2024 Hero Glamour 125 Launched: దేశీయ బైక్స్ తయారీ సంస్థ మోటోకార్ప్ తన హీరో గ్లామర్ 125 బైక్ కొత్త వెర్షన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది డ్రమ్, డిస్క్ బ్రేక్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. డ్రమ్ బ్రేక్ వేరియంట్లో దీని ధర రూ. 83,598 ఉండగా.. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వేరియంట్లో దీని ధర రూ. 87,598.(ఎక్స్-షోరూమ్)గా ఉంది. బ్లాక్ మెటాలిక్ సిల్వర్ పెయింట్ స్కీమ్‌తో డిజైన్ చేసిన ఈ బైక్ డిఫరెంట్ రంగుల్లో మార్కెట్లో అందుబాటులో ఉంది. అయితే ఈ కొత్త వెర్షన్ బైక్‌ను కొనుగోలు చేసేందుకు కస్టమర్లు రూ.1,000 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
ఈ సరికొత్త వెర్షన్ బైక్ డిజైన్, ఎక్విప్మెంట్ ఇంతకు ముందు మార్కెట్లో రిలీజైన హీరో గ్లామర్ మాదిరిగానే ఉంది. అయితే ప్రస్తుతం చెకర్డ్ బాడీ గ్రాఫిక్స్‌తో బైక్‌కు కొంగొత్త రంగులను అద్దారు. ఇతర మోటార్ సైకిల్స్‌లో మాదిరిగానే నలుపు, బూడిద రంగు యాక్సెంట్ల్లో కొత్త వెర్షన్‌ను రూపొందించారు.
ఈ వెర్షన్లో కలర్ ఆప్షన్స్:
- క్యాండీ బ్లాజింగ్ రెడ్
- బ్లాక్ స్పోర్ట్స్ రెడ్
- బ్లాక్ టెక్నో బ్లూ
2024 హీరో గ్లామర్ 125 బైక్ ఫీచర్స్:
- LED హెడ్‌ల్యాంప్ హజార్డ్ లైట్
- స్టార్ట్/స్టాప్ విత్ i3S సిస్టమ్
- LED టెయిల్ లైట్
- డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్
- USB ఛార్జింగ్ పోర్ట్
- స్మార్ట్ ఫోన్ ఛార్జీంగ్ పోర్ట్
- హజార్డ్ లైట్లు
2024 హీరో గ్లామర్ 125 బైక్ ఇంజిన్:
- 124.7 సీసీ, సింగిల్ సిలిండర్, ఎయిర్- కూల్డ్ ఇంజిన్
- 10.72 బీహెచ్పీ పవర్ ఎట్ 7,500ఆర్పీఎమ్
- 10.6 ఎన్ఎమ్ టార్క్ ఎట్ 6,000ఆర్పీఎమ్
- 5-స్పీడ్ గేర్‌బాక్స్
2024 హీరో గ్లామర్ 125 బైక్ బ్రేక్స్ అండ్ సస్పెన్షన్:
- ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు
- వెనుకవైపు ట్విన్ షాక్ అబ్జార్బర్స్
- డిస్క్, డ్రమ్ బ్రేక్ వేరియంట్లలో లభ్యం
మార్కెట్లో దీనికి పోటీగా ఉన్న బైక్స్: 2024 హీరో గ్లామర్ హోండా షైన్ 125, బజాజ్ పల్సర్ 125, TVS రైడర్ 125, బజాజ్ ఫ్రీడమ్ 125 మోటార్ సైకిళ్లు ఈ 2024 హీరో గ్లామర్ 125 బైక్‌కు మార్కెట్లో పోటీగా ఉన్నాయి.