Online AI Courses In IIT Madras: దేశంలోని అత్యుత్తమ విద్యా సంస్థ IIT-మద్రాస్ విద్యార్థులకు గొప్ప అవకాశాలను అందిస్తోంది. 8 వారాల వ్యవధి గల ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సులకు దరఖాస్తులకు ఆహ్వానించింది. ఇందులో డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ వంటి అధునాతన కోర్సులు ఉన్నాయి.
వాటిలో ఒక్కో కోర్సుకు అప్లికేషన్ ఫీజు కేవలం రూ. 500 మాత్రమే. అయితే ఈ అవకాశం IIT-మద్రాస్‌లో భాగస్వాములుగా నమోదైన పాఠశాలల్లో 11, 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆయా పాఠశాలల విద్యార్థులు తమ ఉపాధ్యాయులను సంప్రదించడం ద్వారా ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ సర్టిఫికేట్ కోర్సులపై మరిన్ని వివరాలు:
- ఇప్పటి వరకు 450 పాఠశాలలు ఐఐటీ మద్రాస్‌లో భాగస్వాములుగా చేరాయి.
- 11,000 మందికి పైగా విద్యార్థులు వివిధ బ్యాచ్‌లలో వివిధ కోర్సుల నుంచి బెనిఫిట్ పొందారని IIT మద్రాస్ తన అధికారిక వెబ్‌సైట్‌లో తెలిపింది.
- భవిష్యత్ తరాన్ని నిపుణులుగా తీర్చిదిద్దడం వారి బాధ్యత. దీంతోపాటు విద్యార్థులకు వారి అభిరుచులకు సరిపోయే కెరీర్ మార్గాన్ని ఎంచుకోవడానికి ముందస్తు అవకాశాలను అందించాల్సిన అవసరం ఉంది.
- ఈ నేపథ్యంలోనే ఐఐటీ మద్రాస్ భాగస్వామ్య పాఠశాలల విద్యార్థులకు సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్నాయి.
- ఇందుకోసం అప్లికేషన్ సబ్మిషన్ ప్రాసెస్ సెప్టెంబర్ 16 నుంచి ప్రారంభమై అక్టోబర్ 4 వరకు కొనసాగనుంది.
- ఇందులో పార్టనర్‌గా జాయిన్ అయ్యేందుకు సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఉంది.
- అక్టోబర్ 21 నుంచి ఈ ఆన్‌లైన్ కోర్సు బ్యాచ్‌లు ప్రారంభమవుతాయని ఐఐటీ మద్రాస్ స్పష్టం చేసింది.
- ఏదైనా స్ట్రీమ్‌లోని 11వ తరగతి విద్యార్థులు డేటా సైన్స్ అండ్ ఏఐ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- అయితే ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ కోర్సుకు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ చదివినవారు మాత్రమే అర్హులు.
- కోర్సులో భాగంగా ప్రతి సోమవారం 30 నిమిషాల నిడివితో రికార్డ్ చేసిన లెక్చర్ వీడియోలు రిలీజ్ చేస్తారు. విద్యార్థులు వాటిని వారంలో ఎప్పుడైనా చూడొచ్చు.
- శనివారాలు లేదా ఆదివారాల్లో నెలకు ఒకసారి లైవ్ ఇంటరాక్షన్ ఉంటుంది.
- ఆన్‌లైన్ అసైన్మెంట్స్లో 15 రోజులకు ఒకటి చొప్పున మొత్తం 4 ప్రాజెక్టులు ఉంటాయి. వీటిని సబ్మిట్ చేసేందుకు 2 వారాల గడువు ఉంటుంది.
- విద్యార్థులు సబ్జెక్ట్ వీడియోలను వీక్షించి నిర్ణీత సమయంలోగా తమ అసైన్‌మెంట్‌లను ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేయాలి.
- ప్రతి అసైన్‌మెంట్‌లో విద్యార్థులకు కనీసం 40శాతం మార్కులు రావాలి. నాలుగు ప్రాజెక్టులలో కనీసం మూడు ప్రాజెక్టులల్లో అయినా 40 శాతం మార్కులు వస్తేనే తుది మూల్యాంకనం చేస్తారు.
- ఫైనల్‌గా 8 వారాల ఆన్‌లైన్ కోర్సులను పూర్తి చేసిన తర్వాత విద్యార్థులకు ఇ-సర్టిఫికేట్‌లు ఇస్తారు.
'ఏఐలో 12.5 లక్షల ఉద్యోగాలు'- ఈ స్కిల్స్ నేర్చుకో జాబ్ పట్టుకో! - JOBS IN ARTIFICIAL INTELLIGENCE
AI ఫీచర్లతో 'ఏసర్' ల్యాప్టాప్స్ లాంచ్- ధర ఎంతో తెలుసా? - Acer AI Laptops Unveils