ETV Bharat / technology

గూగుల్ న్యూ AI ఫీచర్స్ - ఇకపై మీ పనులన్నీ ఈజీగా కంప్లీట్​! - Google Cloud Next 2024 - GOOGLE CLOUD NEXT 2024

Google Cloud Next 2024 : టెక్ దిగ్గజం గూగుల్​ తమ వర్క్​స్పేస్​ వినియోగదారుల కోసం కొత్త అప్​డేట్స్ తీసుకొచ్చింది. వీటితో యూజర్లు తమ పనులను మరింత సులువుగా చేసుకోవడానికి వీలవుతుందని పేర్కొంది. గూగుల్​ క్లౌడ్​ నెక్ట్స్-2024 కాన్ఫిరెన్స్‌లో ఈ విషయాలను వెల్లడించింది.

Google New AI features
Google Cloud Next 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Apr 10, 2024, 1:35 PM IST

Google Cloud Next 2024 : టెక్ దిగ్గజం గూగుల్ తమ వర్క్​స్పేస్ సూట్​​ వినియోగదారుల కోసం సరికొత్త అప్​డేట్స్​ తీసుకొచ్చింది. గూగుల్ డాక్స్, మీట్, చాట్, షీట్ లాంటి ప్రొడక్టుల్లో అత్యాధునిక ఏఐ సామర్థ్యాలను పొందుపరిచినట్లు తెలిపింది. లాస్​ వెగస్​లో జరిగిన గూగుల్ క్లౌడ్ నెక్ట్స్-2024 కాన్ఫిరెన్స్​లో ఈ విషయాలను వెల్లడించింది.

'Help Me Write' (హెల్ప్​ మీ రైట్)
మొబైల్​లో జీ-మెయిల్స్ ఉపయోగించే వారికి ఈ 'హెల్ప్​ మీ రైట్​' ఫీచర్​ బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రయాణాల్లో ఉన్నప్పుడు మెయిల్స్ కంపోజ్ చేయడం సులభం అవుతుంది. మీరు సింపుల్​గా ఒక్క క్లిక్​ ఇచ్చి వాయిస్​ ద్వారా మీకు కావాల్సిన మేటర్​ను కంపోజ్ చేయవచ్చు. అలాగే 'ఇన్​స్టంట్ పాలిష్​' ఫీచర్​ ద్వారా ఎలాంటి స్పెల్లింగ్, గ్రామర్​​ మిస్టెక్స్ లేకుండా మెయిల్స్​ కంపోజ్​ చేయడానికి వీలవుతుంది.

Google Docs (గూగుల్ డాక్స్)
మీకు కావాల్సిన సమాచారమంతా ఒక డాక్యుమెంట్​లోనే ఉండే విధంగా గూగుల్​ డాక్స్​లో కొత్త ట్యాబ్​ను తీసుకొచ్చింది. కనుక ఇక నుంచి మనకు కావాల్సిన సమాచారం కోసం అన్ని డాక్యుమెంట్​ను వెతకాల్సిన అవసరం ఉండదు. సమాచారమంతా ఒకే చోట ఉంటుంది. అలాగే ఫొటోలను కూడా కావాల్సిన సైజులో పెట్టుకునే విధంగా త్వరలో గూగుల్​ డ్రైవ్​ను అప్​డేట్ చేస్తున్నట్లు తెలిపింది.

Google Meet ( గూగుల్ మీట్)
గూగుల్​ మీట్​లో 'Take Notes for me' అనే ఫీచర్​ తీసుకురానుంది. ఇది మీ కోసం నోట్స్ రాస్తుంది. అందువల్ల మీరు స్వయంగా నోట్స్ రాసుకోవలసిన అవసరం ఉండదు. ఇది ఏఐ సామర్థ్యంతో గూగుల్ మీట్, చాట్​ల్లో పని చేస్తుంది. కాకపోతే ఈ యాడ్-ఆన్​ ఫీచర్​ కోసం నెలకు 10 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. గూగుల్ మీట్​ను ఇప్పుడు గరిష్ఠంగా 5,00,000 మంది ఉపయోగించుకునేలా విస్తరించింది గూగుల్.

Google Chat (గూగుల్ చాట్)
గూగుల్​ చాట్​ ఇప్పుడు జెమిని ఏఐ సాయంతో, అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం ఇస్తుంది. అలాగే ఇది 69 భాషల్లో ఆటోమేటిక్​గా మెసేజ్​లను అనువాదం చేస్తుంది. 4,600 యూజర్ పెయిర్స్​ను సపోర్ట్ చేస్తుంది.

AI Meeting Add-On
ఏఐ మీటింగ్ యాడ్​-ఆన్​తో మన డేటాకు రక్షణ ఏర్పడుతుంది. అంటే మన గూగుల్ డ్రైవ్​లోని సెన్సిటివ్ డేటాను ఎవరూ దొంగలించకుండా కాపాడుతుంది.

Google Sheets
గూగుల్ షీట్​లో మనకు కావాల్సిన ఫార్మాట్​లో డేటాను సులభంగా మార్చుకోవడానికి న్యూ టేబుల్​ ఫీచర్​ను తీసుకువచ్చింది. అలాగే మన డేటాను ఆర్గనైజ్ చేసుకోవడానికి వివిధ రకాల టెంప్లేట్స్​ కూడా అందుబాటులోకి తెచ్చారు.

స్విచ్​​ ఆఫ్​ అయినా మీ ఫోన్​ను ఈజీగా కనిపెట్టొచ్చు! అందుబాటులోకి గూగుల్​ సరికొత్త ఫీచర్​! - Google Find My Device Network

జీ-మెయిల్​లో జెమినీ ఫీచర్​ - ఎంత పెద్ద మెయిల్ అయినా ఇట్టే షార్ట్ అయిపోతుంది! - Gmail Summarize Feature

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.