Budget DSLR Cameras In 2024 : నేడు సోషల్ మీడియా హవా ఎలా నడుస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే చాలా మంది కంటెంట్ క్రియేటర్లుగా మారి, తమలోని టాలెంట్‌ను ప్రపంచానికి చూపడానికి ఇష్టపడుతున్నారు. మరి మీరు కూడా ఇలానే మంచి కంటెంట్ క్రియేటర్ అవుదామని అనుకుంటున్నారా? ఇందుకోసం బడ్జెట్లో మంచి డీఎస్ఎల్ఆర్ కెమెరా కొందామని ఆశపడుతున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ప్రస్తుతం మార్కెట్లో రూ.1 లక్ష బడ్జెట్లో చాలా మంచి కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలోని టాప్-5 మిర్రర్‌లెస్ డీఎస్ఎల్ఆర్ కెమెరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. Canon EOS 200D Mark II : తక్కువ బడ్జెట్లో లభిస్తున్న బెస్ట్ కెమెరాల్లో 'కెనాన్ ఈఓఎస్ 200డి మార్క్ 2' ఒకటి. మొదటిసారి డీఎస్ఎల్ఆర్ కొనాలని అనుకుంటున్నవారికి ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. దీని ధర సుమారుగా రూ.55,000 నుంచి రూ.60,000 మధ్యలో ఉంటుంది. ఆన్లైన్లో కన్నా, ఆఫ్‌లైన్‌లోనే కొంచెం తక్కువ ధరకు ఇది లభిస్తుంది.
స్పెసిఫికేషన్స్ :
- 24.1 మెగాపిక్సెల్
- CMOS సెన్సార్,
- APS-C క్రాప్ సెన్సార్
- 4కె వీడియో సపోర్ట్ (25 ఫ్రేమ్స్ పర్ సెకెండ్)
ప్రోస్ అండ్ కాన్స్ : దీనిలో హెచ్డీఎంఐ అవుట్‌పుట్ క్లీన్‌గా ఉండదు. కనుక లైవ్ స్ట్రీమ్ చేయడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది. కానీ డైరెక్ట్‌గా వీడియోలు చేయాలని అనుకునేవారికి ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. దీనిలో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. కనుక మీ ఫొటోలు, వీడియోలు షేక్ కాకుండా చాలా నీట్‌గా వస్తాయి.
2. Sony Alpha A6000 : మీడియం బడ్జెట్లో మంచి కెమెరా కొనాలని అనుకునేవారికి 'సోనీ ఆల్ఫా ఏ6000' మంచి ఆప్షన్ అవుతుంది. దీని ధర రూ.65,000 నుంచి రూ.70,000 మధ్యలో ఉంటుంది.
స్పెసిఫికేషన్స్ :
- 24.2 మెగాపిక్సెల్
- CMOS సెన్సార్
- APS-C క్రాప్ సెన్సార్
ప్రోస్ అండ్ కాన్స్ : దీనిలో క్లీన్ హెచ్డీఎంఐ అవుట్‌పుట్ ఉంటుంది. దీనితో ఫుల్ హెచ్డీ వీడియోలను 60 ఫ్రేమ్స్ పర్ సెకెండ్ రేటుతో రికార్డ్ చేసుకోవచ్చు. కానీ దీనిలో ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు. కనుక గింబల్ లేదా ట్రైపాడ్ ఉపయోగించి మీరు వీడియోలు, ఫొటోలు షూట్ చేయాల్సి ఉంటుంది.
3. Canon M50 Mark II : మార్కెట్లో 'కెనాన్ ఎం50 మార్క్ 2' కెమెరా ధర సుమారుగా రూ.58,000 నుంచి రూ.60,000 వరకు ఉంటుంది. ఇది ఒక మంచి మిర్రర్ లెస్ కెమెరా. ఇది కూడా క్రాప్ సెన్సార్‌తో వస్తుంది.
స్పెసిఫికేషన్స్ :
- 24 మెగాపిక్సెల్
- CMOS సెన్సార్
- APS-C క్రాప్ సెన్సార్
ప్రోస్ అండ్ కాన్స్ : ఈ కెమెరాతో మీరు 4కె వీడియోలను 30 ఫ్రేమ్స్ పర్ సెకెండ్ రేట్‌తో షూట్ చేయవచ్చు. ఫుల్ హెచ్డీ వీడియోలను 60ఎఫ్‌పీఎస్‌తో రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో మనకు క్లీన్ హెచ్డీఎంఐ అవుట్‌పుట్ ఉంటుంది. కనుక లైవ్ వీడియోలు కూడా చేసుకోవచ్చు. ఇందులో డిజిటల్ వీడియో స్టెబిలైజేషన్ కూడా ఉంది. కనుక మీ వీడియోలు, ఫొటోలను ఎలాంటి షేక్స్ లేకుండా రికార్డ్ చేసుకోవడానికి వీలవుతుంది.
4. Sony Alpha ZV-E10 : తక్కువ బడ్జెట్లో మంచి సోనీ కెమెరా కొనాలని అనుకునేవారికి 'సోనీ ఆల్ఫా జెడ్‌వీ-ఈ10' బెస్ట్ ఆప్షన్ అవుతుంది. మార్కెట్లో దీని ధర సుమారుగా రూ.52,000 నుంచి రూ.55,000 రేంజ్లో ఉంటుంది.
స్పెసిఫికేషన్స్ :
- 24.2 మెగాపిక్సెల్
- CMOS సెన్సార్
- APS-C క్రాప్ సెన్సార్
ప్రోస్ అండ్ కాన్స్ : ఈ సోనీ కెమెరాతో మీరు 4కె వీడియోలను 30 ఫ్రేమ్స్ పర్ సెకెండ్ రేట్‌తో షూట్ చేయవచ్చు. ఫుల్ హెచ్డీ వీడియోలను 60ఎఫ్‌పీఎస్‌తో రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో మనకు క్లీన్ హెచ్డీఎంఐ అవుట్‌పుట్ ఉంటుంది. కనుక లైవ్ వీడియోలు కూడా చేసుకోవచ్చు. ఇందులో ఎలక్ట్రానిక్ వీడియో స్టెబిలైజేషన్ కూడా ఉంది. కనుక షేక్స్, బ్లర్స్ లేకుండా వీడియోలు, ఫొటోలు తీసుకోవచ్చు.
5. Panasonic LUMIX G7 : రూ.50వేల కంటే తక్కువ ధరలో మంచి కెమెరా కొనాలని అనుకునేవారికి 'పానసోనిక్ ల్యూమిక్స్ జీ7' మంచి ఛాయిస్ అవుతుంది. దీని ధర సుమారుగా రూ.42,000 నుంచి రూ.45,000 మధ్యలో ఉంటుంది. ఎందుకంటే ఇది కాస్త పాత మోడల్. కానీ దీని పెర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. మరీ తక్కువ బడ్జెట్ ఉన్నవాళ్లు మాత్రమే దీనిని ట్రై చేయవచ్చు.
స్పెసిఫికేషన్స్ :
- 16 మెగాపిక్సెల్
- CMOS సెన్సార్
- APS-C క్రాప్ సెన్సార్
ప్రోస్ అండ్ కాన్స్ : దీనితో 4కె, ఫుల్ హెచ్డీ వీడియోస్ తీసుకోవచ్చు. క్లీన్ హెచ్డీఎంఐ అవుట్‌పుట్ ఉంటుంది. కానీ వీడియో స్టెబిలైజేషన్ ఉండదు.
నోట్-1 : ఈ ఆర్టికల్‌లో చెప్పినవన్నీ క్రాప్ సెన్సార్‌తో వచ్చే డీఎస్ఎల్ఆర్ కెమెరాలే. మీకు కనుక ఫుల్ ఫ్రేమ్ సెన్సార్ కెమెరాలు కావాలంటే, అవి రూ.2 లక్షల కంటే ఎక్కువ ధర కలిగి ఉంటాయి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ కెమెరాల ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. సెల్లర్, సీజన్, డిమాండ్‌ను బట్టి వీటి ధరలు మారుతూ ఉంటాయి. కనుక మీరు డీఎస్ఎల్ఆర్ కెమెరాలు కొనేటప్పుడు వివిధ వెబ్సైట్లలో, ఆఫ్‌లైన్ స్టోర్లలో చెక్ చేసుకోవడం మంచిది.
నోట్-2 : మీకు ఈ డీఎస్ఎల్ఆర్ కెమెరాలతో ఇచ్చే కిట్ లెన్స్ సాధారణంగా ఉంటాయి. మీకు ఇంకా మంచి అవుట్‌పుట్ కావాలంటే, వాటికి సపోర్ట్ చేసే మంచి లెన్స్‌లు వేరేగా కొనాల్సి ఉంటుంది.