ETV Bharat / technology

మీ యూట్యూబ్​ ఛానల్​ సూపర్​ సక్సెస్​ కావాలా? ఈ టాప్​-6 టిప్స్​ మీ కోసమే! - YouTube Tips To Grow Your Channel - YOUTUBE TIPS TO GROW YOUR CHANNEL

YouTube Tips To Grow Your Channel In 2024 : మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి, మంచిగా సక్సెస్ కావాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. యూట్యూబ్​లో ఎలా సూపర్ సక్సెస్ కావాలి? పేరు, ప్రఖ్యాతులతో పాటు, బాగా డబ్బులు ఎలా సంపాదించాలి? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

YouTube Tips To Grow Your Channel in 2024
How to Create a Successful YouTube Channel (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 12, 2024, 1:44 PM IST

YouTube Tips To Grow Your Channel In 2024 : మీరు మంచి కంటెంట్ క్రియేటర్​గా, ఇన్​ఫ్లూయెన్సర్​గా పేరు సంపాదించాలని అనుకుంటున్నారా? సోషల్ మీడియా ద్వారా మీ బిజినెస్​ను ప్రమోట్ చేయాలని ఆశిస్తున్నారా? అయితే మీకు యూట్యూబ్ బెస్ట్ ప్లాట్​ఫామ్ అవుతుంది. ప్రతి నెలా దాదాపు 2 బిలియన్ల మంది యూట్యూబ్​ను చూస్తూ ఉంటారు. ఈ వీడియో షేరింగ్ ప్లాట్​ఫామ్​లో విద్య, వినోదం రెండూ కలగలిసి ఉంటాయి. కనుక ఇక్కడ సక్సెస్ కావడానికి అవకాశం ఎక్కువగా ఉంది.

యూట్యూబ్​ ఛానల్​ వల్ల కలిగే లాభాలు

  • ప్రేక్షకుల ఆదరణ : యూట్యూబ్​కు సరిహద్దులు అంటూ ఏమీ లేవు. కనుక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల అభిమానాన్ని మీరు సంపాదించవచ్చు. చాలా మంది స్టార్​ యూట్యూబర్లు ఇలా వచ్చినవారే.
  • మోనటైజేషన్​ : యూట్యూబ్​ పార్టనర్ ప్రోగ్రామ్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. యాడ్స్​, ఛానల్ మెంబర్​షిప్స్​, సూపర్ చాట్స్​ ద్వారా; ప్రొడక్ట్స్​ సేల్, అఫిలియేషన్ మార్కెటింగ్​​ చేయడం ద్వారా కూడా సంపాదన పెంచుకోవచ్చు. సబ్​స్క్రైబర్లు పెరుగుతున్న కొలదీ మీ రెవెన్యూ కూడా పెరుగుతుంది.
  • బ్రాండ్ బిల్డింగ్ : మీకంటూ ఒక బ్రాండింగ్​ను సృష్టించుకోవడం వల్ల, సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. మీ అనుభవం, వ్యక్తిత్వం, విలువలు గురించి ప్రజలకు తెలుస్తుంది.
  • జ్ఞానం పంచుకోవడం : మీకు ఉన్న జ్ఞానాన్ని ట్యుటోరియల్స్ ద్వారా ప్రజలతో పంచుకోవచ్చు. దీని వల్ల చాలా మంది విజ్ఞానం, ప్రేరణ పొందుతారు.

How To Grow Youtube Channel :

1. మీకు ఇష్టమైన సబ్జెక్ట్​ని ఎంచుకోవాలి!

  • మీకు బాగా ఇష్టమైన, అనుభవం ఉన్న సబ్జెక్ట్​నే ఎంచుకోవాలి. ఉదాహరణకు మీకు టీచింగ్ అంటే ఇష్టం అనుకుంటే, విద్యార్థులకు ఉపయోగపడే ట్యుటోరియల్స్​ క్రియేట్ చేయాలి. అవి కూడా చాలా క్రియేటివ్​గా ఉండాలి.
  • ఈ విధంగా మీరు కుకింగ్, గేమింగ్​, ట్రావెల్​ వీడియోలు చేయవచ్చు. లేదా టెక్​, ఆటోమొబైల్, సినిమా రివ్యూలు చేయవచ్చు. ఇలా మీకు ఏ విషయంపైన అభిరుచి ఉంటుందో, దానినే ఎంచుకోవచ్చు. కానీ వాటిపై మీకు సరైన అవగాహన/ నైపుణ్యం ఉండి తీరాలి.
  • మీ టార్గెట్ ఆడియన్స్ గురించి కూడా బాగా ఆలోచించాలి. వారికి ఎలాంటి కంటెంట్ ఇస్తే బాగుంటుంది? సబ్​స్క్రైబర్లు ఎలాంటి కంటెంట్​ను ఇష్టపడుతున్నారు? అనే విషయాలు తెలుసుకుని, వాటికి అనుగుణంగా వీడియోలు చేయాలి.

2. హై-క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలి!

  • వీడియో, ఆడియో క్వాలిటీ బాగా లేకపోతే, మీరు ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా ప్రేక్షకులు చూడరు. అందువల్ల మంచి కెమెరా, మైక్రోఫోన్, లైటింగ్ సెటప్ ఏర్పాటు చేసుకుని హై క్వాలిటీ వీడియోలు తీయాలి.​
  • మీకంటూ ఒక కంటెంట్ క్యాలెండర్​ను రూపొందించుకోవాలి. రెగ్యులర్​గా వీడియోలు చేస్తుండాలి.
  • వ్యూయర్స్ చేసే కామెంట్స్​కు రెస్పాండ్ అవ్వాలి. సబ్​స్క్రైబర్ల ఫీడ్​ బ్యాక్ తీసుకోవాలి. స్ట్రాంగ్ కమ్యూనిటీని పెంచుకోవాలి.

3. సరైన కీవర్డ్స్​ ఇచ్చి ఆప్టిమైజ్ చేసుకోవాలి!

  • మనం ఎంత మంచి కంటెంట్ క్రియేట్​ చేసినా, సరైన కీవర్డ్స్ ఇవ్వకపోతే యూట్యూబ్​లో మన వీడియోలు యూజర్లకు చేరవు. ఫలితంగా మన యూట్యూబ్ ఛానల్​ గ్రోత్ పెద్దగా పెరగదు. అందువల్ల గూగుల్ కీవర్డ్ ప్లానర్​, ట్యూబ్​బడ్డీ లాంటి వాటిని వాడుకోవాలి. ఇవి మీ కంటెంట్​కు తగిన కీవర్డ్స్, టైటిల్స్​, డిస్క్రిప్షన్​, ట్యాగ్స్ అన్నీ ఇస్తాయి. ఇవి సెర్చ్ ఆప్టిమైజేషన్​ను పెంచి, మీ వీడియోను ఎక్కువ మంది చూసేలా చేస్తాయి.
  • కచ్చితంగా ఆకర్షణీయమైన థంబ్​నెయిల్స్ క్రియేట్ చేయాలి. అప్పుడే యూజర్లు మీ వీడియోపై క్లిక్ చేస్తారు. మీ కంటెంట్ బాగుంటే సబ్​స్క్రైబ్ కూడా చేసుకుంటారు.

4. ఛానల్​ని ప్రమోట్ చేసుకోవాలి!

  • మీ యూట్యూబ్ ఛానల్​ని మీరే ప్రమోట్ చేసుకోవాలి. ఇందుకోసం మీ వీడియోలను ఇన్​స్టాగ్రామ్​, ఫేస్​బుక్​ లాంటి సోషల్ మీడియా ప్లాట్​ఫామ్స్​లో షేర్​ చేయాలి.
  • మిగతా యూట్యూబర్స్​తో కలిసి క్రాస్​-ప్రమోషన్ చేసుకోవాలి. దీనివల్ల మీ సబ్​స్క్రైబర్లు పెరుగుతారు.

5. విశ్లేషించుకోవాలి - సరిదిద్దు కోవాలి!

  • మీ ఆడియెన్స్ రిటెన్షన్​, వాచ్ టైమింగ్​, డెమోగ్రాఫిక్స్ అన్నింటినీ పరిశీలించాలి. వాటిని చాలా కూలంకషంగా విశ్లేషించుకోవాలి. ఏమైనా లోపాలు, పొరపాట్లు ఉంటే, వాటిని సరిదిద్దుకోవాలి.
  • అవసరమైతే నిపుణుల, తోటి యూట్యూబర్ల సలహాలు తీసుకోవాలి.

6. లేటెస్ట్ ట్రెండ్స్​, టిప్స్​ పాటించాలి!

  • యూట్యూబ్ షార్ట్స్​ : నేడు యూట్యూబ్​ షార్ట్​-వీడియోస్​ను విపరీతంగా చూస్తున్నారు. కనుక ఆకర్షణీయమైన షార్ట్స్​ను రూపొందించి, ప్రజల ఆదరణ పొందడానికి ప్రయత్నించాలి.
  • లైవ్ స్ట్రీమింగ్ : మీరే స్వయంగా హోస్ట్​ చేస్తూ, యూజర్ల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. ప్రొడక్ట్స్​ లాంఛ్ చేయండి. అప్పుడప్పుడు మీ స్టూడియో టూర్ చేయండి. అలాగే మీరు వీడియో తీసే విధానాన్ని (గ్లింప్స్)ను కూడా మీ సబ్​స్క్రైబర్లతో పంచుకోండి. రియల్​-టైమ్​లో ఆడియన్స్​తో మాట్లాడి, వారితో పర్సనల్ ఎటాచ్​మెంట్ పెంచుకోండి.
  • స్టోరీ టెల్లింగ్ : అప్పుడప్పుడు మీ సొంత విషయాలను, మీ కష్టసుఖాలను కూడా సబ్​స్క్రైబర్లతో పంచుకోండి. వారి కష్టసుఖాలు కూడా తెలుసుకోండి. అప్పుడే వారు మీతో ఎమోషనల్​గా కనెక్ట్ అవుతారు.
  • మొబైల్ ఆప్టిమైజేషన్​ : చాలా మంది సెల్​ఫోన్​లోనే వీడియోలు చూస్తుంటారు. కనుక ఆ చిన్న స్క్రీన్​లోనూ మీ కంటెంట్ అద్భుతంగా కనిపించేలా చేయాలి. ఇందుకోసం మంచి వీడియో ఎడిటింగ్ స్కిల్స్ నేర్చుకోవాలి.
  • ఓపిక తప్పనిసరి : యూట్యూబ్​లో సక్సెస్ కావడం అంత సులువేమీ కాదు. దీనికోసం చాలా సమయం వేచి చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా చాలా ఓపికతో, డెడికేషన్​తో, క్రియేటివ్​గా పనిచేయాల్సి ఉంటుంది. ట్రెండ్​కు అనుగుణంగా పనిచేస్తూ, ఓపిక మీద ఉంటే కచ్చితంగా యూట్యూబ్​లో సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆల్​ ది బెస్ట్​!

వాట్సాప్‌ నయా సేఫ్టీ ఫీచర్​తో - గ్రూప్​ స్కామ్స్​కు చెక్​! - WhatsApp New Safety Feature

మీ గూగుల్ 'యాక్టివిటీ'ని​ డిలీట్​ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - How to Delete Google Search History

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.