ETV Bharat / technology

'ఏఐలో 12.5 లక్షల ఉద్యోగాలు'- ఈ స్కిల్స్ నేర్చుకో జాబ్ పట్టుకో! - JOBS IN ARTIFICIAL INTELLIGENCE - JOBS IN ARTIFICIAL INTELLIGENCE

Jobs in Artificial Intelligence: ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హవా నడుస్తోంది. ఇప్పటికే అన్ని రంగాలకు వ్యాపించిన ఏఐ ప్రపంచ రూపురేఖలను మార్చేస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐకి అవసరమైన ఈ స్కిల్స్ నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి.

Jobs_in_Artificial_Intelligence
Jobs_in_Artificial_Intelligence (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 21, 2024, 2:22 PM IST

Updated : Aug 21, 2024, 2:40 PM IST

Jobs in Artificial Intelligence: ఇందుగలదందు లేదని సందేహం వలదన్న మాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​కు సరిగా సరిపోతుంది. మనం పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు అడుగడుగునా ఏఐ మన వెన్నంటే ఉంటుంది. విద్య నుంచి వైద్యం, వ్యాపారం నుంచి వ్యవసాయం వరకు అన్ని రంగాల్లో విస్తరించి ప్రపంచ రూపురేఖలను మారుస్తోంది. ప్రపంచం ఏఐ వెంట పరుగులు పెడుతున్న దృష్ట్యా ప్రభుత్వాలు, ప్రైవేటు రంగ సంస్థలు ఏఐపై తప్పక దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఏఐలో భారత్ ప్రపంచ అగ్రగామిగా ఎదగాలి అనే లక్ష్యాన్ని పెట్టుకుంది. అందుకోసం పలు కీలక చర్యలు తీసుకుంటోంది.

ఏఐ​లో 12.5 లక్షల ఉద్యోగాలు: దేశంలోని ఏఐ మార్కెట్ 2022-2027 నాటికి 25 నుంచి 35 శాతం వరకు వృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 2027 నాటికి దేశంలో ఏఐ నైపుణ్యం కలిగినవారి డిమాండ్ 6-6.5 లక్షల నుంచి 12.5 లక్షలకు పెరుగుతుందని ఓ నివేదిక అంచనా వేసింది.

ఇప్పటికే పలు సంస్థల్లో ఏఐ వినియోగం: గత సంవత్సరంలో ఇండియాలోని పలు సంస్థల్లో 43 శాతం మంది ఏఐని ఉపయోగించారు. దాదాపు 60శాతం మంది ఉద్యోగులు, 71శాతం GenZ("Gen Z" is an informal Term for Generation Z, which is the Generation of People Born Between 1997 and 2012)లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలను పొందడం ద్వారా తమ కెరీర్​లో అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చని గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు భారతీయులు కనీసం ఒక డిజిటల్ నైపుణ్యాన్ని నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఏఐకు అవసరమైన స్కిల్స్: జావా, మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, మిషన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీ స్కిల్స్‌ వంటి కోర్సులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్​కు అవసరం అంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధ కోర్సులు నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు.

గ్లోబల్ ఏఐ పవర్‌హౌస్‌గా భారత్: 2030 నాటికి ఇండియా గ్లోబల్ ఏఐ పవర్‌హౌస్‌గా మారుతుందని డెలాయిట్ సౌత్ ఏషియా టెక్ అండ్ ట్రాన్స్‌ఫార్మేషన్ ప్రెసిడెంట్ సతీష్ గోపాలయ్య అన్నారు. ఒక మిలియన్‌కు పైగా అత్యంత నైపుణ్యం కలిగిన టెక్ ప్రొఫెషనల్స్‌తో భారత్ నిలుస్తుందని పేర్కొన్నారు.

ఇన్​స్టాలో మీ కంటెంట్​కు ఎక్కువ వ్యూస్​ రావాలా? ఈ టాప్​ AI ఇన్ఫోగ్రాఫిక్స్​ టూల్స్​​ ట్రై చేయండి! - Best AI Tools Infographics

ఉద్యోగాన్వేషణలో తోడుగా - సరికొత్త AI టూల్స్‌ - ఎలా వాడాలంటే? - LinkedIn AI Tools

Last Updated : Aug 21, 2024, 2:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.