How to Sign in Multiple Gmail Accounts: దాదాపు రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన జీ-మెయిల్ అతి కొద్ది కాలంలోనే మంచి ప్రజాదరణ పొందింది. దానికనుగుణంగానే జీ-మెయిల్ కూడా ఎప్పటికప్పుడు తమ కస్టమర్లకు నూతన సేవలందిస్తూ వస్తోంది. అయితే.. ఇందులో ఉన్న కొన్ని బెస్ట్ ఫీచర్ల గురించి చాలా మందికి తెలియదు. ఎన్నో ఉపయోగకరమైన ఫీచర్స్ ఉన్నప్పటికీ.. చాలా మంది నామమాత్రపు ఆప్షన్స్ మాత్రమే వినియోగిస్తుంటారు. ఇలాంటి వాటిల్లో ఒకటే మల్టిపుల్ అకౌంట్స్ ఆపరేట్ చేయడం. మరి.. ఈ ఫీచర్ గురించి మీకు తెలుసా?
ప్రస్తుత రోజుల్లో చాలా మందికి ఒకటికి మించిన జీ మెయిల్ అకౌంట్లు ఉండటం సర్వసాధారణమైపోయింది. పర్సనల్ కోసం ఒకటి, బిజినెస్ కోసం ఒకటి అంటూ చాలా జీ-మెయిల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. అయితే చాలా మందికి ఒకేసారి అన్ని అకౌంట్లనూ వినియోగించడం తెలియదు. దీంతో.. ఒక అకౌంట్ లాగౌట్ చేసిన తర్వాత.. మరో అకౌంట్కు లాగిన్ అవుతారు. దీంతో టైం వేస్ట్ అవుతుంది. పనులు కూడా తొందరగా పూర్తి కావు. మీరు కూడా ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటే.. జీ-మెయిల్లోని యాడ్ అకౌంట్ ఆప్షన్ వినియోగించుకోవాలని సలహా ఇస్తున్నారు టెక్ నిపుణులు. దీనివల్ల ఏ అకౌంటూ లాగౌట్ చేయకుండానే.. మీకు ఉన్న అన్ని అకౌంట్లనూ లాగిన్ చేసుకోవచ్చు. మరి ఆ ప్రాసెస్ ఏంటి? ఎలా అకౌంట్లను యాడ్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం.
- ముందుగా మీ ప్రైమరీ జీమెయిల్ అకౌంట్కు లాగిన్ అవ్వాలి. అంటే.. మీ మెయిన్ అకౌంట్ లాగిన్ అవ్వాలి.
- ఈ అకౌంట్ మీరు ఇతర అకౌంట్లకు లాగిన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది.
- మీరు జీమెయిల్ అకౌంట్కు లాగిన్ అయిన తర్వాత.. స్క్రీన్ మీద రైట్ సైడ్ కార్నర్లో మీ ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
- అప్పుడు Sign Out అండ్ Add Another Account అనే రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి.
- అందులో Add Another Account అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి.
- ఇప్పుడు కొత్త విండో ఓపెన్ అవుతుంది. అక్కడ లాగిన్ డీటెయిల్స్ అడుగుతుంది.
- ఆ పేజీలో మీ రెండో అకౌంట్కు సంబంధించిన యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
- అంతే.. మీ రెండు అకౌంట్లు లాగిన్లో ఉన్నాయని అర్థం. ఇలా ఎన్ని అకౌంట్లు కావాలంటే అన్ని అకౌంట్లనూ లాగిన్ చేసుకోవచ్చు.
- ఇప్పుడున్న అకౌంట్లోనుంచి మరో అకౌంట్లోకి వెళ్లాలంటే.. మీ ప్రొఫైల్ పిక్ మీద క్లిక్ చేస్తే.. మీరు యాడ్ చేసిన అకౌంట్లన్నీ కింద వరుసగా కనిపిస్తుంటాయి.
- అందులో మీకు కావాలనుకున్న అకౌంట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది.
- ఇలా.. మీరు ఒక జీమెయిల్ నుంచి లాగౌట్ చేయకుండానే.. మరో అకౌంట్లోకి లాగిన్ కావొచ్చు. మరి.. ఇక ఆలస్యమెందుకు? ఇప్పుడే మీ అకౌంట్స్ యాడ్ చేసుకోండి.
జీ-మెయిల్ యూజర్స్ తెలుసుకోవాల్సిన టాప్-9 హిడెన్ ఫీచర్స్ ఇవే!
గూగుల్ స్టోరేజ్ ఫుల్ అయ్యిందా? సింపుల్గా క్లీన్ చేసుకోండిలా!