Microsoft Outage Reason : మైక్రోసాఫ్ట్ విండోస్‌లో సాంకేతిక సమస్య తలెత్తి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది యూజర్లకు బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ దర్శనమిస్తోంది. ల్యాప్‌ట్యాప్, పీసీ స్క్రీన్‌లపై ఎర్రర్ కనిపించి వెంటనే సిస్టమ్ షట్‌డౌన్ లేదా రీస్టార్ట్ అవుతోంది. ముఖ్యంగా విండోస్ 10, 11 ఆపరేటింగ్ సిస్టమ్‍తో పాటు మైక్రోసాఫ్ట్ 365 యాప్స్, సర్వీసుల్లో ఈ సమస్య కనిపిస్తోంది. ఈ సమస్యపై యూజర్లు ఎక్స్ వేదికగా సమస్యను తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు. భారత్, అమెరికా, జర్మనీ, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సహా అనేక దేశాల్లో ఈ సమస్యతో అనేక రంగాల సంస్థలు సతమతం అవుతున్నాయి.
President & CEO CrowdStrike George Kurtz tweets, " crowdstrike is actively working with customers impacted by a defect found in a single content update for windows hosts. mac and linux hosts are not impacted. this is not a security incident or cyberattack. the issue has been… pic.twitter.com/mcUZ6MAO0l
— ANI (@ANI) July 19, 2024
అందువల్లే మైక్రోసాఫ్ట్ సర్వర్ క్రాష్
ఇటీవల చేపట్టిన క్రౌడ్ స్ట్రయిక్ అప్‌డేట్ మూలంగానే ఈ సమస్య తలెత్తినట్లు మైక్రోసాఫ్ట్ ధ్రువీకరించింది. క్రౌడ్ స్ట్రయిక్ అనేది ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ. విండోస్‌తో పాటు వివిధ సంస్థలకు అడ్వాన్స్‌డ్ సెక్యూరిటీని అందిస్తుంటుంది. తాజాగా విండోస్ సిస్టమ్స్‌లో నెలకొన్న బ్లూ స్క్రీన్ ఎర్రర్‌కు ఆ సర్వీసు అప్‌డేటే కారణమని క్రౌడ్ స్ట్రయిక్ తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు తమ ఇంజినీర్లు పనిచేస్తున్నారని, అప్‍డేట్‍ను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించింది. సమస్య పరిష్కారానికి డీబగ్ రూపొందించినట్లు పేర్కొంది. దీని వెనుక ఎలాంటి సైబర్ దాడి గానీ, భద్రతాపరమైన లోపం గానీ లేదని క్రౌడ్‌స్ట్రయిక్ సీఈఓ జార్జ్ కర్ట్జ్ తెలిపారు.
అనేక సేవలకు తీవ్ర అంతరాయం
విండోస్‌లో తలెత్తిన సమస్యతో ప్రభుత్వ సేవలతో పాటు, బ్యాంకులు, ఆరోగ్య, అత్యవసర, బ్రాడ్‌కాస్టింగ్, ఐటీ, రైల్వే, విమానాశ్రయ తదితర సేవలకు అంతరాయం ఏర్పడింది. వాషింగ్టన్‌లో మెట్రోరైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అనేక దేశాల్లో విమాన సేవలు ఆలస్యం, క్యాన్సిలేషన్లకు గురవుతున్నాయి. అమెరికాలో ఫ్రాంటియర్ ఎయిర్‌లైన్స్ సంస్థ కొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ముంబయి, దిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ ఎయిర్‌పోర్టుల్లో కొన్ని ఆన్‌లైన్ సర్వీసులు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని ఎయిర్‌లైన్స్ సంస్థలు ప్రకటించాయి. సర్వీస్ ప్రొవైడర్‌తో సాంకేతిక సమస్య కారణంగా బుకింగ్, చెకిన్ వంటి ఆన్‌లైన్ సేవలు ప్రభావితం అవుతున్నందున మాన్యువల్ చెకింగ్స్ చేస్తున్నట్లు విస్తారా, స్పైస్‌జెట్, ఇండిగో తదితర సంస్థలు తెలిపాయి. ప్రయాణికులు విమానాశ్రయాలకు తొందరగా చేరుకోవాలని సూచించాయి. విమానాల రాకపోకల అంతరాయం నేపథ్యంలో ఎయిర్‌పోర్టుల్లో ప్రయాణికులు పడిగాపులు గాస్తున్నారు. తమకు సరైన మార్గదర్శకాలు ఇవ్వట్లేదని ఎయిర్‌పోర్టు, విమానాశ్రయ సంస్థలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్ సన్నాహకాలపైనా బ్లూస్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ ప్రభావం పడింది.
Due to a global Microsoft cloud outage, Indian airports are facing unexpected delays.
— ANI (@ANI) July 19, 2024
Minister of Civil Aviation, Rammohan Naidu says, " i have directed airport authorities and airlines to be compassionate and provide extra seating, water, and food for passengers affected by… pic.twitter.com/yxksoBbgGq
Microsoft faces global outage: Indian Computer Emergency Response Team (CERT-In) issues advisory; says, " it has been reported that windows hosts related to crowd strike agent falcon sensor, are facing outages and getting crashed due to recent update received in the product. the… pic.twitter.com/jbNTusisVI
— ANI (@ANI) July 19, 2024
మైక్రోసాఫ్ట్‌తో సంప్రదింపులు : కేంద్ర మంత్రి
మరోవైపు పలు దేశాల్లో స్టాక్ ఎక్స్ఛేంజీలు సైతం అంతరాయాలు ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. అయితే ఈ ప్రభావం తమపై పడలేదని జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజ్ NSE, బాంబే స్టాక్ ఎక్చేంజ్‌లు తెలిపాయి. భారత్‌లోని ప్రముఖ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తమ వ్యవస్థలు ప్రభావితం కాలేదని ప్రకటించింది. అంతరాయంపై కేంద్రం, మైక్రోసాఫ్ట్‌తో సంప్రదింపులు జరుపుతోందని ఐటీశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఎన్‌ఐసీ వ్యవస్థ ప్రభావితం కాలేదన్నారు. క్రౌడ్‌స్ట్రైక్ అప్‌డేట్ వల్లే ఈ సమస్య తలెత్తినట్లు కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ప్రకటించింది. అత్యంత తీవ్రమైన సమస్యగా దీన్ని అభివర్ణించింది.
Electronics & Information Technology Minister, Ashwini Vaishnaw tweets, " meity is in touch with microsoft and its associates regarding the global outage. the reason for this outage has been identified and updates have been released to resolve the issue. cert is issuing a… pic.twitter.com/qvN3YDDwGU
— ANI (@ANI) July 19, 2024