Google Free Online AI Courses : ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ కంపెనీ గూగుల్ విద్యార్థుల కోసం, ప్రొఫెషనల్స్ కోసం పూర్తి ఉచితంగా 'ఏఐ ఆన్లైన్ కోర్సు'లను అందిస్తోంది. వాస్తవానికి ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోర్సులను ఆసక్తి ఉన్న ఎవరైనా ఫ్రీగా నేర్చుకోవచ్చు. మీ స్కిల్స్‌ను అప్‌గ్రేడ్ చేసుకుని, నూతన ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు.
మరి మీరు కూడా ఈ ఏఐ ఆన్లైన్ కోర్సులు చేయాలని అనుకుంటున్నారా? అయితే మరెందుకు ఆలస్యం, గూగుల్ అందిస్తున్న ఫ్రీ ఏఐ కోర్సుల వివరాలు గురించి తెలుసుకుందాం రండి.
- Introduction To Large Language Models : ఈ కోర్స్ 'లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్' (LLMs) గురించి తెలుపుతుంది. ఈ ఎల్‌ఎల్‌ఎమ్స్ ఉపయోగం ఏమిటి? దీనిని ఎలాంటి సందర్భాల్లో వాడాలి? ప్రాంప్ట్ ట్యూనింగ్ ఎలా చేయాలి? అనే విషయాలను ఈ కోర్సులో నేర్పుతారు.
- Introduction To Responsible AI : ఈ కోర్స్‌లో రెస్పాన్సిబుల్ ఏఐ కాన్సెప్ట్ గురించి, దాని ప్రాముఖ్యత గురించి వివరిస్తారు. గూగుల్ తమ ప్రొడక్టుల్లో ఈ 'రెస్పాన్సిబుల్ ఏఐ' టెక్నాలజీని ఏ విధంగా అమలు చేస్తోందో కూడా వివరిస్తారు.
- Generative AI Fundamentals : ఈ కోర్స్ ద్వారా జనరేటివ్ ఏఐ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, రెస్పాన్సిబుల్ ఏఐ టెక్నాలజీలను సులువుగా నేర్చుకోవచ్చు.
- Introduction To Image Generation : ఈ కోర్సులో థియరీతోపాటు ఇమేజ్ జనరేషన్ గురించి నేర్పిస్తారు. వెర్టెక్స్ ఏఐ ట్రైనింగ్, డిప్లాయిమెంట్ గురించి వివరిస్తారు.
- Encoder - Decoder Architecture : ఈ కోర్సులో 'మెషీన్ లెర్నింగ్ ఆర్కిటెక్చర్'ను నేర్పిస్తారు. దీనిని ఉపయోగించి సీక్వెన్స్-టు-సీక్వెన్స్ టాస్క్‌లు ఎలా పూర్తి చేయాలి? ముఖ్యంగా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం, ఇచ్చిన పూర్తి సమాచారానికి సారాంశం చెప్పడం, ఒక భాషలోని టెక్ట్స్‌ను మరోభాషలోకి అనువాదం చేయడం లాంటి టాస్క్‌లను ఎలా పూర్తి చేయాలో నేర్పిస్తారు.
- Attention Mechanism : ఇన్పుట్ సీక్వెన్స్‌లోని నిర్దిష్ట భాగాలపై ఫోకస్ చేసేందుకు న్యూరల్ నెట్‌వర్క్‌ను ఏ విధంగా ఎనేబుల్ చేయాలి? అనే టెక్నిక్లను ఈ కోర్సు ద్వారా నేర్చుకోవచ్చు.
- Create Image Captioning Models : ఈ కొత్త కోర్సులో ఇమేజ్ క్యాప్షనింగ్ మోడల్స్ గురించి, ఎన్కోడర్-డీకోడర్ ఆర్కిటెక్చర్ గురించి బోధిస్తారు.
- Introduction To Generative AI Studio : ఈ కోర్సులో జనరేటివ్ ఏఐ స్టూడియో గురించిన ప్రాథమిక అంశాలను వివరిస్తారు. దీనిని ఉపయోగించి మీ అప్లికేషన్ల కోసం కస్టమైజ్డ్ జనరేటివ్ ఏఐ మోడల్స్‌ను రూపొందించుకోవచ్చు. అలాగే ప్రోటోటైప్ మోడల్స్‌ను కూడా క్రియేట్ చేసుకోవచ్చు.
నేటి కాలంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే మార్కెట్లో టెక్ ఉద్యోగ అవకాశాలు విపరీతంగా పెరుగుతున్నాయి. కనుక ఆసక్తి ఉన్న వారు గూగుల్ అందిస్తున్న ఈ ఫ్రీ ఆన్లైన్ ఏఐ కోర్సులు చేయడం మంచిది.
గూగుల్‌లో బెస్ట్ రిజల్ట్స్ రావాలా? ఈ టాప్-10 సెర్చ్ ట్రిక్స్ మీ కోసమే!
ఇంటర్వ్యూకు సిద్ధం అవుతున్నారా? ఈ టిప్స్ పాటిస్తే ఉద్యోగం గ్యారెంటీ!