ETV Bharat / technology

ఇన్‌స్టా రీల్స్‌ నేరుగా థ్రెడ్స్​లోకి- సరికొత్త ఫీచర్​పై మెటా కసరత్తు - META TESTING NEW FEATURE

థ్రెడ్స్​ యూజర్స్​కు గుడ్​న్యూస్- సరికొత్త ఫీచర్​ తీసుకొచ్చే పనిలో మెటా

Meta Testing New Feature
Meta Testing New Feature (Getty Images)
author img

By ETV Bharat Tech Team

Published : Oct 11, 2024, 12:11 PM IST

Meta Testing New Feature: సోషల్ మీడియా దిగ్గజం మెటా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను నేరుగా థ్రెడ్స్​లో పోస్ట్ చేసేందుకు అనుమతించే ఓ సరికొత్త ఫీచర్​ను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది. మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ X (గతంలో ట్విటర్)కు పోటీగా మెటా ఏడాది క్రితం థ్రెడ్స్​ అనే సరికొత్త సోషల్ మీడియా యాప్​ను ప్రారంభించింది. మెటా గతేడాది తీసుకొచ్చిన తన మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ థ్రెడ్స్ ఎవరూ ఊహించనంతగా యూజర్స్​ను సొంత చేసుకుని ప్రభంజనాన్ని సృష్టిస్తోంది.

ఈ యాప్​కు పెరుగుతున్న ప్రజాదరణ దృష్ట్యా వినియోగదారులకు మరిన్ని సేవలను అందించేందుకు మెటా కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను నేరుగా థ్రెడ్స్​లో పోస్ట్ చేసేందుకు వీలుగా ఓ సరికొత్త ఫీచర్​ను తీసుకొచ్చేందుకు మెటా సిద్ధమైంది. ఈ ఫీచర్ మెటా దాని యాప్స్​లో కంటెంట్ షేరింగ్​ను పెంచేందుకు క్రాస్-పోస్టింగ్ ఫంక్షనాలిటీని ఎనేబుల్ చేసే ప్లాన్‌లో భాగం కావచ్చు.

థ్రెడ్స్​లో క్రాస్-పోస్టింగ్ ఫీచర్: సుప్రసిద్ధ డెవలపర్ అలెశాండ్రో పలుజ్జీ (@alex193a) థ్రెడ్స్ కొత్త ఫీచర్​ను తీసుకొచ్చేందుకు టెస్ట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఫీచర్ వినియోగదారులకు ఇన్​స్టాగ్రామ్ రీల్స్, పోస్ట్​లను నేరుగా షేర్ చేసేందుకు వీలు కల్పిస్తుందని తెలిపారు. ఈ మేరకు ఆయన కొత్త ఫీచర్​పై ఓ స్క్రీన్ షాట్ షేర్ చేశారు.

పలుజ్జీ షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం.. థ్రెడ్స్​లోని డ్రాప్-డౌన్ మెనులో ఇప్పటికే ఉన్న GIFలు, వాయిస్ అండ్ పోల్స్​తో పాటు ఈ కొత్త ఇన్​స్టాగ్రామ్ ఆప్షన్ ఉంటుంది. థ్రెడ్స్​లో కంపోజ్ బాక్స్‌లోని ఈ కొత్త ఇన్​స్టాగ్రామ్​ బటన్​ను ట్యాప్ చేస్తే ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లు, రీల్స్​తో కూడిన గ్రిడ్ కన్పిస్తుంది. యూజర్స్ థ్రెడ్స్​లో ఏ రీల్స్, పోస్ట్​లను షేర్ చేయాలని అనుకుంటున్నారో అందులో ఎంచుకోవచ్చు. మెటా ఈ సరికొత్త ఫీచర్​ను పరీక్షిస్తున్నట్లు టెక్‌క్రంచ్‌ కన్ఫర్మ్ చేసింది.

ప్రస్తుతం చాలామంది యూజర్స్ తమ కంటెంట్ విజిబిలిటీ, ఫాలోవర్స్​ను పెంచుకునేందుకు ఇన్​స్టాగ్రామ్​ పోస్ట్​లను, రీల్స్​ను థ్రెడ్స్​లో పోస్ట్ చేస్తున్నారు. అలాంటి వినియోగదారులకు ఈ సరికొత్త బటన్​ సహాయపడుతుంది. ముఖ్యంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ నుంచి థ్రెడ్స్​లో క్రాస్-పోస్టింగ్​ను ప్రోత్సహించేందుకు మెటా గత సంవత్సరం నుంచి కసరత్తు చేస్తోంది. ఇది డిఫాల్ట్‌గా ఇన్​స్టాగ్రామ్, ఫేస్​బుక్​లో థ్రెడ్స్​ పోస్ట్​లను ఆటోమెటిక్​గా డిస్​ప్లే చేస్తుంది. యూజర్స్ ఇన్​స్టాగ్రామ్​ నుంచి థ్రెడ్స్​లోకి ఇమేజెస్​ను క్రాస్​- పోస్ట్​ చేసేందుకు ఈ ఫీచర్ అనుమతిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్​ టెస్టింగ్ దశలో ఉంది.

ఒప్పో దీపావళి సేల్​లో ₹10లక్షలు గెలుచుకొనే ఛాన్స్‌- ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు భయ్యా..!

డిజిటల్ పేమెంట్స్​పై ఆర్బీఐ కీలక నిర్ణయం- యూపీఐ లైట్, వ్యాలెట్ పరిమితుల పెంపు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.