ తీసుకొచ్చే పనిలో పడిందని గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే వీటిపై తాజాగా ZDNet కొరియా రిపోర్ట్ (కొరియన్​లో).. ఒక క్లారిటీ ఇచ్చింది.

ఈ నివేదిక.. శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఎంట్రీ లెవల్ క్లామ్‌షెల్-స్టైల్ ఫోల్డబుల్ ఫోన్‌తో పాటు ట్రై-ఫోల్డ్ మోడల్​ను తీసుకొచ్చే పనిలో పడిందని వెల్లడించింది. ఈ రెండు ఫోల్డబుల్ మొబైల్స్​ను శాంసంగ్ వచ్చే ఏడాది లాంచ్ చేయొచ్చని తెలిపింది. శాంసంగ్ మాత్రమే కాకుండా Xiaomi, Honor, Oppo వంటి ఇతర స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు కూడా తమ ట్రై-ఫోల్డ్ మొబైల్స్​ తీసుకొచ్చేందుకు పని చేస్తున్నాయని సమాచారం. అయితే ఇవి వాటి ట్రై- ఫోల్డ్ మొబైల్స్​ను మరింత పెద్ద స్క్రీన్​తో తీసుకురావచ్చని తెలుస్తోంది. ​

Xiaomi, Oppo వంటి ప్రత్యర్థి బ్రాండ్లకు ఫోల్డబుల్ డిస్​ప్లేలను సరఫరా చేయడంలో శాంసంగ్ డిస్​ప్లేలు కీలక పాత్ర పోషించాయి. అయితే ఫోల్డబుల్ ఫోన్‌లలో ఉపయోగించే OLED డిస్‌ప్లేల ఆర్డర్‌లు ఈ ఏడాది 10 శాతం తగ్గినట్లు ఈ ZDNet కొరియా నివేదిక పేర్కొంది. శాంసంగ్ ఈ ఏడాది ప్రారంభంలో లాంచ్ చేసిన Galaxy Z Flip 6, Galaxy Z Fold 6 మోడల్ మొబైల్స్ డిమాండ్ అంచనాల కంటే తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. దీంతో కొత్త ఫోల్డబుల్ డిస్​ప్లేల అభివృద్ధిలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి.

అయితే ఇటీవలే హువావే కంపెనీ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రై ఫోల్టబుల్ స్మార్ట్​ఫోన్​ను లాంచ్ చేసింది. హువావే మేట్‌ ఎక్స్‌టీ పేరుతో దీన్ని తీసుకొచ్చింది. ఈ మొబైల్ అత్యంత ప్రజాదరణతో సేల్స్​లో దూసుకుపోతోంది. దీంతో ఇప్పుడు దీని ప్రత్యర్థి హువావేని అధిగమించేందుకు శాంసంగ్ కూడా ట్రై ఫోల్డ్ స్మార్ట్​ఫోన్​ను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మొబైల్ 2025లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ప్రీమియం ఫీచర్లతో నయా స్పోర్ట్స్ బైక్- ధర, ఫీచర్లు ఇవే..!

శాంసంగ్ మొబైల్స్​లో ఆండ్రాయిడ్ 15..!- ఏ సిరీస్​లో ఉంటుందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.