How To Check Laptop Battery Health : ప్రస్తుత సాంకేతిక యుగంలో ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు లేకుండా ఏ ఆఫీసులోనూ, ఇంటిలోనూ పనులు పూర్తి కావడం లేదు. దీంతో ల్యాప్‌టాప్‌ల వినియోగం బాగా పెరిగింది. అయితే ల్యాప్‌టాప్ బాగా పనిచేయాలంటే, దాని బ్యాటరీ లైఫ్ బాగుండాలి. లేకుంటే ల్యాప్‌టాప్ పనితీరు బాగా దెబ్బతింటుంది. అందుకే ల్యాప్‌టాప్ బ్యాటరీ హెల్త్‌ను ఎలా చెక్ చేసుకోవాలో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
Laptop Battery Health Check In Windows 11 : విండోస్ 11లో 'విండోస్ టెర్మినల్' ద్వారా ల్యాప్‌టాప్ బ్యాటరీ హెల్త్‌ను చెక్ చేసుకోవచ్చు. ఈ పద్ధతి టెక్నికల్‌గా కొంచెం సంక్లిష్టమైనది. అయినపట్టికీ ఇది చాలా విశ్వసనీయమైన పద్ధతి.
- ముందుగా మీరు విండోస్ 11 టాస్క్‌బార్‌లో - స్టార్ట్ బటన్‌పై రైట్ క్లిక్ ఇచ్చి, టెర్మినల్ (అడ్మిన్) ఎంచుకోండి.
- ఆ తర్వాత powercfg /batteryreport /output "C:\battery-report.html" కోడ్‌ను టైప్ చేసి, ఎంటర్ బటన్‌పై క్లిక్ చేయండి.
- తరువాత ఫైల్ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసి, సైడ్ బార్లో పీసీపై క్లిక్ చేసి, లోకల్ 'డిస్క్-సీ'ను ఎంచుకోండి.
- అక్కడ మీకు Battery-report.html ఫైల్ కనిపిస్తుంది.
- మీరు ఆ ఫైల్‌పై డబుల్ క్లిక్ ఇస్తే, అది ఓపెన్ అవుతుంది. దానిలో మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ హెల్త్‌కు సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి.
- బ్యాటరీ హెల్త్ రిపోర్ట్‌లో, ముందుగా మీ పీసీ గురించిన వివరాలు ఉంటాయి. దానిలో బ్యాటరీ గురించిన పూర్తి సమాచారం కూడా ఉంటుంది.
- బ్యాటరీ ఎన్నిసార్లు ఛార్జ్ అయ్యింది. 100 శాతం నుంచి 0 శాతానికి ఎన్నిసార్లు డిస్ఛార్జ్ అయ్యింది. మరలా ఎన్నిసార్లు ఫుల్ ఛార్జ్ అయ్యింది - అనే వివరాలు దానిలో స్పష్టంగా ఉంటాయి.
- ల్యాప్‌టాప్ ఎక్కువగా డిస్ఛార్జ్ అవుతూ ఉంటే, బ్యాటరీ హెల్త్ బాగాలేదని మనం అర్థం చేసుకోవచ్చు.
- రిపోర్ట్‌లో బ్యాటరీ కెపాసిటీ హిస్టరీ కూడా ఉంటుంది. మీరు ల్యాప్‌టాప్‌లో చేస్తున్న వర్క్, బ్యాటరీ హెల్త్‌ను ఏ మేరకు ప్రభావితం చేస్తోందో దీని వల్ల తెలుసుకోవచ్చు.
- ప్రతి బ్యాటరీకి డిజైన్ కెపాసిటీ, ఫుల్ ఛార్జ్ కెపాసిటీ ఉంటాయి. డిజైన్ కెపాసిటీ అంటే బ్యాటరీ పూర్తి సామర్థ్యం. ప్రస్తుతం మీ బ్యాటరీ ఎంత వరకు ఛార్జ్ కాగలదు అనేది ఫుల్ ఛార్జ్ కెపాసిటీ తెలియజేస్తుంది. వీటి సామర్థ్యం కనుక తగ్గితే మీరు బ్యాటరీని రిపేర్ లేదా రీప్లేస్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా విండోస్ 11లో ల్యాప్‌టాప్ బ్యాటరీ హెల్త్ చేసుకోవచ్చు.
Laptop Battery Health Check In Windows 10 : విండోస్ 11లో టెర్మినల్ ఓపెన్ చేస్తాం. అదే విండోస్ 10లో అయితే పవర్షెల్ను ఓపెన్ చేస్తాం. అంతే తేడా. మిగతా ప్రాసెస్ అంతా ఒకేలా ఉంటుంది.
- ముందుగా మీరు స్టార్ట్ బటన్‌పై రైట్ క్లిస్ చేసి, పవర్షెల్ను ఎంచుకోవాలి.
- తరువాత వచ్చే ప్రాంఫ్ట్స్ అన్నింటికీ yes అని క్లిక్ చేయాలి.
- అప్పుడు నీలిరంగులో పవర్‌షెల్ విండో కనిపిస్తుంది.
- మీరు powercfg /batteryreport /output "C:\battery-report.html" ఈ కోడ్ టైప్ చేసి ఎంటర్ నొక్కండి.
- తరువాత ఫైల్ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసి, సైడ్ బార్లో పీసీపై క్లిక్ చేసి, లోకల్ డిస్క్-సీను ఎంచుకోవాలి.
- అక్కడ మీకు Battery-report.html ఫైల్ కనిపిస్తుంది. అంతే సింపుల్!
How To Check Laptop Battery Health Using 'Pure Battery Analytics'
మీకు పైన చెప్పిన పద్ధతులు ఇబ్బందిగా అనిపిస్తే, 'ప్యూర్ బ్యాటరీ అనలిటిక్స్' యాప్ ఉపయోగించి కూడా మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ హెల్త్‌ను చెక్ చేసుకోవచ్చు. ఎలా అంటే?
- ముందుగా మీరు మైక్రోసాఫ్ట్ స్టోర్ నుంచి 'ప్యూర్ బ్యాటరీ అనలిటిక్స్' యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి.
- సిస్టమ్‌లో దానిని ఇన్స్టాల్ చేసి, లాంఛ్ చేయాలి. అంతే సింపుల్!
- 'క్విక్ వ్యూ'పై క్లిక్ చేస్తే, మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ డిజైన్ కెపాసిటీ, ఫుల్ ఛార్జ్ కెపాసిటీ కనిపిస్తాయి.
- ఒక వేళ 'ఫుల్ ఛార్జ్ కెపాసిటీ' బాగా తక్కువగా ఉంటే, మీ బ్యాటరీ హెల్త్ బాగాలేదని అర్థం చేసుకోవాలి.
- మీరు అనలెటిక్స్ సెక్షన్లోకి వెళితే, మీ సిస్టమ్ బ్యాటరీని ఎలా ఉపయోగిస్తోందనేది తెలుసుకోవచ్చు.
- ఈ విధంగా ప్యూర్ బ్యాటరీ అనలిటిక్స్ యాప్ ద్వారా మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ హెల్త్‌ను సింపుల్‌గా చెక్ చేసుకోవచ్చు.
మీ ఫోన్ పోయిందా? డోంట్ వర్రీ - ఇకపై మీరే దాన్ని బ్లాక్ చేయవచ్చు! - How To Block Stolen Phone