ETV Bharat / technology

మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనాలా?- త్వరలో రిలీజ్​ కానున్న టాప్ మోడల్స్ ఇవే..!

లేటెస్ట్ చిప్​సెట్​తో టాప్ స్మార్ట్​ఫోన్స్- లాంచ్ ఎప్పుడంటే?

Upcoming Flagship Phones in India
Upcoming Flagship Phones in India (OnePlus, Realme, IQOO)
author img

By ETV Bharat Tech Team

Published : 2 hours ago

Upcoming Flagship Phones in India: మీరు కొత్త ఆండ్రాయిడ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే ఇండియన్ మార్కెట్లోకి చాలా కాలం తర్వాత కొన్ని ఫ్లాగ్​షిప్ మొబైల్స్ రానున్నాయి. టాప్ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు Qualcomm, MediaTek లేటెస్ట్ ప్రాసెసర్‌లతో ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లను తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో OnePlus, Oppo, iQOO, Vivo, Realme, Xiaomi వంటి కంపెనీలు ఉన్నాయి.

Realme GT 7 Pro: రియల్​మీ ఇండియాలో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో Realme GT 7 ప్రో మొబైల్​ను తీసుకురానుంది. దీని ప్రీవియస్ మోడల్స్​తో పోలిస్తే ఈ స్మార్ట్‌ఫోన్ CPU, GPU, AI పనితీరు పరంగా ఇది టాప్​లో ఉంటుంది. ఈ మొబైల్ మార్కెట్లోకి నవంబర్ ప్రారంభంలో రిలీజ్ కానుంది. నివేదికల ప్రకారం.. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో హై-రిజల్యూషన్ 2K డిస్‌ప్లేను కలిగి ఉండొచ్చు. ఇది 6,500 mAh బిగ్ బ్యాటరీతో రావొచ్చు. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుందని సమాచారం. ఈ మొబైల్ IP69 వాటర్-రెసిస్టెంట్ రేటింగ్, గరిష్టంగా 12 GB RAM, 512 GB వరకు స్టోరేజీతో వస్తుంది.

Oppo Find X8 Pro: ఒప్పో చాలా కాలంగా ఇండియన్ మార్కెట్లో ఏ ఫ్లాగ్​షిప్ ఫోన్​ను రిలీజ్ చేయలేదు. అయితే ఇప్పుడు కంపెనే తన Oppo Find X8 Pro మొబైల్​ను నవంబర్ మొదటి వారంలో ప్రారంభించొచ్చు. కంపెనీ ఈ ఫోన్​ను చాలా స్లిమ్​గా తీసుకొస్తుందని సమాచారం. ఫైండ్ X8 ప్రోలో MediaTek డైమెన్సిటీ 9400 చిప్ ఉంటుంది. దీని మందం 7.85 మిమీ ఉంటుంది. అంతేకాకుండా కంపెనీ ఈ మొబైల్​ను 5,700 mAh బిగ్​ బ్యాటరీతో తీసుకురావొచ్చు.

IQOO 13: దీని ప్రీవియస్ మోడల్స్​లానే iQOO 13 కూడా పెర్ఫార్మెన్స్- ఫోకస్డ్ స్మార్ట్​ఫోన్ కావచ్చు. కంపెనీ తన లేటెస్ట్ ఫ్లాగ్​షిప్ స్మార్ట్​ఫోన్ BMW మోటార్‌స్పోర్ట్స్ బ్రాండింగ్‌ను కూడా కలిగి ఉంటుందని స్పష్టం చేసింది. ఇందులో గమనించదగ్గ విషయం ఏంటంటే కొత్త IQOO 13లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్​తో వస్తుంది. అంతేకాక Qualcomm లేటెస్ట్ చిప్​తో అత్యంత సరసమైన ధరలో లాంచ్ అవ్వొచ్చు. ఇది 50 MP ట్రిపుల్ కెమెరా సెటప్, 2K రిజల్యూషన్ స్క్రీన్, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,100 mAh బిగ్​ బ్యాటరీని కలిగి ఉంటుంది.

Vivo X200 Pro: వివో ఫ్లాగ్‌షిప్ కెమెరా స్మార్ట్‌ఫోన్ X200 ప్రో డిసెంబర్‌లో రిలీజ్ అవుతుంది. దీనిలో MediaTek Dimension 9400 ప్రాసెసర్ ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లో ఇప్పటివరకూ ఉన్న బెస్ట్ టెలిఫొటో జూమ్​ లెన్స్​లో ఒకటైన Zeiss-ట్యూన్డ్ కెమెరాతో ఈ మొబైల్ రావొచ్చు. ఇది 200 MP కెమెరా సెన్సార్‌తో గరిష్టంగా x100 డిజిటల్ జూమ్‌ను కలిగి ఉండవచ్చు. ఇందులో 50 MP మెయిన్ కెమెరా, 50 MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఉండొచ్చు.

OnePlus 13: వన్‌ప్లస్ త్వరలో తన నెక్స్ట్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 13ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేయబోతోంది. సమాచారం ప్రకారం.. ఈ ఫోన్‌ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్​తో వస్తుంది. ఈ చిప్​తో ఈ మొబైల్ ఉత్తమ పనితీరును ప్రదర్శించవచ్చు. స్మార్ట్‌ఫోన్ ఫోర్త్- జనరేషన్ హాసెల్‌బ్లాడ్-ట్యూన్డ్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఈ ఫోన్ కొత్త ఏఐ ఫీచర్లను కలిగి ఉన్న Android 15-ఆధారిత ఆక్సిజన్‌OS 15 స్కిన్‌తో వస్తుంది.

Xiaomi 15: ఇది దాని ప్రీవియస్ మోడల్ మాదిరిగానే కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ కావచ్చు. ఇది 6.3- అంగుళాల డిస్​ప్లేతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్‌ ప్రాసెసర్​తో ఈ మొబైల్ 2024 చివరిలో లేదా 2025 ప్రారంభంలో భారత మార్కెట్లోకి వస్తుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రాసెసర్​తో ప్రారంభించిన మొదటి స్మార్ట్​ఫోన్​గా నిలవొచ్చు. ఈ ఫ్లాగ్‌షిప్ ఫోన్‌లో లైకా-ట్యూన్డ్ ట్రిపుల్ కెమెరా సెటప్​ను కలిగి ఉండొచ్చు. ఆండ్రాయిడ్ 15-ఆధారిత హైపర్‌ఓఎస్​తో ఇది రన్ అవుతుంది.

టెక్ దిగ్గజం యాపిల్​కు షాక్- ఆ దేశంలో ఐఫోన్16 బ్యాన్- ఎందుకంటే?

ఈ పండక్కి కొత్త ఫోన్ కొనాలా?- అది కూడా తక్కువ ధరలో..?- అయితే ఒప్పో A3x 4Gపై ఓ లుక్కేయండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.