Mercedes Benz EQS 450: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ తన కొత్త ఎలక్ట్రిక్ SUVని లాంఛ్ చేసేందుకు రెడీ అయింది. 'మెర్సిడెస్ బెంజ్ EQS 450' పేరుతో దీన్ని రిలీజ్ చేయనుంది. దీనితోపాటు కంపెనీ 'మెర్సిడెస్-బెంజ్ G 580'ని కూడా రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇందులో కంపెనీ EQ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 9న కంపెనీ ఈ రెండు కార్లను మార్కెట్లోకి విడుదల చేయనుంది.
మెర్సిడెస్ బెంజ్ 'EQS 450' స్పెసిఫికేషన్‌లు: ఈ 'EQS 450' SUV అనేది కంపెనీ లైనప్‌లో రెండో వేరియంట్ (మేబ్యాక్ మినహా). ఇది 5-సీటర్ కాన్ఫిగరేషన్‌లో అందుబాటులో ఉంటుంది. 7-సీటర్ 'EQS 580 4మ్యాటిక్' SUVలో ఉపయోగించిన అదే 122kWh బ్యాటరీ ప్యాక్‌తోనే ఈ కారును కూడా తీసుకురానున్నారు.
'EQS 450 స్పెషాలిటీ: దీని స్పెషాలిటీ ఏంటంటే.. ఇది ఇప్పటివరకు దేశంలో ఏ ప్యాసింజర్ EVకి లేనంత అతిపెద్ద సెల్ కెపాసిటీతో వస్తుంది. ఈ కారును 200kW DC ఫాస్ట్ ఛార్జర్‌తో కేవలం 31 నిమిషాల్లో 10 నుంచి 80శాతం వరకు ఛార్జ్ చేయొచ్చు.
ఎక్స్టీరియర్: దీని ఎంట్రీ-లెవల్ EQS SUV కొంగొంత్త డిజైన్‌తో వస్తుంది. దీని ఫ్రంట్ బంపర్ లోవర్ పార్ట్ వరకూ బ్లాంక్డ్-ఆఫ్ గ్రిల్‌తో ఉంటుంది. దీని మొత్తం డైనమిక్ సిల్హౌట్ 'EQS 580'ని పోలి ఉంటుంది. అయితే ఇది రిఫ్రెష్డ్ 21-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో వస్తుంది.
ఇంటీరియర్: దీని ఇంటీరియర్ విషయానికి వస్తే.. దీని క్యాబిన్లో క్రాఫ్టెడ్ కవర్‌లతో సీట్లు స్టాండర్డ్‌గా వస్తాయి. ఇందులో ఎనర్జైజింగ్ ఎయిర్ కంట్రోల్ ప్లస్ వంటి ప్రత్యేక ఫీచర్లు ఉండనున్నాయి. ఈ కారులో 56-అంగుళాల హైపర్‌స్క్రీన్ సెటప్, 12.3-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రంట్ ప్యాసింజర్ స్క్రీన్, 17.7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ వంటి ఫీచర్లను అమర్చారు.
వీటితోపాటు ఇందులో ట్విన్ 11.6-అంగుళాల రియర్ ఎంటర్‌టైన్‌మెంట్ స్క్రీన్, 5-స్పీకర్ బర్మెస్టర్ ఆడియో సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, 5-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, సాఫ్ట్ క్లోజ్ డోర్స్, పడ్డిల్ ల్యాంప్స్, ఇల్యూమినేటెడ్ రన్నింగ్ బోర్డ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక భద్రతా ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో లెవల్-2 ADAS, 9 ఎయిర్‌బ్యాగ్‌లతో పాటు ఇతర ఫీచర్లను కూడా అందించనున్నట్లు తెలుస్తోంది.
ధర: ఈ మెర్సిడెస్ 'EQS 450 SUVని.. ఎక్స్ట్రా క్యాబిన్ స్పేస్ కోసం ఎదురుచూస్తున్న వినియోగదారుల కోసం డిజైన్ చేశారు. కంపెనీ దీని ధరను ఇంకా వెల్లడించలేదు. అయితే దీని ప్రైస్.. రూ. 1.59 కోట్ల EQE, రూ. 1.61 కోట్ల EQS SUV ధరల మధ్య ఉండొచ్చని అంచనా.
గూగుల్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్- ఇది అలాంటిలాంటిది కాదుగా.. అంచనాలకు మించి!