Mobile Number Portability Rules : పెరుగుతున్న ఆన్లైన్ స్కామ్‌లను అరికట్టేందుకు టెలికాం రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) మొబైల్ నంబర్ పోర్టబిలిటీ రూల్స్‌ను మరింత కఠినతరం చేసింది. దీని ప్రకారం, కొత్తగా సిమ్ కార్డ్ తీసుకున్నవాళ్లు, తమ నంబర్‌ను వేరే టెలికాం ఆపరేటర్‌కు మార్చాలని అనుకునేవాళ్లు, కనీసం 7 రోజుల పాటు వేచి చూడాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధన జులై 1 నుంచి అమల్లోకి వస్తుందని ట్రాయ్ స్పష్టం చేసింది.
వరుసగా తొమ్మిదో సారి!
ట్రాయ్ మొదటిసారిగా 2009లో మొబైల్ నంబర్ పోర్టబిలిటీ (MNP) నిబంధనలకు తీసుకువచ్చింది. తరువాత ఆ రూల్స్‌ను పలుమార్లు సవరించింది. తాజా తొమ్మిదోసారి ఎమ్ఎన్పీ రూల్స్‌ను ఛేంజ్ చేసింది.
ఈ కొత్త నిబంధనల ప్రకారం, మీ సిమ్ కార్డు పోయినా, డ్యామేజ్ అయినా లేదా దానిని అప్‌గ్రేడ్ చేయాలని అనుకున్నా, సదరు మొబైల్ నంబర్ పోర్టబిలిటీ కోసం అప్లై చేసుకోవచ్చు. కానీ మీరు కొత్త సర్వీస్ ప్రొవైడర్‌కు మారేందుకు కనీసం ఒక వారం రోజుల పాటు వేచిచూడాల్సి ఉంటుంది.
మన పాత సిమ్ కార్డ్ నంబర్ పోకుండా, మరొక మంచి నెట్‌వర్క్‌కు మారడానికి ఈ పోర్టబిలిటీ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. సాధారణంగా ఇలా ప్రతి మూడు నెలలకు ఒకసారి మీకు నచ్చిన నెట్‌వర్క్‌కు మీ మొబైల్ నంబర్‌ను పోర్ట్ చేసుకోవచ్చు.
సైబర్ మోసాలను అరికట్టేందుకే!
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా సిమ్ స్వాప్ విధానం ద్వారా సాధారణ ప్రజల ఫోన్ నంబర్లను సైబర్ నేరగాళ్లు హైజాక్ చేస్తున్నారు. వాటిని తప్పుడు కార్యకలాపాలకు వాడుతున్నారు. అందుకే ఈ ఆన్లైన్ ఫ్రాడ్‌స్టర్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రాయ్ ఈ మొబైల్ పోర్టబిలిటీ రూల్స్‌ను కఠినతరం చేసింది. సిమ్ పోర్టబిలిటీకి 7 రోజుల వెయిటింగ్ పీరియడ్‌ను తప్పనిసరి చేసింది. దీని వల్ల యూజర్లకు తెలియకుండా, వారి నంబర్లను స్కామర్లు వేరే నెట్‌వర్క్‌లకు బదిలీ చేయలేరు. అంటే స్కామర్ల బారి నుంచి యూజర్లు సురక్షితంగా ఉండేందుకు ఈ నయా రూల్స్ ఉపయోగపడతాయని ట్రాయ్ భావిస్తోంది.
ఇకపై వాట్సాప్ పేమెంట్స్ మరింత ఈజీ - చాట్ లిస్ట్‌లోనే QR కోడ్!
మంచి టూ-వీలర్ కొనాలా? రూ.1 లక్ష బడ్జెట్లోని టాప్-3 అప్‌కమింగ్ బైక్స్ & స్కూటీస్ ఇవే!