ETV Bharat / technology

ఒప్పోనా మజాకా- కిర్రాక్ ఫీచర్లతో 'ఫైండ్ X8' సిరీస్- ధర ఎంతో తెలిస్తే గుండె గుభేలే..! - OPPO FIND X8 SERIES

ప్రీమియం సెంగ్మెంట్లోకి ఒప్పో- 'ఫైండ్ X8', 'ఫైండ్ X8 ప్రో' మొబైల్స్ ధర, ఫీచర్లు ఇవే..!

Oppo Find X8 Series
Oppo Find X8 Series (Oppo India)
author img

By ETV Bharat Tech Team

Published : Nov 21, 2024, 3:48 PM IST

Oppo Find X8 Series: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ఒప్పో ఫైండ్ X8' సిరీస్​ ఎట్టకేలకూ ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చాయి. బడ్జెట్ ధరలో స్మార్ట్​ఫోన్లను తీసుకొచ్చే ఒప్పో.. ఈ సిరీస్​తో ప్రీమియం సెగ్మెంట్​లోకి అడుగుపెట్టింది. ఈ సిరీస్​లో 'ఒప్పో ఫైండ్​ X8', 'ఫైండ్ X8 ప్రో' మొబైల్స్​ను లాంఛ్ చేసింది. కంపెనీ ఈ స్మార్ట్​ఫోన్లను MediaTek డైమెన్షన్ 9400 చిప్‌సెట్‌తో తీసుకొచ్చింది. ఈ రెండు మొబైల్స్​ కూడా నాలుగు 50-మెగాపిక్సెల్ Hasselblad- ట్యూన్డ్ కెమెరా సెటప్​తో వచ్చాయి. మరెందుకు ఆలస్యం వీటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం రండి.

ఒప్పో ఫైండ్ X8:

  • ఇండియన్ మార్కెట్లో 'ఒప్పో ఫైండ్ X8' 12GB RAM, 256GB స్టోరేజ్‌తో బేస్ మోడల్‌ ధర రూ. 69,999 నుంచి ప్రారంభమవుతుంది.
  • దీని 16GB + 512GB మోడల్ ధర రూ.79,999.

'ఫైండ్ X8' కలర్ ఆప్షన్స్:

  • స్పేస్ బ్లాక్
  • స్టార్ గ్రే

ఒప్పో ఫైండ్ X8 ప్రో:

  • ఒప్పో ఫైండ్ X8 ప్రో మొబైల్​ను కంపెనీ కేవలం ఒక RAM, స్టోరేజ్ ఆప్షన్​లో తీసుకొచ్చింది.
  • దీని ధర మార్కెట్లో రూ.99,999.

'ఫైండ్ X8 ప్రో' కలర్ ఆప్షన్స్:

  • పెర్ల్ వైట్
  • స్పేస్ బ్లాక్

కస్టమర్లు 'ఒప్పో ఫైండ్​ X8', 'ఫైండ్ X8 ప్రో' మొబైల్స్​ను డిసెంబర్ 3 నుంచి ఒప్పో ఇ-స్టోర్, ఫ్లిప్​కార్ట్​తో పాటు దేశంలోని రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా కొనుగోలు చేయొచ్చు.

స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్లు:

  • 'ఫైండ్ X8', 'ఫైండ్ X8 ప్రో' మొబైల్స్​ రెండూ ఆండ్రాయిడ్ 15-బేస్డ్​ ColorOS 15పై ఆధారపడి పనిచేస్తాయి. ఈ రెండు ఫోన్లూ డ్యూయల్-సిమ్ (నానో + నానో) కనెక్టివిటీకి సపోర్ట్ చేస్తాయి.
  • 'ఫైండ్ X8' మోడల్ 6.59-అంగుళాల (1,256x2,760 పిక్సెల్స్​) LTPO AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 4,500nits పీక్ బ్రైట్​నెస్, 460ppi పిక్సెల్ డెన్సిటీతో వస్తుంది.
  • 'ఫైండ్ X8 ప్రో' మోడల్ 450ppi పిక్సెల్ డెన్సిటీతో 6.78-అంగుళాల (1,264x2,780 పిక్సెల్స్) LTPO AMOLED స్క్రీన్‌ను కలిగి ఉంది. దీని రిఫ్రెష్ రేట్, పీక్ బ్రైట్‌నెస్ లెవెల్స్ స్టాండర్డ్ మోడల్​లో సమానంగా ఉంటాయి.
  • TSMC 3nm ప్రాసెస్ టెక్నాలజీతో బిల్డ్ చేసిన MediaTek ఆక్టా-కోర్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్‌తో భారతదేశంలో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్స్​ ఇవి. ఈ రెండు మోడల్స్​లో 16GB వరకు LPDDR5X RAM, 512GB వరకు UFS 4.0 ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఆప్షన్ ఉంది.

ఒప్పో ఫైండ్ X8 కెమెరా సెటప్: 'ఒప్పో ఫైండ్ X8' ఫోన్​లో సోనీ LTY-700 సెన్సార్ (f/1.8), 120-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూ (f/2.0)తో 50-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా, 50-మెగాపిక్సెల్ సోనీతో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. అంతేకాక 3x ఆప్టికల్ జూమ్​, f/2.6తో 50-మెగాపిక్సెల్ సోనీ LYT-600 పెరిస్కోప్​ టెలిఫొటో కెమెరా ఉంది. వీటితోపాటు సెల్ఫీల కోసం ఇది 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉది. ఇది ఒప్పో ఫైండ్​ X8 ప్రో మోడల్​లో కూడా అందుబాటులో ఉంది.

ఒప్పో ఫైండ్ X8 ప్రో కెమెరా సెటప్: ఒప్పో ఫైండ్ X8 ప్రో మొబైల్​లో LYT-808 సెన్సార్ (f/1.6)తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 120-డిగ్రీ ఫీల్డ్-ఆఫ్-వ్యూ (f/2.0)తో 50- మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. అంతేకాక ఇందులో 3x ఆప్టికల్ జూమ్​ (f/2.6)తో 50-మెగాపికెల్ సోనీ LYT-600 పెరీస్కోప్ టెలీఫొటో కెమెరాను అమర్చారు. వీటితో పాటు ఈ మొబైల్​లో 6x ఆప్టికల్ జూమ్ (f/4.3)తో​ 50-మెగాపిక్సెల్ సోనీ IMX858 పెరిస్కోప్ టెలీఫొటో కెమెరా కూడా ఉంది.

ఒప్పో ఫైండ్​ X8 సిరీస్ బ్యాటరీ:

  • ఒప్పో కంపెనీ 'ఫైండ్ X8' మొబైల్​లో 5,630mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీని అమర్చింది. ఇది 80W (SuperVOOC), 50W (AirVOOC) ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
  • ఇక 'ఫైండ్ X8 ప్రో' ఫోన్​లో 5,910mAh పెద్ద బ్యాటరీ ఉంది. ఇది కూడా 'ఫైండ్ X8' మాదిరిగానే సేమ్ ఛార్జింగ్ స్పీడ్​కు సపోర్ట్​ చేస్తుంది.
  • అంతేకాక ఈ రెండు ఫోన్లు 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తాయి.
  • ఈ సిరీస్​లో ట్రై-స్టేట్ అలెర్ట్ స్లైడర్​ను అమర్చారు.
  • ఈ రెండు ఫోన్లూ IP68/IP69 రేటింగ్​తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీతో వస్తున్నాయి.

'అంతర్గతంగా వివాదాస్పద విధానాలు పాటించిన గూగుల్- మెసేజ్​ల​ను మాయం చేయడమే వ్యూహం'

వావ్.. ఏం క్రియేటివిటీ రా సామీ..!- జాగ్వార్ కొత్త లోగో, బ్రాండ్​ ఐడెంటిటీ డిజైన్ చూశారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.