Disney Reliance Merger Nears Completion: రిలయన్స్‌కు చెందిన వయాకామ్ 18, స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విలీన ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. రిలయన్స్, డిస్నీలకు చెందిన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు నేడే విలీనం కానున్నట్లు తెలుస్తోంది. ఈ విలీనం తర్వాత జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ రెండు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు కలసి ఒకే స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌గా అవతరించనున్నాయి. ఈ నేపథ్యంలో 'జియోస్టార్' పేరితో ఓ కొత్త డొమైన్ తెరపైకి వచ్చింది. అయితే ఆ వెబ్సైట్లో ప్రస్తుతం 'కమింగ్ సూన్' అని మాత్రమే కన్పిస్తుంది.
జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ ప్లాట్‌ఫారమ్‌ల 'జియో స్టార్' పై వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. రెండు సంస్థల విలీనం తర్వాత నవంబర్ 14 నుంచి ఈ డొమైన్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇక నుంచి డిస్నీ+ హాట్‌స్టార్, జియో సినిమాలోని కంటెంట్ అంతా ఒకే చోట దర్శనమివ్వనుంది. అయితే ఐపీఎల్, ఫిఫా వంటి లైవ్ స్పోర్ట్స్ ఈవెంట్లు మాత్రం హాట్‌స్టార్ యాప్‌లోనే ప్రసారం అవుతుందట. జియో సినిమాలో ప్రో కబడ్డీ లీగ్ ప్రసారం అవుతుందని సమాచారం. వీక్షకులకు హై-ఎండ్, ప్రీమియం కంటెంట్‌ను ఇవ్వడమే రెండు సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
జియో సినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ విలీనం అవుతాయన్న వార్తలు బయటకు వచ్చిప్పటి నుంచి అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. జియోహాట్‌స్టార్ పేరుతో కొత్త ఓటీటీ ప్లాట్‌ఫామ్ అవతరించబోతోందని వార్తలు రావడం, ఆ డొమైన్ తనదేనంటూ ఓ యాప్ డెవలపర్ ముందుకు రావడం, తన చదువుకయ్యే ఖర్చు మొత్తం రిలయన్సే భరించాలంటూ పేర్కొనడం అందరికీ తెలిసిందే.
JioStar to launch at midnight, offering combined content from JioCinema and Disney+ Hotstar?#JioStar #JioCinema #DisneyHotstar https://t.co/RE633CnthF
— OTTplay (@ottplayapp) November 13, 2024
ఓ దశలో తక్కువ మొత్తానికే రిలయన్స్‌కు ఇస్తానని పేర్కొని ఒక్కసారిగా ఆ వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత యూఏఈకి చెందిన ఇద్దరు చిన్నారులు తెరపైకి వచ్చి ఈ డొమైన్‌ను ఉచితంగా ఇస్తామని తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో జియోహాట్‌స్టార్ డొమైన్ వ్యవహారానికి ఫుల్‌స్టాప్ పెడుతూ 'జియో స్టార్' అనే కొత్త వెబ్‌సైట్ దర్శనమిచ్చింది.
మీరు యాపిల్ డివైజస్ వాడుతున్నారా?- అయితే కేంద్రం హైరిస్క్ అలర్ట్- వెంటనే ఇలా చేయండి!
మార్కెట్లోకి లగ్జరీ కారు- 3.4 సెకన్లలో 0-100kmph వేగం- 'పెర్ఫార్మెన్స్'లో దీనికి సాటే లేదుగా!