Android Smartphones Hidden Features: ప్రస్తుతం చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి వద్దా స్మార్ట్‌ఫోన్ ఉంటోంది. అయితే కొంతమంది వాటిని కేవలం కాల్స్, మెసెజెస్ కోసం మాత్రమే వినియోగిస్తుంటారు. మరికొందరు అయితే యూట్యూబ్ వీడియోస్, ఇన్‌స్టా రీల్స్ వరకు మాత్రమే పరిమితం. కానీ ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో మనకు తెలియని ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.
స్పామ్ టెక్స్ట్‌లను బ్లాక్ చేయటం: ప్రస్తుతం టెలికాం యూజర్లను స్పామ్ కాల్స్, మెసేజ్‌ల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. అయితే ఆండ్రాయిడ్ మొబైల్స్‌లో ఉండే ఈ ఫీచర్‌తో స్పామ్ కాల్స్, మెసెజెస్ రాకుండా బ్లాక్ చేసుకోవచ్చు. ఇందుకోసం మెసెజెస్ యాప్ ఓపెన్ చేసి మూడు డాట్స్ ఐకాన్‌ను ట్యాప్ చేసి సెట్టింగ్స్‌ను ప్రెస్ చేయండి. ఆ తర్వాత Spam Protectionను సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు Enable Spam Protection ఆప్షన్‌ను ఆన్ చేసుకుంటే మీ సెట్టింగ్ పూర్తవుతుంది.
వైఫై పాస్‌వర్డ్ షేర్ చేయకుండానే: ఎవరికైనా మనం Wi-Fi షేర్ చేయాల్సి వస్తే పాస్‌వర్డ్ చెప్పాలి. లేకుంటే వారి మొబైల్‌ను తీసుకుని మనం అయినా ఎంటర్ చేయాల్సి వస్తుంది. పాస్‌వర్డ్ వేరే వారితో షేర్ చేసుకోవాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అయితే అలాంటి సమయంలో QR కోడ్ స్కాన్ చేస్తే చాలు పాస్‌వర్డ్‌తో పనిలేదు. ఇందుకోసం సెట్టింగ్స్‌లో Connections > Wi-Fi > Current Network > QR code option మీద క్లిక్ చేయగానే మీ Wi-Fi తాలూగా QR కోడ్ కనిపిస్తుంది. పాస్‌వర్డ్ ఇవ్వాల్సిన సమయంలో వారి మొబైల్ నుంచి కోడ్‌ని స్కాన్ చేస్తే చాలు. అయితే ఈ ఆప్షన్ ఒక్కో మొబైల్లో ఒక్కోలా ఉంటుంది. చాలా వరకు స్మార్ట్ఫోన్లలో ఈ ఫెసిలిటీ ఉంది.
స్మార్ట్ లాక్: మీ ఫోన్‌ను లాక్ చేయడం అనేది ఒక ముఖ్యమైన భద్రతా ప్రమాణం. అయితే విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు ఇది మీకు తలనొప్పిగా మారే అవకాశం ఉంది. అలాంటి సమయంలో మీరు సురక్షితంగా భావించే ప్రదేశాల్లో మీ లాక్ స్క్రీన్‌ను డిసేబుల్ చేసేయొచ్చు. ఆండ్రాయిడ్‌లో ఉన్న ఈ ఫెసిలిటీతో మీరు మొబైల్‌ను ఈజీగా ఓపెన్ చేయొచ్చు. ఈ ఫీచర్ గూగుల్ మ్యాప్స్‌తో పనిచేస్తుంది. కాబట్టి మీకు ఖచ్చితంగా ఆ ప్రదేశంలో ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం.
ఇందుకోసం మీరు మొదటగా Settings ఓపెన్ చేసి పాస్‌వర్డ్ అండ్ సెక్యూరిటీ ట్యాప్ చేసి ఆపై సిస్టమ్ సెక్యూరిటీని ట్యాప్ చేయండి. అనంతరం Smart Lock ఆప్షన్‌పై ప్రెస్ చేసి ఆపై విశ్వసనీయ స్థలాలను టాప్ చేయండి. ఇప్పుడు Add trusted placesపై క్లిక్ చేసి మీరు సురక్షితంగా భావించే ప్రదేశాలను సెలక్ట్ చేసుకోండి.
టెక్ట్స్ ట్రాన్స్‌లేషన్: మనం ఏదైనా ఆర్టికల్ చదువుతున్న సమయంలో కొన్ని పదాలు మనకు అర్థంకావు. అలాంటి సందర్భాల్లో వాటిని ట్రాన్స్‌లేట్ చేయాలంటే టెక్ట్స్‌ని కాపీ చేసి ట్రాన్స్‌లేటర్‌లో వేస్తుంటాం. లేదంటే గూగుల్ సెర్చ్ చేస్తుంటాం. అయితే ఆ అవసరం లేకుండానే స్క్రిప్ట్‌ని మీకు నచ్చిన భాషలోకి ట్రాన్స్‌లేట్ చేసుకునే ఫెసిలిటీని గూగుల్ అందిస్తోంది. మీకు కావాల్సిన టెక్ట్స్‌ను సెలెక్ట్ చేసుకుని పాప్-అప్ మెనూలోనే మీకు కావాల్సిన భాషలోకి ఈజీగా ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. అయితే ఈ ఫీచర్‌ను మొదటిసారి యూజ్ చేసే వాళ్లు లాంగ్వేజ్ ప్యాక్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్ పేజీ, థర్డ్ పార్టీ యాప్స్‌లోనూ ఈ ఫీచర్ పనిచేస్తుంది.
రెండేసి వాట్సప్‌లు, ఇన్‌స్టాలు: రెండు వాట్సప్ అకౌంట్స్ వాడటం కోసం కొందరు ఒక సాధారణ యాప్, మరొక బిజినెస్ వాట్సప్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటూ ఉంటారు. కొందరైతే వీటికోసం ఇంకో ఫోన్ కూడా వాడుతుంటారు. అలాంటి వాళ్ల కోసం ఆండ్రాయిడ్ ఫోన్లలో క్లోన్ సదుపాయం ఉంది. ఈ క్లోన్ సదుపాయంతో ఎంచక్కా రెండేసి వాట్సప్‌లు, ఇన్‌స్టా అకౌంట్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇందుకోసం సెట్టింగ్స్‌లోని యాప్స్ అనే ఆప్షన్‌లోకి వెళ్తే క్లోన్ ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ ఒక్క క్లిక్‌తో దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా ఒక్కో ఫోన్‌లో ఒక్కోలా ఉంటుంది. క్లోన్, డ్యూయల్ అనే పేర్లతో ఈ సర్వీస్ అందుబాటులో ఉంటుంది.
కొత్త ప్రదేశానికి వెళ్తున్నారా?- ఈ యాప్‌తో మీ ప్రయాణం చాలా ఈజీ బాస్..!
అంతుచిక్కని రైలు ప్రమాదాలు- మానవ తప్పిదమా?- లేకుంటే టెక్నాలజీ లోపమా?