POCO New 5G Phones: ఇండియన్ మార్కెట్లోకి పోకో నుంచి పవర్ ఫుల్ 5G స్మార్ట్ఫోన్లు ఎంట్రీ ఇవ్వబోతున్నాయి. అది కూడా ప్రీమియం ఫీచర్లతో అత్యంత చౌక ధరలో రానున్నట్లు తెలుస్తోంది. 'POCO C75 5G', 'POCO M7 Pro 5G' పేర్లతో వీటిని ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనున్నారు. వీటి రిలీజ్‌పై పోకో సీఈవో హిమాన్షు టాండన్ 'X' లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా వీటి రిలీజ్, ధర, ఫీచర్లపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.
పోకో 5G మొబైల్స్ రిలీజ్ ఎప్పుడు?: పోకో సీఈవో హిమాన్షు టాండన్ 'X' లో పోస్ట్ ద్వారా ఈ సరికొత్త స్మార్ట్ఫోన్ల లాంఛింగ్ తేదీని ప్రకటించారు. ఆయన చేసిన పోస్ట్ ప్రకారం ఈ అప్‌కమింగ్ మొబైల్స్ డిసెంబర్ 17, 2024న రిలీజ్ కానున్నాయి.
ప్రీమియం ఫీచర్లు: 'పోకో C75 5G', 'POCO M7 Pro 5G' మొబైల్స్‌పై స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ను రివీల్ చేయలేదు. ఆయన పోస్ట్‌లో కేవలం 'POCO M7 Pro 5G' స్మార్ట్‌ఫోన్ లాంఛ్ డేట్‌ను మాత్రమే రివీల్ చేశారు. అయితే నివేదికల ప్రకారం.. కంపెనీ ఈ 5G మొబైల్స్‌ను బడ్జెట్- ఫ్రెండ్లీగా అందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పోకో C-సిరీస్ దాని సరసమైన ధరకు ప్రసిద్ధి చెందడంతో కంపెనీ ఈ అప్‌కమింగ్ మొబైల్స్‌ను కూడా బడ్జెట్- ఫ్రెండ్లీగా తీసుకురావాలని చూస్తోంది.
ఈ రెండింటిలో 'POCO M7 Pro 5G' మొబైల్ మరిన్ని ఎక్కువ ప్రీమియం ఫీచర్లతో రానుంది. దీంతో ఎక్కువ ప్రీమియం ఫీచర్లు ఉన్న మొబైల్ కోసం చూస్తున్న వినియోగదారులకు ఇది బెస్ట్ ఆప్షన్. 5G కనెక్టివిటీతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి కంపెనీ ఈ రెండు ఫోన్‌లను తీసుకొస్తోంది.
గతేడాది డిసెంబర్‌లో 'POCO C65' స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంఛ్ అయింది. దీంతో ఈ అప్‌కమింగ్ 'C75 5G' ఫోన్‌ను C-సిరీస్‌లో చేర్చనున్నారని అంతా భావిస్తున్నారు. అదేవిధంగా 'POCO M6 Pro 5G' స్మార్ట్‌ఫోన్ ఈ సంవత్సరం ప్రారంభంలో రిలీజ్ చేశారు.
POCO M7 Pro 5G, POCO C75 5G మొబైల్స్‌లో ఎక్స్పెక్టెడ్ ఫీచర్లు:
'POCO M7 Pro 5G' ఫోన్‌ను 'Redmi Note 14 5G' రీబ్రాండెడ్ వెర్షన్ అని అంతా భావిస్తున్నారు. దీని డిజైన్ డ్యూయల్- టోన్ ఫినిష్, స్క్వేర్ రియర్ కెమెరా మాడ్యుల్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్ HyperOSలో రన్ కావచ్చు. ఇక 'POCO C75 5G' ఇతర మార్కెట్‌లలో ఇప్పటికే అందుబాటులో ఉన్న 'C75 4G' వేరియంట్‌కు భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ 5G వెర్షన్ స్నాప్‌డ్రాగన్ 4s Gen 2 చిప్‌సెట్‌తో వస్తుంది. ఇది పెద్ద 6.88-అంగుళాల HD+ 120Hz డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,160mAh బ్యాటరీని ప్యాక్‌తో వస్తుందని సమాచారం.
Your world’s about to get LIT! #POCOM7Pro5G#LitAF 🔥#Flipkart#NewLaunch pic.twitter.com/Gyriq0UyKA
— POCO India (@IndiaPOCO) December 4, 2024
50MP ట్రిపుల్ రియర్ కెమెరా: ఈ రెండు ఫోన్లూ ఫోటోగ్రఫీ కోసం ఇది ఇటీవల ప్రారంభించిన 'Redmi A4 5G' మాదిరిగానే 2MP, 5MP రెండు సెకండరీ సెన్సార్‌లతో పాటు 50MP ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండొచ్చు. అయితే కెమెరా కాన్ఫిగరేషన్‌లో స్వల్ప మార్పు కూడా ఉండొచ్చు.
ADAS సిస్టమ్‌తో హోండా న్యూ అమేజ్- ఈ ఫీచర్‌తో వచ్చిన దేశంలోనే అత్యంత చౌకైన కారు ఇదే!
ఓలా ఎలక్ట్రిక్ యూజర్లకు గుడ్‌న్యూస్- ఒకేసారి ఏకంగా 3200 స్టోర్లు.. ఇక సర్వీసులకు తగ్గేదేలే..!