ETV Bharat / technology

మీరు సెల్​ఫోన్​కు అడిక్ట్​ అయ్యారా? అయితే సమస్యల్లో పడ్డట్టే! ఈ సింపుల్​ టిప్స్​తో బిగ్​ రిలీఫ్​! - How To Control Cell Phone Usage - HOW TO CONTROL CELL PHONE USAGE

How To Control Cell Phone Usage : ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ వాడుతున్నారు. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి వరకు దానితోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు. సెల్ ఫోన్​కు అంతలా అడిక్ట్​ వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు, రుగ్మలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఫోన్​ వాడకం తగ్గించుకునేందుకు పాటించాల్సిన చిట్కాలేంటో ఈ స్టోరీలో చూద్దాం.

How To Control Cell Phone Usage
How To Control Cell Phone Usage (GettyImages)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 21, 2024, 5:10 PM IST

How To Control Cell Phone Usage : పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు చేతిలోనే ఉండే పరికరం ఏది అంటే అది మొబైల్ ఫోన్ అని ఠక్కున చెప్పొచ్చు. ఫోన్ చేతిలో ఉంటే చాలు చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోరు చాలా మంది. అయితే విచ్చలవిడిగా ఫోన్ వాడడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఫోన్ వాడకాన్ని తగ్గించుకోడానికి కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఈ ఇప్పుడు తెలుసుకుందాం.

స్మార్ట్ ఫోన్ రోజులో కొన్ని గంటలపాటు పక్కన పెట్టేందుకు ప్రయత్నించండి. మీ వ్యక్తిగత సెల్ ఫోన్ వినియోగాన్ని పర్యవేక్షించడానికి క్వాలిటీ టైమ్, మూమెంట్ వంటి యాప్స్​ను డౌన్ లోడ్ చేసుకోండి. ఈ యాప్స్​కు నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి. ఫోన్​కు ఎక్కువగా అడిక్ట్​ అవ్వకుండా ఉండేందుకు ఇతర విషయాలు( మీ హాబీస్)పై దృష్టి పెట్టండి. దీంతో మీరు కాస్త బిజీగా ఉండి సెల్ ను కాసేపు పక్కనపెడతారు.

1. మీ ఫోన్ వాడకం సమయాన్ని తగ్గించండి
మీరు రోజూ ఫోన్​ను ఎంత సేపు వాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత సెల్ ఫోన్ వాడకం సమయాన్ని రోజురోజుకు మెల్లగా తగ్గించుకోండి. క్వాలిటీ టైమ్, మూమెంట్ వంటి యాప్స్​ను ఉపయోగించి రోజుకు మీరు ఎంత సేపు సెల్​ ఫోన్​ను యూజ్ చేస్తున్నారో తెలుసుకోవచ్చు.

2. నోటిఫికేషన్స్​ను ఆఫ్ చేయండి
మీ ఫోన్​లోని యాప్స్​కు నోటిఫికేషన్లను ఆఫ్ చేయండి. లేదంటే నోటిఫికేషన్ వచ్చిన ప్రతీసారి మొబైల్​ను చూస్తుంటారు. దీంతో పోన్ వాడకం మరింత ఎక్కువైపోతుంది. యాప్స్ ఇన్​స్టాల్ చేసినప్పుడే నోటిఫికేషన్లను ఆఫ్ చేసేయండి.

3. ఫోన్​లో అలారం పెట్టొద్దు
ఫోన్​లో అలారం పెట్టడం వల్ల ఉదయం లేవగానే సోషల్ మీడియా యాప్స్ వంటివి చూస్తూ ఉండిపోతారు. దీంతో ఫోన్ వినియోగం వేకువజామున నుంచే మొదలైపోతుంది. అందుకే అలారం వేరే పరికరంలో పెట్టుకోండి. దాదాపుగా మీ బెడ్ రూమ్​లో ఫోన్ పెట్టడం మానేయడం మంచిది. ఎందుకంటే సెల్ ఫోన్ స్క్రీన్‌ నుంచి వచ్చే కాంతి మీకు నిద్రాభంగాన్ని కూడా కలిగించవచ్చు.

4. మెసేజ్​లకు రిప్లై కోసం టైమ్ పెట్టుకోండి.
అలాగే ఫేస్ బుక్, వాట్సాప్ సహా కొన్ని సోషల్ మీడియా యాప్స్, ఉద్యోగ సంబంధ ఈ- మెయిల్ మెసేజ్​లకు రిప్లై ఇవ్వడానికి రోజులో ఏదో ఒక నిర్దిష్ట సమయాన్ని కేటాయించండి. లేదంటే రోజంతా ఫోన్​లో వచ్చే మెసేజ్​లకు రిప్లై ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఫోన్ వినియోగం మరింత పెరిగిపోయింది. ముఖ్యమైన మెసేజ్​లు అయితే మాత్రం వెంటనే రిప్లై ఇవ్వాల్సి ఉండొచ్చు.

5. ప్రతి రోజు కొంత సమయం ఫోన్​ను ఆఫ్ చేయండి
ప్రతి రోజు కొన్ని గంటలపాటు మీ ఫోన్​ను ఆఫ్ చేయండి. మధ్యాహ్నం నిద్రపోయే ముందు, భోజనం చేసేటప్పుడు ఇలాంటి సమయాల్లో ఫోన్ ఆఫ్​లో ఉంచండి. ఈ టిప్ కూడా మీ ఫోన్ వినియోగాన్ని కొంత మేర తగ్గిస్తుంది.

6. ఫోన్​కు ఛార్జింగ్​ ఇలా పెట్టండి!
మీకు దూరంలో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోండి. లేదంటే మీ పక్కనే ఫోన్​కు ఛార్జింగ్ పెడితే మాటిమాటికీ తీసి దాన్ని వాడుతుంటారు. లేదంటే ఛార్జ్ చేస్తూనే ఫోన్ వాడేస్తుంటారు చాలా మంది. అందుకే ఫోన్ వినియోగం తగ్గాలంటే మీరు ఈ ట్రిక్​ను పాటించండి.

7. మానసికంగా సిద్ధపడండి
ఫోన్ వాడకుండా ఉండడానికి మానసికంగా సిద్ధపడండి. నేను ఫోన్ వాడకుండా ఉండగలను అని మనసులో గట్టిగా అనుకోండి. దీంతో మీరు ఫోన్ లేకపోయినా కాసేపు ఉండగలరు. దీంతో ఫోన్ వాడకం టైమ్ కాస్తయినా తగ్గుతుంది.

8. ఇలా మనసులో అనుకోండి.
చాలా మంది సోషల్ మీడియాలో ముఖ్యమైన వార్తలు, అప్​డేట్స్​ను కోల్పోతామనే ఆందోళనతో నిత్యం ఫోన్​ను వదలరు. ఆ అప్​డేట్స్​ను గంట లేదా రెండు గంటలు తర్వాత చూసినా నష్టమేమి లేదని మనసులో బలంగా నమ్మండి. అప్పుడు వెంట వెంటనే ఫోన్ వాడకుండా ఉంటారు.

9. సోషల్ మీడియా వాడకాన్ని తగ్గించండి
సోషల్ మీడియా వాడకం వల్ల చాలా మంది ఫోన్ కు అడిక్ట్​ అవుతుంటారు. అందుకే సోషల్ మీడియా వాడకాన్ని క్రమక్రమంగా తగ్గించుకోండి. మీ ఇష్టాలపై దృష్టిపెట్టండి.

10. పిల్లల విషయంలో జాగ్రత్త సుమా
మీ పిల్లలు ఫోన్​కు అడిక్ట్​ అవ్వకుండా జాగ్రత్త పడండి. కొన్ని యాప్​లను వాడి మీ పిల్లలు ఏ యాప్​ను​ ఎక్కువగా యూజ్ చేస్తున్నారో తెలుసుకుని వారు పక్కదారి పట్టకుండా చూసుకోండి. ఫోన్​ను ఎంత సేపు వాడాలో వారికి తెలియజేయండి.

11. కొన్ని రూల్స్​ పెట్టుకోండి
ఫోన్ వినియోగం గురించి కొన్ని రూల్స్ పెట్టుకోండి. ఉదాహారణకు కుటుంబంలోని ప్రతి ఒక్కరూ సాయంత్రం 7 గంటల నుంచి తమ ఫోన్స్​ను స్విచ్ఛాప్ లేదా పక్కకు పెట్టాలనే నియమాన్ని పెట్టండి. ఇలా చేయడం వల్ల ఫోన్ వినియోగం తగ్గుతుంది.

12. స్టూడెంట్స్ విషయంలో ఇలా చేయండి!
మీ అబ్బాయి లేదా అమ్మాయి స్కూల్​కు ఫోన్​ను తీసుకెళితే వారి ప్రిన్సిపల్​కు తెలియజేయండి. అప్పుడు మీ పిల్లలు స్కూల్, కాలేజీకి ఫోన్​ను తీసుకెళ్లకుండా ఉంటారు. అలాగే మీ టీనేజ్ పిల్లలను సోషల్ మీడియా యాప్స్​లో అభ్యంతర పోస్టులను చెయ్యనివ్వకండి. ఇలాంటి పోస్ట్​లు పెడితే తర్వాత జరిగే పర్యావసానాలను తెలియజేయండి.

ఇండియాలో గూగుల్ జెమినీ యాప్ లాంఛ్​​ - తెలుగు సహా 10 భాషలకు సపోర్ట్ - డౌన్​లోడ్ చేసుకోండిలా! - Google Gemini Android App

ఫోన్ యూజర్స్​ అందరికీ ఉపయోగపడే​ - ఈ టాప్ 8​ టిప్స్ & ట్రిక్స్ ఇవే! - Useful Phone Tricks

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.