ETV Bharat / technology

స్టైలిష్ లుక్​లో మారుతి డిజైర్- ప్రీమియం ఫీచర్లతో బడ్జెట్ ధరలోనే లాంచ్!

మార్కెట్లోకి మారుతి కొత్త కారు- ఫీచర్లు చూస్తే వావ్ డిజైర్ అంటారంతే..!

Maruti Desire Sedan Launch
Maruti Desire Sedan Launch (Maruti Suzuki)
author img

By ETV Bharat Tech Team

Published : Nov 11, 2024, 3:45 PM IST

Updated : Nov 11, 2024, 3:51 PM IST

Maruti Suzuki Dzire: మారుతి సుజుకి ఎట్టకేలకు తన నాల్గో తరం మారుతి డిజైర్ సెడాన్‌ను భారత మార్కెట్‌కు పరిచయం చేసింది. కంపెనీ ఈ న్యూ జనరేషన్ మూరుతీ డిజైర్​ను పూర్తిగా కొత్త లుక్​లో డిజైన్ చేసింది. దీని ప్రీవియస్ మోడల్స్​తో పోలిస్తే ఇది మరింత అగ్రెసివ్ అండ్ స్పోరీగా ఉంటుంది. మరెందుకు ఆలస్యం ఈ కొత్త మారుతి డిజైర్ ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం రండి.

మారుతి డిజైర్: మారుతి డిజైర్ పొడవు 4 మీటర్ల కంటే తక్కువ ఉంటుంది. ఇది 3,995 mm పొడవు, 1,735 mm వెడల్పు, 1,525 mm ఎత్తు, 2,450 mm వీల్‌బేస్, 163 mm గ్రౌండ్ క్లియరెన్స్‌తో వస్తంది. దీని పెట్రోల్ వేరియంట్ 382 లీటర్ల బూట్ స్పేస్ కలిగి ఉంటుంది. దీని CNG ఆప్షన్​ అందుబాటులో ఉంటే బూట్ స్పేస్ తగ్గుతుంది. అయితే ప్రస్తుతం దీని గురించి ఎలాంటి సమాచారం లేదు.

డిజైన్: ఈ కారును LXI, VXI, ZXI, ZXI+ వంటి మొత్తం నాలుగు ట్రిమ్‌లలో తీసుకొచ్చారు. అంతేకాకుండా ఇది గాలంట్ రెడ్, ఆల్లరింగ్ బ్లూతో సహా మొత్తం 7 రంగులలో వస్తుంది. ఇది న్యూ జనరేషన్ మారుతి కారు స్విఫ్ట్​కి ఫూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇండియాలో సేల్ అయిన డిజైర్ ప్రీవియస్ మూడు జనరేషన్ కార్లతో పోలిస్తే దీని డిజైన్​లో చాలా ముఖ్యమైన మార్పులు కన్పించాయి. కొత్త మారుతి డిజైర్ డిజైన్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది హోండా అమేజ్​ను పోలి ఉంటుంది. కంపెనీ ఈ కొత్త మారుతి డిజైర్​ సెడాన్​ను దాని ప్రీవియస్ మోడల్ కంటే ఎక్కువ ప్రీమియం ఫీచర్లతో తీసుకొచ్చింది. దీని ఇంటీరియర్ లేటెస్ట్ జనరేషన్ స్విఫ్ట్​ మాదిరిగా ఉంటుంది.

Maruti Desire Sedan Launch Event
Maruti Desire Sedan Launch Event (Maruti Suzuki)

2024 మారుతి డిజైర్ ఇంటీరియర్: దీని ఇంటీరియర్ సరికొత్త స్విఫ్ట్‌ను పోలి ఉంటుంది. ఇందులో 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉంది. ఇది వైర్‌లెస్ యాపిల్ కార్​ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకి సపోర్ట్ చేస్తుంది. కారు లోపల మీరు ఆటో క్లైమేట్ కంట్రోల్, వెనుక AC వెంట్స్, వైర్‌లెస్ ఛార్జర్, 360-డిగ్రీ కెమెరా వంటివి ఉన్నాయి. అంతేకాక ఈ కొత్త కారులో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కూడా ఉంది.

పవర్‌ట్రెయిన్: ఈ కొత్త మారుతి సుజుకి డిజైర్ Z సిరీస్ నుంచి అదే 1.2-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్​తో వస్తుంది. ఇది లేటెస్ట్ స్విఫ్ట్ మోడల్‌లో కన్పిస్తుంది. దీని కొత్త ఇంజిన్ 80 బిహెచ్‌పి పవర్, 111.7 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్‌తో వస్తుంది. పెట్రోల్ + CNG వేరియంట్‌లో ఈ ఇంజన్ 68 bhp పవర్, 100 Nm వరకు టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

సేఫ్టీ ఫీచర్స్:

  • ఆరు ఎయిర్‌బ్యాగ్స్
  • ESC
  • అన్ని సీట్లకు రిమైండర్ 3-పాయింట్ సీట్ బెల్ట్‌లు
  • వెనుక ఔట్‌బోర్డ్ సీట్లకు ISOFIX మౌంట్స్
  • ఫ్రంట్ సీట్ బెల్ట్ ప్రిటెన్షనర్లు
  • లోడ్ లిమిటర్‌లు
  • ఈ కొత్త మారుతి డిజైర్ UN 127 పాదచారుల భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉంది.
  • ఇటీవల కొత్త మారుతి డిజైర్ గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది.

ధర: ఈ మారుతి డిజైర్ ధర రూ.6.79 లక్షలు (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. దీని టాప్ మోడల్ ధర రూ.10.14 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుంది.

ఓయమ్మా రోబో గీసిన బొమ్మకు డిమాండ్ మాములుగా లేదుగా- ఏకంగా రూ.9 కోట్లకు పైగా..!

ఐఫోన్ లవర్స్​కు షాకింగ్ న్యూస్- ఆ మోడల్స్ ప్రొడక్షన్ నిలిపివేసిన యాపిల్!

Last Updated : Nov 11, 2024, 3:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.