ETV Bharat / technology

గూగుల్ అప్​కమింగ్​ ఫీచర్​ - దొంగ ఫోన్ స్విఛ్ ఆఫ్ చేసినా - ఈజీగా కనిపెట్టేయవచ్చిలా! - Google Find My Device Network - GOOGLE FIND MY DEVICE NETWORK

Google To Launch Find My Device Network For Android : ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్​ న్యూస్. గూగుల్ కంపెనీ 'ఫైండ్​ మై డివైజ్​ నెట్​వర్క్​​'ను ఏప్రిల్​ 7న లాంఛ్ చేయనుంది. దీనిని ఉపయోగించి, ఇకపై మీ ఫోన్ పోయినా, దొంగలు దానిని స్విఛ్​ ఆఫ్​ చేసినా? చాలా సులువుగా కనిపెట్టేయవచ్చు. అది ఎలా అంటే?

Google Find My Device Network Launch
Google To Launch Find My Device Network For Android
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 6, 2024, 5:06 PM IST

Google To Launch Find My Device Network For Android : గూగుల్ కంపెనీ ఏప్రిల్​ 7న 'ఫైండ్ మై డివైజ్ నెట్​వర్క్​'ను లాంఛ్ చేయనుంది. దీనితో మీరు పోగొట్టుకున్న ఫోన్​ను చాలా సులువుగా కనిపెట్టేయవచ్చు. దొంగ మీ ఫోన్​ను స్విఛ్ ఆఫ్ చేసినా సరే దానిని ట్రాక్ చేసేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

ఎలా పనిచేస్తుందంటే?
ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4 బిలియన్ల మంది ఆండ్రాయిడ్ యూజర్లు ఉన్నారు. వీరందరికీ గూగుల్ ఫైండ్ మై డివైజ్ నెట్​వర్క్​ అందుబాటులోకి వస్తుంది. కనుక వాళ్లు ఫోన్ పోయినా, వాటిని దొంగలు స్విఛ్ ఆఫ్ చేసినా, చాలా సులువుగా కనిపెట్టేయవచ్చు.

ఒకవేళ మీ డివైజ్​లోని బ్యాటరీ పూర్తిగా ఛార్జింగ్ కోల్పోతే, దాని చివరి లొకేషన్​ను తెలియజేస్తుంది. ఈ ఫీచర్ ఉపయోగించి, ఆండ్రాయిడ్ ఫోన్స్, ట్యాబ్లెట్స్​ మాత్రమే కాదు. దానితో పెయిర్ చేసిన ఇయర్​బడ్స్, హెడ్​ఫోన్స్​ను కూడా ట్రాక్ చేసుకోవచ్చు. అంతేకాదు ఆండ్రాయిడ్​ ఫోన్​తో లింక్​ చేసి ఉన్న వాలెట్స్​, కీస్​, బైక్​లను కూడా సులువుగా కనిపెట్టేయవచ్చు.

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం
వాస్తవానికి ఇప్పుడున్న గూగుల్ Find My Device App ఉపయోగించి, మీరు పోగొట్టుకున్న ఆండ్రాయిడ్​ ఫోన్​లను ట్రాక్ చేసుకోవచ్చు. కానీ ఎవరైనా ఆ ఫోన్​ను స్విఛ్ ఆఫ్ చేస్తే, ఇక దానిని కనిపెట్టడం వీలుకాదు. అందుకే ఈ సమస్యను పరిష్కరించడానికి గూగుల్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం 'ఫైండ్ మై డివైజ్ నెట్​వర్క్​'ను ఏప్రిల్ 7న లాంఛ్ చేయనుంది. వాస్తవానికి I/O 2023 ఈవెంట్​లోనే గూగుల్ ఈ 'ఫైండ్ మై డివైజ్​ నెట్​వర్క్'​ను ప్రదర్శించింది. కానీ దీని కంటే ముందు సేమ్ ఫీచర్స్​తో యాపిల్ కంపెనీ 'యాంటీ-స్టాకింగ్' ఫీచర్​ను లాంఛ్ చేసేసింది.

దుర్వినియోగం చేసే ప్రమాదం ఉంది!
యాపిల్ కంపెనీ 2019లో మొదటిసారిగా ఎయిర్​ట్యాగ్​ను ప్రారంభించింది. అప్పుడు కొంత మంది వ్యక్తులు ఈ బ్లూటూత్ బేస్డ్​ ట్రాకర్​ను చట్టవిరుద్ధంగా, ఇతరులను ట్రాక్​ చేయడానికి ఉపయోగించారు. దీనితో యాపిల్ కంపెనీ, తమ యూజర్ల కోసం ప్రత్యేకంగా ఒక అలర్ట్ ఫీచర్​ను తీసుకువచ్చింది. దీని వల్ల ఏవరైనా తెలియని వ్యక్తులు ఐఫోన్ యూజర్లను అక్రమంగా ట్రాక్ చేస్తుంటే, వెంటనే అలర్ట్ వస్తుంది. కానీ ఈ ఫీచర్​ను కేవలం ఐఫోన్, ఐప్యాడ్​లకు మాత్రమే పరిమితం అయ్యింది. కానీ తరువాత బ్లూటూత్ ఆధారిత ట్రాకర్​ను గుర్తించి, వాటిని తొలగించడానికి యూనివర్సల్ మెకానిజంతో ముందుకు రావడానికి యాపిల్ కంపెనీ గూగుల్​తో జతకట్టింది. శాంసంగ్​, టెలీ, చిపోలో, యూఫీ సెక్యూరిటీ, పెబ్బెల్​బీ లాంటి ఇతర బ్రాండ్​లు కూడా ఈ డ్రాఫ్ట్​ స్పెసిఫికేషన్​కు మద్దతునిచ్చాయి. దీనితో ఈ బ్రాండెడ్ డివైజ్​లు ఉపయోగించే వినియోగదారులు అందరూ, తమను అనుసరించే ట్రాకర్ల గురించి అలర్ట్​లు పొందే వీలు ఏర్పడింది.

ఈ నెలాఖరున యాపిల్ కంపెనీ ఐఓఎస్​ 17.5 అప్​డేట్​లో ఓ సరికొత్త యాంటీ-స్టాకింగ్ ఫీచర్​ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. దీనితో గూగుల్ కంపెనీ (ఏప్రిల్​ 7న) అదే సామర్థ్యం కలిగిన కొత్త ఫైండ్​ మై డివైజ్ నెట్​వర్క్ యాప్​ను తీసుకువస్తోంది.

ఆఫీస్ ఫోన్​/ కంప్యూటర్స్ వాడుతున్నారా? ఈ 15 పనులు అస్సలు చేయకండి! - Dos and Donts on Office Laptop

X యూజర్స్​కు గుడ్ న్యూస్​ - ఇకపై వారికి 'బ్లూ టిక్' ఫ్రీ ఫ్రీ ఫ్రీ! - Twitter Gives Blue tick for free

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.