ETV Bharat / technology

మీ ఫోన్ చోరీకి గురైందా?- వెంటనే ఇలా స్క్రీన్​ లాక్ చేసేయండి.. అన్నీ సేఫ్..! - Google Theft Protection Feature - GOOGLE THEFT PROTECTION FEATURE

Google Theft Protection Feature: ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం గూగుల్ కొత్త సేఫ్టీ ఫీచర్​ను తీసుకొచ్చింది. ఇది మీ స్మార్ట్​ఫోన్ చోరీకి గురైతే ఆటోమెటిక్​గా స్క్రీన్​ను లాక్ చేసేస్తుంది.

Google Theft Protection Feature
Google Theft Protection Feature (Google)
author img

By ETV Bharat Tech Team

Published : Oct 7, 2024, 3:56 PM IST

Google Theft Protection Feature: ఫోన్ చోరీకి గురైతే వ్యక్తిగత డేటా దొంగిలించే ప్రమాదం ఉంది. మన ముఖ్యమైన విషయాలు చాలా వరకు ఫోన్‌లోనే ఉంటున్నాయి. దీంతో మొబైల్ ఫోన్ పోయినట్లయితే మన వ్యక్తిగత సమాచారం కూడా దొంగిలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫోన్ చోరీకి గురైన సందర్భాల్లో ఈ రకమైన ప్రమాదం జరగొచ్చు. దీన్ని నివారించేందుకు గూగుల్.. తెఫ్ట్ ప్రొటెక్షన్ కింద 3 కొత్త భద్రతా ఫీచర్లను విడుదల చేసింది. ఇవి చోరీకి గురైన సందర్భాల్లో ఫోన్ స్క్రీన్​ను ఆటోమేటిక్​గా లాక్ చేసేస్తాయి. ఈ ఫీచర్‌లు ఆండ్రాయిడ్ 10, ఆ తర్వాతి వెర్షన్‌లతో కూడిన ఆండ్రాయిడ్ ఫోన్‌లలో పని చేస్తాయి.

తెఫ్ట్ ప్రొటెక్షన్: Google తీసుకొచ్చిన ఈ తెఫ్ట్ ప్రొటెక్షన్ ఫీచర్స్​ను పరిచయం చేయడం ప్రారంభించింది. ప్లే సర్వీస్ ద్వారా కంపెనీ ఈ విషయాలను ముందుకు తీసుకువస్తోంది. ఈ ఫీచర్లను ఉపయోగించాలనుకుంటే గూగుల్ సెట్టింగ్స్​లోకి వెళ్లి తెఫ్ట్ ప్రొటెక్షన్ ఫీచర్​ అని సెర్చ్ చేయాలి. ఇది కాకుండా Google సర్వీస్ పేజీకి వెళ్లడం ద్వారా కూడా ఈ ఫీచర్​ను పొందొచ్చు. ఈ ఏడాది మేలో జరిగిన Google I/O 2024 ఈవెంట్‌లో ఈ ఫీచర్లను ఇంట్రడ్యూస్ చేశారు.

ఆండ్రాయిడ్ థెఫ్ట్ ప్రొటెక్షన్ ఫీచర్స్ ఇవే:

న్యూ స్మార్ట్ ఫీచర్: మీ ఫోన్ చోరీకి గురైనప్పుడు ఈ థెఫ్ట్ ప్రొటెక్షన్ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఇది మీ మొబైల్​ చోరీకి గురైనట్లు గుర్తిస్తే Google AIని ఉపయోగించి ఆటోమెటిక్​గా మీ ఫోన్ స్క్రీన్‌ను లాక్ చేసేస్తుంది. దీంతో దొంగలు మీ స్మార్ట్​ఫోన్​లోని డేటాను యాక్సెస్ చేయలేరు.

ఆఫ్‌లైన్ డివైజ్ లాక్: పైన చెప్పిన తెఫ్ట్ లాక్ ఫీచర్ దొంగతనాన్ని గుర్తించడంలో విఫలమైతే ఆఫ్‌లైన్ డివైజ్ లాక్, రిమోట్ లాక్ ఫీచర్స్ ఉపయోగపడతాయి. దొంగిలించిన మీ మొబైల్​ను చాలా కాలం పాటు డిస్​కనెక్ట్ చేసేందుకు దొంగలు ప్రయత్నిస్తే మీ మొబైల్​ ఇంటర్నెట్ ఆఫ్​ చేసి ఉన్నప్పుడు కూడా ఈ ఆఫ్​లైన్ డివైజ్ లాక్ ఫీచర్ ఆటోమేటిక్​గా స్క్రీన్​ను లాక్ చేసేస్తుంది.

రిమోట్ లాక్: రిమోట్ లాక్ ఫీచర్ చోరీకి గురైన మీ మొబైల్​ ఫోన్​ స్క్రీన్​ను వేరే డివైజ్​తో లాక్ చేసేందుకు ఉపయోగపడుతుంది. ఫోన్ చోరీకి గురైతే android.com/lock లింక్‌ను యాక్సెస్ చేయడానికి ఇది అనుమతిస్తుంది. దీని కోసం సెటప్ సమయంలో ఫోన్ నంబర్‌ను అందించాలి.

మీరు ఫోన్ నంబర్, సెక్యూరిటీ ఛాలెంజ్‌తో ఈ ఫీచర్‌ని ఉపయోగించగలరు. ఈ ఫీచర్‌తో పోగొట్టుకున్న మీ ఫోన్​ను విశ్వసనీయ వ్యక్తి ఫోన్‌తో లాక్ చేయవచ్చు. మీ అకౌంట్ డిటెయిల్స్ రికవర్ చేసేందుకు, ఫైండ్ మై డివైజ్ వంటి ఫీచర్లను యాక్సెస్ చేసేందుకు ఇది మీకు సమయాన్ని ఇస్తుందని గూగుల్ చెబుతోంది.

ఒకవేళ దొంగ మీ ఫోన్‌ను రిమోట్‌గా లాక్ చేయడానికి ముందు ఫైండ్ మై డివైజ్​ని నిలిపివేయడానికి లేదా స్క్రీన్ గడువును పెంచడానికి ప్రయత్నిస్తే ఈ సెట్టింగ్స్​ను మార్చేందుకు వారు మీ ఫోన్ పిన్, పాస్‌వర్డ్ లేదా బయోమెట్రిక్ అథెంటికేషన్​ను ఎంటర్​ చేయాల్సి ఉంటుంది.

ఆండ్రాయిడ్ ఫ్యాక్టరీ రీసెట్ ప్రొటెక్షన్​ను అప్​గ్రేడ్ చేయడంతో దొంగిలించిన డివైజ్​ను రీసెట్ చేయడాన్ని గూగుల్ మరింత కష్టతరం చేస్తోంది. దొంగిలించిన మీ మొబైల్​ను రీసెట్ చేసేందుకు దొంగలు ప్రయత్నిస్తే వారి గూగుల్ అకౌంట్ ఆధారాలు తెలియకుండా దాన్ని రీసెట్ చేయలేరు. దీంతో మీ ఫోన్​ను వేరే వ్యక్తులకు అమ్మేయటం సాధ్యం కాదు.

గూగుల్ ఈ ఫీచర్లను బ్రెజిల్‌లో పరీక్షించడం ప్రారంభించింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిక్సెల్, శాంసంగ్ మొదలైన ఆండ్రాయిడ్ యూజర్స్ ఈ సౌకర్యాలను పొందొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్ మీ ఫోన్‌లో అందుబాటులో లేకుంటే మీరు కొంత సమయం వేచి ఉండాలి. ఎందుకంటే ఈ ఫీచర్​ను ఇంకా పూర్తిగా అందుబాటులోకి తీసుకురాలేదు.

కామో థీమ్​తో టాటా పంచ్ నయా ఎడిషన్- ప్రీమియం ఫీచర్స్​తో బడ్జెట్ ధరలో లాంచ్ - Tata Punch Camo Edition Launch

పండగ వేళ ఆన్​లైన్ సేల్స్ జోరు- వారంలోనే రూ.54వేల కోట్ల ఆర్డర్స్​ - Festive Season Online Sales

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.