ETV Bharat / technology

న్యూ డిజైన్​తో రియల్​మీ కొత్త స్మార్ట్​ఫోన్- బడ్జెట్ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు! - REALME 14X

త్వరలో ఇండియన్ మార్కెట్లోకి 'రియల్​మీ 14x'- లాంఛ్​కు ముందే డిటెయిల్స్ లీక్!

Realme 14x May Be Launched in India
Realme 14x May Be Launched in India (Realme)
author img

By ETV Bharat Tech Team

Published : Dec 8, 2024, 3:36 PM IST

Realme 14x May Be Launched in India: మరికొన్ని రోజుల్లో ఇండియన్ మార్కెట్లోకి రియల్​మీ నుంచి అదిరే స్మార్ట్​ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది. కంపెనీ 'Realme 14x' మొబైల్​ను ఈ నెలలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. లాంఛ్​కు ముందే దీనికి సంబంధించిన స్పెక్స్, ఫీచర్లపై కొంత సమాచారం రివీల్ అయింది.

సమాచారం ప్రకారం.. 'రియల్​మీ 12x' రిలీజ్ తర్వాత కంపెనీ '13x'ని దాటవేసి నేరుగా 'రియల్​మీ 14x' ఫోన్​ను లాంఛ్ చేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిసెంబర్ 18, 2024న భారత మార్కెట్లో విడుదల కానుంది. ఈ స్మార్ట్​ఫోన్ సరికొత్త డిజైన్​తో పాటు వవర్​ఫుల్ బ్యాటరీ ప్యాక్​తో వస్తుంది. అంతేకాక డస్ట్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ బాడీతో దీన్ని తీసుకొస్తున్నారు. వీటితో పాటు ఈ ఫోన్​లో ఇంకా ఏమేం ఫీచర్లు ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

'రియల్​మీ 14x' డిజైన్ అండ్ స్పెసిఫికేషన్లు:

టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ప్రకారం.. అప్​కమింగ్ 'రియల్‌మీ 14x' మొబైల్ దాని ప్రీవియస్ మోడల్​లా కాకుండా భిన్నమైన డిజైన్‌తో వస్తుంది. దీని పాత మోడల్​లోని సర్క్యులర్ కెమెరా రింగ్​ను ఛేంజ్ చేసి ఇందులో సింపుల్ కెమెరా లేఅవుట్​ను అందించారు. ఈ ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్​తో వస్తుంది. ఈ కెమెరా సెటప్ 'వివో T3 5G' స్మార్ట్‌ఫోన్‌ మాదిరిగానే మొబైల్ బ్యాక్ ప్యానెల్​ పై భాగంలో నిలువుగా అమర్చి ఉంటుంది.

ఇక ఈ ఫోన్​లో USB టైప్-సి పోర్ట్‌తో పాటు వాల్యూమ్ రాకర్, ఫ్రేమ్‌కు కుడి వైపున పవర్ బటన్ ఉంది. ఇది 6.67 అంగుళాల HD+ IPS LCD డిస్​ప్లే, 6000mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో డస్ట్ అండ్ వాటర్ ప్రొటెక్షన్​తో వస్తుంది. ఈ స్మార్ట్​ఫోన్ 6GB/128GB, 8GB/128GB, 8GB/256GB అనే మూడు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది.

కలర్ ఆప్షన్స్:

ఆన్‌లైన్‌లో అందించిన ఫొటోల ప్రకారం.. స్మార్ట్‌ఫోన్ జ్యువెల్ రెడ్, గోల్డెన్ గ్లో, క్రిస్టల్ బ్లాక్ వంటి మూడు కలర్ స్కీమ్‌లతో ఎంట్రీ ఇవ్వనున్నాయి.

ధర:

సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ సేల్స్ డిసెంబర్ 18 నుంచి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రారంభం కానున్నాయి. కంపెనీ ఈ ఫోన్‌ను రూ.14,999 ప్రారంభ ధరతో లాంఛ్ చేయొచ్చు. అయితే కచ్చితమైన ధర, సేల్ వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

కంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్​లో వీటికి తిరుగేలేదు.. అమేజ్ vs డిజైర్.. ఈ రెండింటిలో బెస్ట్ ఇదే..!

టెక్నో 'ఫాంటమ్ V' సిరీస్ వచ్చేశాయ్- దేశంలోనే అత్యంత సరసమైన ఫోల్డబుల్ ఫోన్లు ఇవే!

వాట్సాప్​లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్- ఇకపై గ్రూప్​ చాట్​లో నో కన్ఫ్యూజన్!

కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా?- ఇప్పుడే త్వరపడండి.. లేకుంటే జేబులు ఖాళీ అవ్వడం ఖాయం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.