Flagship Smartphones with AI features: టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ప్రజలు కూడా అప్‌డేట్ అవుతున్నారు. దీంతో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు కూడా వినియోగదారుల ఆసక్తి, అభిరుచికి అనుగుణంగా మొబైల్స్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. పలు బ్రాండెడ్ కంపెనీలు మొబైల్స్‌లో ఎన్నో కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూ కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. వాటిలో AI మోడల్స్ స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది AI ఫీచర్లతో రిలీజ్ అయిన స్మార్ట్‌ఫోన్ మోడల్స్, వీటి ధర, స్పెసిఫికేషన్ల వివరాలు మీకోసం.
AI ఫీచర్లతో టాప్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లు ఇవే!:
1. Google Pixel 9 Series: గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఫీచర్లతో వీటిని కంపెనీ రిలీజ్ చేసింది. ఇవి మన దేశంలో కూడా అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ఈ సిరీస్‌లో 'గూగుల్ పిక్సెల్ 9', 'పిక్సెల్ 9 ప్రో', 'పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్', 'పిక్సెల్ 9 ప్రో XL' మోడల్స్‌ను తీసుకొచ్చింది. వీటితో ఏడేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లను అందిస్తామని కంపెనీ తెలింపింది.
ఫీచర్లు: కంపెనీ ఈ సిరీస్‌ను అదిరే ఫీచర్లతో తీసుకొచ్చింది. వీటిలో టెన్సర్ G4 ప్రాసెసర్, సెక్యూరిటీ కోసం Titan M2 చిప్‌సెట్, పవర్ఫుల్ జెమిని AI, జెమిని నానో మల్టీ-మోడల్, శాటిలైట్ SOS వంటి ఫీచర్లను అందించింది.
గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫీచర్లు:
- డిస్‌ప్లే: 6.3-అంగుళాల LTOP OLED
- బ్యాటరీ: 4,700mAh
- సెక్యూరిటీ చిప్‌సెట్: టైటాన్ M2
- రియర్ కెమెరా: 50MP
- అల్ట్రావైడ్ కెమెరా: 48MP
- ఫ్రంట్ కెమెరా: 42MP
- స్పెషాలిటీ: డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ
- ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్
- ధర: ప్రారంభ ధర రూ. 79,999
2. iPhone 16 Series: యాపిల్ తన మెగా ఈవెంట్‌లో 9 సెప్టెంబర్ 2024న ప్రపంచవ్యాప్తంగా ఈ సరికొత్త ఐఫోన్ 16 సిరీస్‌ను పరిచయం చేసింది. ఈ సిరీస్‌లో కంపెనీ 4 ఫోన్‌లను విడుదల చేసింది. వీటిలో 'ఐఫోన్ 16 ప్లస్'ను 6.7 అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్ప్లేతో తీసుకొచ్చారు. వెనకవైపు 48 MP వైడ్ యాంగిల్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ఇందులో 12MP ఫ్రంట్ కెమెరా అమర్చారు. కెమెరా కంట్రోల్ బటన్‌తో ఫొటోలు, వీడియోలను చాలా సులభంగా క్లిక్ చేయడానికి ఈ ఐఫోన్లో అధునాతన ఫీచర్ ఉంది.
ఐఫోన్ 16 ఫీచర్లు: కంపెనీ 'ఐఫోన్ 16'లో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR OLED డిస్‌ప్లేను అందించింది. ఈ ఫోన్‌లో A18 ప్రాసెసర్ ఉంది. ఈ చిప్‌సెట్ A16 బయోనిక్ కంటే 30 శాతం వేగవంతంగా పనిచేస్తుందని యాపిల్ పేర్కొంది. iOS 18తో ఈ కొత్త మోడల్ ఐఫోన్లు AI ఫీచర్లతో Apple ఇంటిలిజెన్స్‌ను కలిగి ఉన్నాయి. కాగా ప్రస్తుతం కంపెనీ అన్ని ఐఫోన్లకు iOS 18.2కి అప్‌డేట్ అందించింది.
ఐఫోన్ 16 సిరీస్ ఫీచర్లు:
- 'యాపిల్ ఐఫోన్ 16' సిరీస్‌లో అనేక కొత్త ఫీచర్లను అందించారు. ఈ కొత్త సిరీస్ ఫోన్లను ఏరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియంతో రూపొందించారు. ఇది గ్లాస్ బ్యాక్ ఫోన్ల కంటే రెండు రెట్లు ఎక్కువ డ్యూరబిలిటీని కలిగి ఉంటుందని యాపిల్ పేర్కొంది.
- 'ఐఫోన్ 16' డిస్‌ప్లే పొడవు 6.1 అంగుళాలు. దీన్ని వెనిలా వేరియంట్‌తో డిజైన్ చేశారు. ఈ ఐఫోన్ iOS 18తో పని చేస్తుంది. దీని బ్రైట్నెస్ను 2000 నిట్స్ వరకు పెంచొచ్చు.
- 'ఐఫోన్ 16 ప్లస్' డిస్‌ప్లే పొడవు 6.7 అంగుళాలు. వెనకవైపు 48MP వైడ్ యాంగిల్ కెమెరా, 12MP అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ఇందులో 12MP ఫ్రంట్ కెమెరా అమర్చారు. దీనిలోని కెమెరా కంట్రోల్ బటన్‌తో ఫొటోలు, వీడియోలను చాలా సులభంగా తీయడానికి అధునాతన ఫీచర్ ఉంది.
- ధర వివరాలు: 'ఐఫోన్ 16' సిరీస్ ప్రారంభ ధర రూ.79,900. కంపెనెనీ ఐఫోన్ 16లో 'AAA గేమ్స్' ప్లే ఎబిలిటీని కూడా అందిస్తుంది. ఇంతకు ముందు ఈ ఫీచర్ ప్రో మోడల్స్‌లో మాత్రమే అందుబాటులో ఉండేది.
3. Samsung Galaxy Models: AI ఫీచర్లతో ఉన్న అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌లో శాంసంగ్ గెలాక్సీ ఒకటి. 'శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా', 'శాంసంగ్ గెలాక్సీ S24 ప్లస్', 'శాంసంగ్ గెలాక్సీ S24 5G' మొబైల్స్‌ను కంపెనీ అదిరే ఏఐ ఫీచర్లతో తీసుకొచ్చింది. ఇందులో సర్కిల్ టు సెర్చ్, లైవ్ ట్రాన్స్‌లేట్, నోట్ అసిస్ట్, జెనరేటివ్ ఎడిట్, చాట్ అసిస్ట్, సూపర్ HDR, ఫోటో అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
గూగుల్ భాగస్వామ్యంలో అభివృద్ధి చేసిన 'సర్కిల్ టు సెర్చ్' ఫీచర్‌ను గూగుల్ తన డివైజ్‌లలో ప్రారంభించే ముందు 'గెలాక్సీ ఎస్ 24' సిరీస్‌లో తీసుకొచ్చారు. ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసేందుకు హోమ్ బటన్‌పై లాంగ్ ప్రెస్ చేయాలి. అప్పుడు ఈ ఫీచర్ ఫోన్ స్క్రీన్‌పై కన్పిస్తుంది. అవసరమైన సమాచారాన్ని అడిగేందుకు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇది వెంటనే మనకు రిజల్ట్ అందిస్తుంది. ఈ ఫీచర్‌ను ఏదైనా యాప్ లేదా వెబ్‌సైట్‌కు సెట్ చేయొచ్చు.
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా ఫీచర్లు:
- డిస్‌ప్లే: 6.78 అంగుళాల డైనమిక్ LTPO AMOLED
- చిప్‌సెట్: స్నాప్‌డ్రాగన్ 8 Gen 3
- బ్యాటరీ: 5000mAh
- RAM 12GB/ 1TB స్టోరేజీ
- ఛార్జింగ్: 45W
- ఫ్రంట్ కెమెరా: 12MP
- వెనక కెమెరా: 200MP+50MP+12MP
- OS: ఆండ్రాయిడ్ 14
- ధర: రూ.96,900 నుంచి ప్రారంభం
4. Xiaomi AI Smartphones: AI ఫీచర్లతో మార్కెట్లో అందుబాటులో ఉన్న స్మార్ట్ఫోన్ల కంపెనీల్లో షావోమీ కూడా ఒకటి. షావోమీ 12 ప్రో, షావోమీ 13 ప్రో, షావోమీ 14, షావోమీ 14 అల్ట్రా మోడల్ మొబైల్స్ అనేక AI ఫీచర్లను కలిగి ఉన్నాయి.
ఇతర ఫీచర్లు:
- డిస్‌ప్లే: 6.73-అంగుళాల డైనమిక్ LTPO AMOLED
- ఫ్రంట్ కెమెరా: 32MP
- చిప్‌సెట్: స్నాప్‌డ్రాగన్ 8 Gen 3
- బ్యాటరీ: 5000mAh
- RAM+స్టోరేజ్: 16GB/ 1TB
- ఛార్జింగ్: 90W
- వెనక కెమెరా: 50MP+50MP+50MP+50MP
- OS: ఆండ్రాయిడ్ 14
- ధర: రూ.40,999 నుంచి ప్రారంభం
5. Motorola Razr 50 Ultra: AI ఫీచర్లను 'మోటరోలా Razr 50 అల్ట్రా' స్మార్ట్‌ఫోన్లలో కూడా చూడొచ్చు. వీటిలో మ్యాజిక్ కాన్వాస్, గూగుల్ జెమిని, మ్యాజిక్ ఎడిటర్, మ్యాజిక్ ఎరేజర్, ఫొటో ఎనేబులర్, AI యాక్షన్ షాట్, AI అడాప్టివ్ స్టెబిలైజేషన్, ఇంటెలిజెంట్ ఆటో ఫోకస్ ట్రాకింగ్, AI ఫోటో ఎన్‌హాన్స్‌మెంట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇతర ఫీచర్లు:
- డిస్‌ప్లే: 6.9 అంగుళాల P-OLED
- ఫ్రంట్ కెమెరా: 32MP
- చిప్‌సెట్: స్నాప్‌డ్రాగన్ 8s Gen 3
- బ్యాటరీ: 4000mAh
- RAM+స్టోరేజ్: 12GB/ 512GB
- ఛార్జింగ్: 45W
- వెనక కెమెరా: 50MP+50MP
- OS: ఆండ్రాయిడ్ 14 ఆధారంగా హలో UI
- ధర: రూ.54,999 నుంచి ప్రారంభం
5. Honor 200 Pro: హానర్ 200 ప్రో Review)లో AI-పవర్డ్ ఫొటో enhancement , తక్కువ కాంతిలో కూడా ఏఐ సహాయంతో మెరుగైన పిక్చర్ క్వాలిటీని అందించే నైట్ పోర్ట్రెయిట్ మోడ్ వంటి మీడియా ఎడిటింగ్ టూల్స్ ఉన్నాయి. వీటితోపాటు ఇన్‌స్టంట్ మూవీ షార్ట్ వీడియో ఫీచర్, మ్యాజిక్ ఎరేజర్ 8.0, మ్యాజిక్ ఎనీవేర్ డోర్, మ్యాజిక్ క్యాప్సూల్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
ఇతర ఫీచర్లు:
- డిస్‌ప్లే: 6.78-అంగుళాల AMOLED
- ఫ్రంట్ కెమెరా: 50MP
- చిప్‌సెట్: స్నాప్‌డ్రాగన్ 8s Gen 3
- బ్యాటరీ: 5200mAh
- RAM+స్టోరేజ్: 12GB/ 512GB
- ఛార్జింగ్: 100W
- వెనక కెమెరా: 200MP+50MP+12MP
- OS: ఆండ్రాయిడ్ 14
- ధర: రూ. 47,999 నుంచి ప్రారంభం
6000mAh బ్యాటరీ ప్యాక్‌తో 5G ఫోన్- నీటిలో పడినా ఏం కాదంట.. ధర కూడా రూ.15వేల లోపే!
మెర్సిడెస్ నుంచి లగ్జరీ 5-సీటర్ బెంజ్ - దేశంలోనే ఏ EVకి లేనంత అతిపెద్ద సెల్ కెపాసిటీతో..!
గూగుల్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్- ఇది అలాంటిలాంటిది కాదుగా.. అంచనాలకు మించి!