Laptop Cleaning Tips In Telugu : ఈ 5జీ కాలంలో ల్యాప్‌టాప్ అనేవి సర్వ సాధారణమైన గ్యాడ్జెట్‌గా మారిపోయింది. ఆన్లైన్ క్లాసుల పుణ్యమా అని విద్యార్థులు, వర్క్‌ఫ్రమ్ హోం అని ఉద్యోగస్థులు వీటితో తీరిక లేకుండా గడుపుతున్నారు. సాధారణంగా కంప్యూటర్లను ఫాస్ట్‌గా ఉంచాలని వైరస్‌లను గుర్తించటం వాటిని తొలగించటం తరచుగా రిఫ్రెష్ చేయటం లాంటివి చేస్తుంటాం. అయితే ల్యాప్‌టాప్‌లను కూడా ఫిజికల్‌గా శుభ్రపరచకపోతే అవి పాడైపోయే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు గ్యాడ్జెట్స్ నిపుణులు. వాటిని ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉంచుకోవాలని సూచిస్తున్నారు.
వాక్యూమ్ క్లీనర్‌ను వాడవచ్చు
ల్యాప్‌టాప్ క్లీనింగ్‌కు వాక్యూమ్ క్లీనర్‌ను వినియోగించవచ్చు. దీంతో దాని విడి భాగాలలో పేరుకుపోయిన దుమ్ము వెళ్లిపోతుంది. సాధారణంగా ల్యాప్‌టాప్ స్క్రీన్‌తో పాటు దాని విడి భాగాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఒకవేళ వాటిని బ్రష్‌లు లేదా ఇతర వాటితో శుభ్రపరిస్తే స్క్రీన్‌పై గీతలు పడటమే కాకుండా దాని ఇతర భాగాలూ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే వాక్యూమ్ క్లీనర్ వాడటం మంచిది. అయితే దీనిని శుభ్రపరుస్తున్నప్పుడు వాక్యూమ్ క్లీనర్‌ను తక్కువ స్పీడ్‌లో పెట్టడం మాత్రం మరిచిపోకండి.
కీ బోర్డును క్లీన్ చేయండి
ల్యాప్‌టాప్ కీబోర్డును వాక్యూమ్ క్లీనర్‌తో క్లీన్ చేయండి. సాధారణంగా కీబోర్డుపై ఉండే బటన్ల మధ్య దుమ్ము చేరి ఉంటుంది గనుక దానిని జాగ్రత్తగా శుభ్రపరచండి. అనంతరం తడి ఉన్న ఏదైనా క్లాత్‌తో కీబోర్డును శుభ్రం చేయండి.
ల్యాప్‌టాప్ పోర్టల్స్‌ను శుభ్రపరచండి
ల్యాప్‌టాప్‌ను వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రపరిచిన తరువాత దానిని మార్కెట్లో దొరికే ఐసోప్రొపైల్ ఆల్కహాల్‌తో క్లీన్ చేయటం మంచిది. దాని వల్ల స్క్రీన్‌పై లేదా ఇతర భాగాలపై కనిపించకుండా ఉండే సూక్ష్మజీవులు నశిస్తాయి.
ల్యాప్‌టాప్ స్క్రీన్ క్లీన్
ల్యాప్‌టాప్ స్క్రీన్ అనేది చాలా సున్నితమైన భాగం. గనుక దానిని శుభ్రపరచడానికి ఒక బట్ట ముక్క తీసుకొని దానిని కొంత ఐసోప్రొపైల్ ఆల్కహాల్‌తో తడిపి జాగ్రత్తగా తుడవాలి. ఒకవేళ మీ ల్యాప్‌టాప్ టచ్‌స్క్రీన్ అయితే ఈ రసాయనాన్ని ఎట్టిపరిస్థితుల్లో వాడకూడదు. ఈ విధంగా శుభ్రం చేయటం వల్ల మీ స్క్రీన్‌పై ఎటువంటి దుమ్మూధూళి నిలవదు.
తరచూ శానిటైజ్ చేయండి
ఒకసారి మీ ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను క్లీన్ చేసిన అనంతరం అదే ఐసోప్రొపైల్ రసాయనంతో మరోసారి ల్యాప్‌టాప్ అద్దాన్ని మరోసారి శానిటైజ్ చేయండి. దీంతో మీ ల్యాప్‌టాప్ శుభ్రంగా ఉండటమే కాకుండా ఎల్లప్పుడూ కొత్త దానిలా కన్పిస్తుంది. ఇలా వారానికి ఒకసారి చేయటం వల్ల మీ ల్యాప్‌టాప్ సర్వీస్ కూడా పెరుగుతుంది.
ఈ బెస్ట్ ఏఐ టూల్స్‌తో మీ జీవితమే మారుపోతుంది!
రూ.15వేలు బడ్జెట్లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలా? టాప్-5 ఆప్షన్స్ ఇవే!