ETV Bharat / technology

మీరు ఐఫోన్ యూజర్లా? డైలీ ఉపయోగపడే 8 ప్రో టిప్స్ మీ కోసం! - Shaking Massage Technique iPhone

iPhone Unknown Pro Tips : మీరు ఐఫోన్ యూజర్లా? అయితే మీ కోసం 8 ప్రో టిప్స్ అందిస్తున్నాం. వీటితో మీ డైలీ లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది. లేటెస్ట్ ఐఫోన్లతో పాటు పాత మోడల్స్​లోనూ ఈ టిప్స్​ పనిచేస్తాయి.

iPhone Known Pro Tips
iPhone Known Pro Tips
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 27, 2024, 4:51 PM IST

iPhone Unknown Pro Tips : మీరు ఐఫోన్​ యుజర్లా? అందులో ఉన్న కొన్ని హిడెన్​ ఫీచర్స్​ గురించి మీకు తెలుసా? అయితే ఈ ఫీచర్స్​ కేవలం కొత్తగా వచ్చిన ఐఫోన్​ 15 సిరీస్​లో మాత్రమే కాకుండా పాత డివైజుల్లోనూ పనిచేస్తాయి. మరి ఆ హిడెన్​ ఫీచర్స్​ ఏంటి? వాటిని ఎలా వాడాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి.

  1. బటన్​ నొక్కితే కెమెరా ఆన్​
    ఐఫోన్​ కెమెరా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చెప్పాలంటే చాలా మంది కెమెరా కోసమే యాపిల్​ ఫోన్​లను కొంటుంటారు. ఐఫోన్​ ద్వారా ఏదైనా ఫొటో క్లిక్​ చేద్దామన్నా లేదా ఏమైనా వీడియో రికార్డ్​ చేయాలన్నా, ఫోన్​ లాక్​ ఓపెన్​ చేసి కెమెరా ఐకాన్​పై క్లిక్​ చేస్తుంటారు. కానీ, అంత ప్రాసెస్​లోకి వెళ్లకుండానే కేవలం ఒక్క చిన్న టిప్​తో కొన్ని మిల్లిసెకెన్లలో మీ కెమెరాను ఆన్ చేసి వీడియో రికార్డింగ్​​ చేయవచ్చు. ఇందుకోసం కేవలం షట్టర్​ బటన్​ను​ లాంగ్​ ప్రెస్​ చేసి ఉంచితే చాలు. ఆటోమెటిగ్గా వీడియో రికార్డింగ్​ స్టార్ట్​ అవుతుంది
  2. ఫ్లాష్​లైట్​ ఆన్​ అండ్ ఆఫ్​​
    సాధారణంగా ఐఫోన్​లలో ఫ్లాష్​లైట్​​ ఆన్​ చేసేందుకు ప్రత్యేకంగా ఓ సింబల్​ కూడా ఉంటుంది. చాలామంది దీనిని వినియోగించే లైట్​ను ఆన్​-ఆఫ్​ చేస్తారు. అయితే ఐఫోన్​లోని వాయిస్​ అసిస్టెంట్​ టూల్​ 'Siri' ఫీచర్​ సాయంతో ఫ్లాష్​లైట్​ను చిటికెలో ఆన్​ లేదా ఆఫ్​ చేయవచ్చు. కేవలం 'Siri, Lumos' అంటే లైట్​ ఆన్​ అవుతుంది, 'Siri, nox' అంటే ఫ్లాష్​లైట్​​ ఆఫ్​ అవుతుంది.
  3. హార్డ్​ రీసెట్​ చేయండి
    ఐఫోన్ కొన్ని సార్లు హ్యాంగ్ అవుతూ ఉంటుంది. అప్పుడు దానిని రీసెట్ చేయాల్సి వస్తుంది. దీని కోసం వాల్యూమ్​ అప్​​ బటన్​ను నొక్కి వదిలేయండి. ఆ తర్వాత వాల్యూమ్​ డౌన్​ బటన్​ను కూడా అలానే చేయండి. ఆపై సైడ్​ బటన్​ను లాంగ్​ ప్రెస్​ చేసి ఉంచండి. ఇలా మీ ఫోన్​ మొత్తం షట్​డౌన్​ అయ్యేంత వరకు చేయండి. కొద్దిసేపటి తర్వాత దానిని ఆన్​ చేయండి. దీనితో మీ ఫోన్ సెట్​ అవుతుంది. ఈ ట్రిక్​ ఐఫోన్ 10 నుంచి ఐఫోన్ 15 సరీస్​ ఫోన్లకు వర్కౌట్​ అవుతుంది.
  4. వన్​ హ్యాండెడ్​​ కీబోర్డ్​
    ఐఫోన్​ ప్లస్​, ఐఫోన్​ ప్రో మ్యాక్స్​ మోడల్స్​లో రెండు చేతులను ఉపయోగించకుండా మెసేజ్​ను టైప్ చేయడం కష్టం. దీనిని దృష్టిలో ఉంచుకొని యాపిల్​ మీ మొబైల్​కు చక్కని రీచెబులిటీ ఫీచర్​ను జోడించింది. అదే వన్​ హ్యాండెడ్​​ కీబోర్డ్​. దీని సాయంతో కేవలం ఒక్క చేత్తో మీరు సందేశాన్ని టైప్​ చేయవచ్చు. ఇందుకోసం ఫోన్​ కీ-బోర్డ్​లోని ఎమోజీ సింబల్​ను నొక్కి పట్టుకోండి. ఆ తర్వాత మీరు కీ-బోర్డును స్క్రీన్​కు కుడివైపునా లేదా ఎడమవైపుకు మార్చుకోవచ్చు. తద్వారా మీరు ఒంటి చేత్తో మెసేజ్​ను టైప్​ చేయవచ్చు.
  5. షేకింగ్​ మెసేజ్‌లు
    మామూలుగా మీరు ఏదైనా ఒక పదాన్ని తప్పుగా టైప్​ చేసి దానిని డిలీట్​ చేసేందుకు బ్యాక్​స్పేస్​ బటన్​ను క్లిక్​ చేస్తారు. దానికి బదులుగా ఐఫోన్​లోని షేకింగ్​ మెసేజ్​ ఫీచర్​తో బ్యాక్​స్పేస్​ ఎంటర్​ చేయకుండానే మీరు రాసిన తప్పు పదం స్క్రీన్​పై నుంచి తొలగిపోతుంది. ఇందుకోసం మీరు మీ గ్యాడ్జెట్​ను ఒకసారి షేక్ చేస్తే మీరు టైప్ చేసిన పదం డిలీట్ అయిపోతుంది. మీరు మరలా ఫోన్​ను షేక్ చేస్తే అదే పదం రీ-యాడ్ అవుతుంది.
  6. బ్యాక్​గ్రౌండ్​ సౌండ్స్​​
    సాధారణంగా చాలామంది యాపిల్​ ఫోన్​లోని బ్యాక్​గ్రౌండ్​ సౌండ్స్​ను వింటూ రిలాక్స్ అవ్వడానికి ఇష్టపడారు. మీరు మ్యూజిక్​ను ఎంజాయ్ చేయాలని అనుకుంటే, కంట్రోల్​ సెంటర్‌ను ఓపెన్​ చేసి ఇయర్​ ఐకాన్​పై ట్యాప్​ చేసి హోల్డ్ చేసి ఉంచండి. దీంతో వివిధ రకాల బ్యాక్​గ్రౌండ్​ సౌండ్స్​​ను మీరు వినగలుగుతారు.
  7. సులభంగా స్టిక్కర్‌లను క్రియేట్​ చేయండి
    ఐఫోన్​లోని క్రియేట్​ స్టిక్కర్​ ఫీచర్‌ను ఉపయోగించి మీకు నచ్చిన ఫొటోను స్టికర్​ రూపంలో మార్చుకోవచ్చు. iOS 17 ఇన్‌స్టాల్​ చేసిన డివైజ్​లలో Messages ఆప్షన్​కు వెళ్లి '+' ఐకాన్​ను ప్రెస్​ చేయండి. ఆ తర్వాత స్టికర్స్​పై క్లిక్​ చేయండి. అనంతరం మళ్లీ '+' సింబల్​ను నొక్కండి. తర్వాత మీరు స్టికర్​గా మార్చాలనుకుంటున్న ఫోటోను సెలెక్ట్​ చేసుకోండి.
  8. ఆటోమేటిక్​ ఫోకస్​ మోడ్స్​
    ఫోకస్​ మోడ్​ ఫీచర్​ సాయంతో మీ ఐఫోన్​ వినియోగాన్ని నియంత్రించవచ్చు. దీనిని ఎనేబుల్​ చేసుకోవడం ద్వారా మీరు అతిగా ఫోన్​ చూస్తున్నా, రాత్రుళ్లు నిద్ర మానేసి మరీ అందులోనే గడుపుతున్నా ఓ అలర్ట్​ మెసేజ్​ లాంటిది మీకు వస్తుంది. దీనిని ఈ ఆటోమేటిక్​ ఫోకస్​ మోడ్‌ ఫీచర్​ పంపిస్తుంది. తద్వారా మీరు మీ ముఖ్యమైన పనులను సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు.​

100జీబీ క్లౌడ్​ స్టోరేజీతో అతి తక్కువ ధరలో ల్యాప్​టాప్​- స్టూడెంట్స్​కు బెస్ట్​ ఆప్షన్​!

సబ్​స్క్రిప్షన్ లేకున్నా ఎక్స్​లో ఆడియా, వీడియో కాల్స్​- ఈ సెట్టింగ్స్ మార్చుకోండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.