ETV Bharat / technology

రీన్యూడ్ Vs రీఫర్బిష్డ్ Vs ఓపెన్ బాక్స్ ప్రోడక్ట్స్ - వీటిలో ఏది కొంటే బెటర్? - Renewed Vs Refurbished Phones - RENEWED VS REFURBISHED PHONES

Renewed Vs Refurbished Phones : 'ప్రోడక్ట్స్'‌లో ఎన్నో రకాలు ఉన్నాయి. మీరు ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్నప్పుడు కూడా తీరొక్క ప్రోడక్ట్స్‌ను గమనిస్తుంటారు. ఉదాహరణకు మీరు యాపిల్ ఐఫోన్ కోసం సెర్చ్ చేసేటప్పుడు కూడా రిన్యూడ్ ఫోన్లు, రీఫర్బిష్డ్ ఐఫోన్లు కనిపిస్తుంటాయి. అయితే వాటి మధ్య తేడా ఏమిటనేది తెలుసుకోలేక చాలామంది సతమతం అయిపోతుంటారు. ఇలాంటి ప్రోడక్ట్స్‌తో ముడిపడిన ప్రశ్నలకు సమాధానం దొరకాలన్నా, సందేహాలు తీరాలన్నా ఈ కథనం చదవాల్సిందే.

Renewed Vs Refurbished Phones
Renewed Vs Refurbished Phones (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 7, 2024, 2:22 PM IST

Renewed Vs Refurbished Phones : రీన్యూడ్, రీఫర్బిష్డ్ ప్రోడక్ట్స్‌లు చూసి కన్ఫ్యూజ్ అయిపోతున్నారా? వాటిలో ఏది కొనాలో అర్థంకాక గందరగోళానికి గురవుతున్నారా? అయితే బెంగపడొద్దు. మీకు ఇక్కడ పూర్తి సమాచారం లభిస్తుంది. రీన్యూడ్, రీఫర్బిష్డ్, ప్రీ ఓన్డ్, యూజ్డ్ ప్రోడక్ట్స్ అంటే ఏమిటనేది మీరు ఇక్కడ తెలుసుకుంటారు. వాటిలో ఏది ఎంచుకోవాలి? సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్స్ కొనేటప్పుడు ఏమేం చెక్ చేయాలి? అనే దానిపై మీకు ఈ కథనంలో ఉపయోగకర సమాచారం లభిస్తుంది.

తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు

  • ఒక విషయం మాత్రం క్లియర్. అదేమిటంటే రీన్యూడ్ అన్నా, రీఫర్బిష్డ్ అన్నా అప్పటికే వినియోగించిన ప్రోడక్ట్స్ అని అర్థం. వాటికి రిపేర్లు చేసి కాస్త బెటర్ కండీషన్‌లోకి తెచ్చి విక్రయిస్తుంటారు.
  • ప్రీ ఓన్డ్, యూజ్డ్ ప్రోడక్ట్స్ అంటే రిపేర్ చేసినవి కావు. వినియోగదారులు కొని, వాడకముందే కంపెనీకి వాపసు చేసిన ప్రోడక్ట్స్‌ను ఈ పేర్లతో పిలుస్తారు.
  • సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్స్‌ను కొనే ముందు తప్పకుండా దానికి వారంటీ తీసుకోండి. ఒకవేళ దాని పనితీరు బాగాలేకపోతే ఎప్పటిలోగా వాపసు చేయొచ్చో తెలుసుకోండి.
  • ప్రత్యేకించి ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేవారు సర్టిఫైడ్ రిన్యూడ్, రీఫర్బిష్డ్ ప్రోడక్ట్స్ విక్రేతల నుంచే కొనుగోళ్లు చేయాలి. ఎందుకంటే సర్టిఫైడ్ సెల్లర్స్ దాదాపు కొత్త దానిని తలపించే రీన్యూడ్, రీఫర్బిష్డ్ ప్రోడక్ట్స్‌ను అమ్ముతుంటారు.

రిన్యూడ్, రీఫర్బిష్డ్ ప్రోడక్ట్స్‌కు తేడా ఏమిటి ?

  • రీఫర్బిష్డ్ ప్రోడక్ట్స్‌తో పోలిస్తే రిన్యూడ్ ప్రోడక్ట్స్ తక్కువ కాలం పాటు వాడినవి.
  • రిన్యూడ్ ప్రోడక్ట్స్ మంచి కండీషన్‌లో ఉంటాయి. వాటి పనితీరు కూడా దాదాపుగా కొత్తదానిలాగే ఉంటుంది.
  • అమెజాన్ తమ సైట్‌లో రీఫర్బిష్డ్ ప్రోడక్ట్స్‌ను కూడా విక్రయిస్తుంటుంది. అవి మంచి కండీషన్‌లోనే ఉంటాయి. అయితే అన్నీ అలాగే ఉంటాయని చెప్పలేం. తమ రీఫర్బిష్డ్ ప్రోడక్ట్స్‌కు అమెజాన్ ప్రీమియం, ఎక్స‌లెంట్, గుడ్, యాక్సెప్టబుల్ కండీషన్ అనే లేబుల్స్‌ ఇస్తుంటుంది.
  • రీన్యూడ్, రీఫర్బిష్డ్ ప్రోడక్ట్స్‌ను రిటైలర్లు లేదా థర్డ్ పార్టీ సంస్థలు విక్రయిస్తుంటాయి. ఎవరు విక్రయిస్తున్నారు అనే దాని ఆధారంగా మనం ఆ ప్రోడక్ట్ క్వాలిటీపై ప్రాథమిక అంచనాకు రావచ్చు.
  • సర్టిఫైడ్ రీఫర్బిష్డ్ ప్రోడక్ట్స్ అనేవి స్వయంగా ఆయా కంపెనీలే రిపేర్ చేసి పునరుద్ధరించినవి. అందుకే సర్టిఫైడ్ రీఫర్బిష్డ్ ప్రోడక్ట్స్‌కు కొనుగోలులో ప్రయారిటీ ఇవ్వొచ్చు.
  • ఈబే, క్రెయిగ్స్ లిస్ట్ వంటి థర్డ్ పార్టీ విక్రేతలు పాత ఉత్పత్తులను సరిచేసి ఆన్‌లైన్ మార్కెట్‌లో విక్రయిస్తుంటాయి. వీటి రేట్లు సర్టిఫైట్ రీఫర్బిష్డ్ ప్రోడక్ట్స్‌ కంటే తక్కువగా ఉంటుంది. అయితే గతంలో ఆ ప్రోడక్ట్స్‌లో ఎలాంటి సమస్య ఉండేది? దాన్ని ఎంత వరకు మరమ్మతు చేశారు? అనే దానిపై మీకు క్లారిటీ రాదు. అందుకే వీటికి కొనుగోలులో తక్కువ ప్రయారిటీ ఇవ్వాలి.

యూజ్డ్, ప్రీ ఓన్డ్, ఓపెన్ బాక్స్ ప్రోడక్ట్స్ మధ్య తేడా ఏమిటి?

  • ఓపెన్ బాక్స్ ప్రోడక్ట్ అంటే కొత్తదే. సీల్ తెరిచినది కావడం వల్ల దానికి ఓపెన్ బాక్స్ ప్రోడక్ట్ అనే పేరు వచ్చింది. యూజ్డ్ ప్రోడక్ట్, ప్రీ ఓన్డ్ ప్రోడక్ట్ అంటే వాడినవి. అంటే అవి పాతవే.
  • గతంలో వాడినది అని చెప్పలేక సౌమ్యంగా 'ప్రీ ఓన్డ్' అనే పదాన్ని వాడుతుంటారు.
  • రీన్యూడ్, రీఫర్బిష్డ్ ప్రోడక్ట్స్‌ను రిపేర్ చేసి పునరుద్ధరిస్తారు. కానీ యూజ్డ్, ప్రీ ఓన్డ్ ప్రోడక్ట్స్‌ను రిపేర్ చేయరు. వాటి తాజా కండీషన్‌లోనే నేరుగా విక్రయానికి పెడతారు.
  • సర్టిఫైడ్ సెల్లర్స్ దగ్గర యూజ్డ్, ప్రీ ఓన్డ్ ప్రోడక్ట్స్‌ మంచి కండీషన్‌లో లభిస్తాయి. వాటితో ముడిపడిమైన కచ్చితమైన సమాచారం కూడా వారి వద్ద అందుబాటులో ఉంటుంది.

సెకండ్ హ్యాండ్ ఉత్పత్తులను కొనేటప్పుడు ఏమేం చూడాలి ?

  • సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్‌‌ను కొనేటప్పుడు విక్రేత నుంచి వారంటీ తీసుకోండి. అది పనిచేయడం మానేస్తే రీప్లేస్‌మెంట్ అవకాశం కల్పిస్తారా లేదా అనేది తెలుసుకోవాలి. ఈ అంశాలపై హామీ పొందితే మీ డబ్బుకు భరోసా లభించినట్లు అవుతుంది.
  • యాపిల్, శాంసంగ్ వంటి కంపెనీల సర్టిఫైడ్ సెకండ్ హ్యాండ్ ఉత్పత్తులు కనీసం ఒక సంవత్సరం వ్యారంటీతో వస్తాయి. కొన్ని కంపెనీలు అంతగా వ్యారంటీ ఇవ్వవు.
  • ఖరీదైన వస్తువులు కొనేవారు సాధ్యమైనంత ఎక్కువ వారంటీని పొందేందుకు ప్రయత్నించాలి.
  • వారంటీలో ఏమేం కవర్ చేస్తారనే దానిపై సెల్లర్ నుంచి క్లారిటీ తీసుకోవాలి.
  • కనీసం 1 నెల రిటర్న్ పాలసీని కలిగి ఉన్న ఉత్పత్తులు కొనాలి.
  • కొంతమంది సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్స్‌ను 'ఫైనల్ సేల్' కేటగిరీలో విక్రయిస్తుంటాయి. అంటే కొన్న తర్వాత దాన్ని మీరు రిటర్న్ చేయలేరు. ధర తక్కువగా ఉన్నా ఇలాంటి ప్రోడక్ట్స్‌కు దూరంగా ఉండటమే సేఫ్.
  • రీయూజ్డ్, రీన్యూడ్ ప్రోడక్ట్స్‌ను కొనేటప్పుడు వాటిని ఎవరు రిపేర్ చేయించారు అనేది స్పష్టంగా తెలుసుకోండి. ఆ పనిని చేయించింది రిటైలరా? థర్డ్ పార్టీ విక్రేతా? అనే సమాచారం సేకరించండి. రిటైలర్లు ప్రోడక్ట్స్ రిపేరింగ్‌ కోసం సరైన ప్రక్రియను అనుసరిస్తారు. కానీ థర్డ్ పార్టీ సెల్లర్స్ నాసిరకం మెటీరియల్‌తో తూతూమంత్రంగా రిపేరింగ్ చేస్తారు.
  • ఫోన్లు, కంప్యూటర్లు, ట్యాబ్లెట్ వంటివి థర్డ్ పార్టీ సెల్లర్స్ నుంచి కొనేటప్పుడు తప్పకుండా ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. దీనివల్ల అందులోని పాత సమాచారం అంతా చెరిగిపోతుంది.
  • సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్స్ కోసం ఆన్‌లైన్‌లో వెతుకుతున్నప్పుడు తప్పకుండా వాటికి సంబంధించిన రివ్యూస్‌ను చదవండి. గతంలో వాటిని కొన్నవారు ఇచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా మీరు కొనాలా? వద్దా? అనేది డిసైడ్ చేసుకోండి. సగటున 200 రివ్యూలు, 4.5 స్టార్ లేదా 90% రేటింగ్ ఉన్న సెల్లర్స్‌కు నుంచే కొనుగోలు చేసేందుకు ప్రయత్నించండి.

ఏ రకమైన సెకండ్ హ్యాండ్ ఉత్పత్తిని కొనడం బెటర్
సర్టిఫైడ్ రీన్యూడ్, రీఫర్బిష్డ్ ప్రోడక్ట్స్‌ను కొనడానికి మీరు ప్రయారిటీ ఇవ్వొచ్చు. థర్డ్ పార్టీ సెల్లర్స్ విక్రయించే వాటి కంటే ఇవే చాలా బెటర్. సర్టిఫైడ్ రీన్యూడ్, రీఫర్బిష్డ్ కేటగిరీలలో ఫోన్‌లు, టాబ్లెట్‌లు, కంప్యూటర్‌లు, టీవీలు, ప్రింటర్లు, కీబోర్డులను కొనేందుకు మనం ప్రయారిటీ ఇవ్వొచ్చు. ప్రత్యేకించి యాపిల్, శాంసంగ్ కంపెనీల సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్స్ చాలా మంచి కండీషన్‌లో ఉంటాయి. మంచి తగ్గింపు రేట్లకు అవి లభిస్తాయి. అయితే చర్మాన్ని స్పర్శించే హెడ్‌ఫోన్ల వంటి ప్రోడక్ట్స్‌ను సెకండ్ హ్యాండ్‌లో కొనకపోవడమే బెటర్.

మీ ఐఫోన్​ను చాలా ఫాస్ట్​గా ఛార్జ్ చేయాలా? ఈ 9 టిప్స్​ మీ కోసమే! - How To Charge IPhone Faster

ఫోన్ నుంచే PC ఫైల్స్​ యాక్సెస్ - మైక్రోసాఫ్ట్ నయా ఫీచర్​ - ఎలా వాడాలో తెలుసా? - Microsoft Windows Latest Features

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.