How To Use Photomath App : గణితం అంటేనే చాలా మందికి భయం పట్టుకుంటుంది. లెక్కల చిక్కుముడులు విప్పలేక నానా అవస్థలు పడుతుంటారు. సంక్లిష్టమైన గణిత సమస్యలకు సమాధానం రాబట్టలేక తెగ కష్టపడుతుంటారు. అలాంటి వారి కోసమే గూగుల్ కంపెనీ ఒక సరికొత్త యాప్‌ను తీసుకువచ్చింది. అదే 'ఫొటోమ్యాథ్' యాప్.
వాస్తవానికి గూగుల్ కంపెనీ ఈ మ్యాథ్స్ యాప్‌ను చాలా కాలం క్రితమే కొనుగోలు చేసింది. తాజాగా దానిని ప్లేస్టోర్, యాప్ స్టోర్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. దీనిని మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బేసిక్ వెర్షన్ పూర్తిగా ఫ్రీ. కానీ ప్రీమియం వెర్షన్ కావాలంటే డబ్బులు కట్టాల్సి ఉంటుంది.
చిక్కు లెక్కలకు సులువైన సమాధానం!
మీకు గణితంలో ఏదైనా ప్రశ్నకు సమాధానం తెలియకపోతే, వెంటనే ఈ యాప్ ఉపయోగించి సరైన సొల్యూషన్‌ను కనుగొనవచ్చు. ఇందుకోసం మీరు ప్రశ్నను ఫొటో తీసి ఫొటోమ్యాథ్ యాప్‌లో అప్లోడ్ చేయాలి. లేదా యాప్ ఓపెన్ చేసి, ప్రశ్నను స్కాన్ చేయాలి. అంతే సింపుల్. యాప్ మీ ప్రశ్నను ఎనలైజ్ చేసి, సరైన సమాధానాన్ని ఇస్తుంది.
ఈ ఫొటోమ్యాథ్ యాప్ ద్వారా మీరు కూడికలు, తీసివేతలు లాంటి బేసిక్ మ్యాథ్స్ చేయవచ్చు. అలాగే రేఖాగణితం, త్రికోణమితి లాంటి సంక్లిష్టమైన లెక్కలకు కూడా సమాధానాలు కనుగొనవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ ఫొటోమ్యాథ్ యాప్ అనేక భాషలకు సపోర్ట్ చేస్తుంది.
ఫొటోమ్యాథ్ యాప్ ఎలా వాడాలంటే?
- ముందుగా మీరు ప్లేస్టోర్ లేదా యాపిల్ స్టోర్‌లోకి వెళ్లాలి.
- ఫొటోమ్యాథ్ అని టైప్ చేసి సెర్చ్ చేస్తే యాప్ కనిపిస్తుంది.
- ఈ ఫొటోమ్యాథ్ యాప్‌ను మీ డివైజ్‌లోకి డౌన్లోడ్ చేసుకోవాలి.
- యాప్‌ను ఓపెన్ చేసి మ్యాథ్య్ ప్రోబ్లమ్ను స్కాన్ చేయాలి.
- ఒకవేళ స్కాన్ చేయడం వీలుకాకపోతే, ప్రశ్నను మాన్యువల్‌గా టైప్ కూడా చేయవచ్చు. దీని కోసం ప్రత్యేకంగా ఒక కీబోర్డ్ ఉంటుంది.
- ప్రశ్నను మీరు స్కాన్ చేయగానే, తెరపై మీకు సమాధానం కనిపిస్తుంది.
నోట్ : మీరు స్కాన్ చేసే ప్రశ్న చాలా స్పష్టంగా ఉండాలి. చేతిరాతలో స్పష్టత లేకపోతే ప్రశ్నకు సరైన సమాధానం రాకపోవచ్చు.
ప్రతి ఒక్కరూ ట్రై చేయాల్సిన టాప్-20 ఏఐ టూల్స్ ఇవే!
గూగుల్ బంపర్ ఆఫర్ - ఉచితంగా ఏఐ కోర్సులు - నేర్చుకుంటే ఉద్యోగం గ్యారెంటీ!