ETV Bharat / technology

మీ స్మార్ట్​ఫోన్ హ్యాంగ్ అవుతోందా?- ఈ టిప్స్​తో మీ మొబైల్​ మరింత ఫాస్ట్​! - స్మార్ట్​ఫోన్ హ్యాంగ్

Phone Hanging Solution : మీ ఫోన్ తరచూ హ్యాంగ్ అవుతుందా? అయితే ఏం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్ని సింపుల్ టెక్నిక్​లను పాటిస్తే మీ మొబైల్​ మరింత ఫాస్ట్​గా పనిచేస్తుంది. అయితే అసలు ఫోన్ హ్యాంగ్ అవ్వడానికి కారణాలేంటి? అలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? అనే వివరాలు మీకోసం.

Phone Hanging Solution
Phone Hanging Solution
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2024, 7:25 AM IST

Phone Hanging Solution : ఎప్పటికప్పుడు సరికొత్త డిజైన్లతో, శక్తిమంతమైన హార్డ్​వేర్​లతో వివిధ స్మార్ట్​ఫోన్​ మోడళ్లు మార్కెట్​లోకి వస్తున్నాయి. వినియోగదారులు కొనుగోలుకు సై అంటున్నారు. అయితే క్రమంగా ఫోన్ల పనితీరు నెమ్మదించడం, హ్యాంగ్​ అవ్వడం వంటి సమస్యలు తలెత్తున్నాయి. మరి ఫోన్ ​హ్యాంగ్ అవ్వడానికి కారణం ఏంటి? ఏయే టెక్నిక్ పాటిస్తే అలాంటి సమస్యలు రాకుండా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇలా చేయండి!
ఫోన్​ హ్యాంగ్ అయిన చాలా సందర్భాల్లో రీస్టార్ట్​ చేస్తే ఆ సమస్య తీరిపోతుంది. ఇలా రీస్టార్ట్ చేయాలంటే మొబైల్​లోని పవర్​ మెనూ ఆప్షన్ కనిపించేంతవరకూ పవర్ బటన్​ని ప్రెస్ చేసి ఉంచాలి. తరువాత వచ్చే ఆప్షన్లలో రీస్టార్ట్ లేదా రీబూట్ బటన్​పై క్లిక్ చేయాలి. మీ ఫోన్ హ్యాంగ్ అయ్యేలా చేసే ఏవైనా తాత్కాలిక అవాంతరాలు ఉంటే వాటిని తొలగించేందుకు ఇది ఉపయోగపడుతుంది. అప్పటికీ ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ఈ టెక్నిక్​లను పాటిస్తే మొబైల్ హ్యాంగ్ అవ్వకుండా చూడొచ్చు.

అవసరం లేని యాప్​లను క్లోజ్​ చేయండి
అన్​రెస్పాన్సివ్​ యాప్​ల వల్ల కూడా ఫోన్ హ్యాంగ్ అవ్వవచ్చు. అందువల్ల అలాంటి అవసరం లేని యాప్​లను క్లోజ్ చేయండి. దీనివల్ల కొంత స్టోరేజ్ సేవ్ అవుతుంది. ఫోన్ సరిగా పనిచేసేందుకు ఈ విధంగా చేయడం చాలా అవసరం.

యాప్​ క్యాచీని క్లియర్ చేయండి
స్మార్ట్​ఫోన్​లో యాప్​లను ఉపయోగిస్తున్నప్పుడు క్యాచీ అనేది జనరేట్ అవుతుంది. ఈ క్యాచీ డేటా ఎక్కువైతే ఫోన్ పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. దీనిని డిలీట్ చేయడానికి యాప్ మెనూపై క్లిక్ చేయాలి. ఎబౌట్ యాప్ ఆప్షన్​ను ఎంచుకుని అందులో స్టోరేజ్ అనే మెనూను సెలెక్ట్ చేయాలి. స్టోరేజ్ విభాగంలోని క్లియర్ క్యాచీపై క్లిక్ చేయాలి. దీంతో ఫోన్ హ్యాంగింగ్​కు కారణమైన క్యాచీ డిలీట్ అవుతుంది.

యాప్​లను అప్​డేట్ చేయండి
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్​, యాప్​లను ఉపయోగించే వారందరూ ఎప్పటికప్పుడు ఫోన్ అప్​డేట్ చేసుకోవాలి. దీనివల్ల కొత్త సాప్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్‌అయ్యి స్మార్ట్​ఫోన్ మరింత వేగంగా పనిచేస్తుంది. ఇందుకు ఫోన్​లో ఉండే సెట్టింగ్స్​ ఆప్షన్​లోకి వెళ్లి దానిలో సిస్టమ్ అప్​డేట్ అనే ఆప్షన్​ను క్లిక్ చేయాలి. దానిలో అప్​డేట్ అని ఏదైనా కనిపిస్తే వెంటనే తమ ఫోన్​లో లేటెస్ట్ వెర్షన్​ను అప్​డేట్ చేసుకోవాలి.

అవసరంలేని ఫైల్స్​ను డిలీట్ చేయండి
స్మార్ట్​ఫోన్​లో మనకు అవసరం అయినప్పుడు కొన్నియాప్​లు, వీడియోలను డౌన్​లోడ్ చేసుకుంటుంటాం. వీటితో పాటు ఫోటోలు, ఫైల్లను సేవ్ చేస్తుంటాం. వీటిలో అవసరం అయిన ఫైళ్లు, ఫోటోలను ఉంచుకుని మిగిలిన వాటిని డిలీట్ చేయాలి. ఇలా చేయడం వల్ల మీ స్మార్ట్​ఫోన్ స్టోరేజ్​లో ఖాళీ అవుతుంది. ఫలితంగా మీ ఫోన్ పనితీరు మెరుగుపడుతుంది.

ఆ యాప్​లను డిజెబుల్ చేయండి
కొన్ని యాప్​లు ఫోన్ నెమ్మదిగా పనిచేసేందుకు కారణమవుతాయి. వీటివల్ల కొన్నిసార్లు ఫోన్​ హ్యాంగ్ కూడా అవ్వవచ్చు. అందువల్ల అలాంటి యాప్​లను గుర్తించి వాటిని తాత్కాలికంగా డిజెబుల్ చేయాలి. అప్పటికీ మొబైల్ హ్యాంగ్ అవుతుంటే ఆ యాప్​ను డిలీట్ చేయడమే మంచిది. ఈ విధంగా చేసేముందు ఆ యాప్​లో ముఖ్యమైన సమాచారం ఏదైనా ఉందేమే చూసుకోవడం చాలా అవసరం. ఆ సమాచారాన్ని ఎక్కడైన సేవ్ చేసుకోవాలి.

ఫ్యాక్టరీ రీసెట్
పైన వివరించిన టెక్నిక్స్ పాటించినప్పటికీ మీ ఫోన్ హ్యాంగ్ అవుతుంటే అప్పుడు మీరు చేయాల్సింది ఫ్యాక్టరీ రీసెట్. అయితే ఈ ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే మీ ఫోన్​లో ఉన్న డేటా అంతా డిలీట్ అవుతుంది. అందువల్ల ఇలా చేయడానికి ముందు మీ ఫోన్​లోని ముఖ్యమైన సమాచారాన్నంతటినీ ఎక్కడైనా సేవ్ చేసుకోవాలి. ఫ్యాక్టరీ రీసెట్​ చేసేందుకు మీఫోన్​లోని సెట్టింగ్స్ లేదా రీసెట్ ఆప్షన్​పై క్లిక్ చేయాలి. తరువాత ఫ్యాక్టరీ రీసెట్​ ఆనే ఆప్షన్​ను ఎంచుకోవాలి. అక్కడ ఇచ్చినటువంటి సూచనలును అనుసరించి ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి.

ఫోన్​లో తగినంత స్టోరేజ్ ఉండాలి
ఫోన్​లో స్టోరీజ్​ తక్కువగా ఉంటే అధి మొబైల్ పనితీరుపై ప్రభావాన్ని చూపిస్తుంది. అందువల్ల ముఖ్యమైన ఫొటోలు, ఫైళ్లు, వీడియోలను ఏదైనా పెన్​డ్రైవ్​లో సేవ్​చేసుకోవడం మంచిది. స్టోరేజ్ మెనేజ్​మెంట్ చేయడంకోసం నమ్మకమైన యాప్​లను ఉపయోగించండి. దీనిని ఉపయోగించి అసవసరంలేని డేటాను ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకోండి. తద్వారా మీ ఫోన్ హ్యాంగ్ అవ్వకుండా ఉంటుంది.

మాల్​వేర్​ను స్కాన్ చేయండి
స్మార్ట్​ఫోన్ హ్యాంగ్ అవ్వడానికి హానికారకమైనటువంటి సాఫ్ట్​వేర్​లు కూడా కావచ్చు. అందువల్ల ప్రాచుర్యం పొందిన యాంటీ వైరస్ యాప్​ను ఉపయోగించి మీ డివైస్​లో ఏమైనా మాల్​వేర్​ ఉందో లేదో స్కాన్ చేయాలి. తరచుగా ఈ యాప్​ను అప్​డేట్ చేస్తూఉండాలి. ఇలా చేయడం వల్ల మీ ఫోన్ హ్యాంగ్​ అవ్వకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది.

నిపుణులను సంప్రదించండి
పైన వివరించిన టెక్నిక్​లు పాటించినప్పటికీ మీ స్మార్ట్​ఫోన్ హ్యాంగ్ అవుతుందంటే మీరు తప్పనిసరిగా నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది. అథరైజ్డ్ సర్వీస్​సెంటర్​ను సందర్శించాలి. తద్వారా మీ ఫోన్ హ్యాంగ్ కాకుండా కాపాడుకోవచ్చు.

మీ ఫోన్​ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా? ఈ ట్రిక్స్ పాటిస్తే ప్రాబ్లమ్ సాల్వ్!

ఇన్​కాగ్నిటో మోడ్​లో బ్రౌజ్​ చేస్తున్నారా? గూగుల్ మీ రహస్యాలను ట్రాక్ చేస్తోంది జాగ్రత్త!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.